వరంగల్‌క్రైం : వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం(సెంట్రల్ జైలు)ను జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ కేశవనాయుడు మూడు రోజులుగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం తనిఖీలో భాగంగా గార్డింగ్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. వారి పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో మెలుగుతూ తమ విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజల కు సరైన సేవలు అందించాలని కోరారు.
అనంతరం జైలులోపల తిరిగి ఖైదీల విన్నపాలను స్వీకరించి అధికారులకు పరిష్కారం చూపారు. అనంతరం కారాగారంలో రికార్డులను పరి శీలించారు. కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి ఎంఆర్.భాస్కర్, ఉప పర్యవేక్షణాధికారి ఎన్.శివకుమార్‌గౌడ్, మహిళా ఉప పర్యవేక్షణాధికారిణి టి.వెంకటలక్ష్మి , డాక్టర్లు టి.మదన్‌మోహన్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, జైలర్లు వి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాస్, ఎ.సాంబశివరావు, పి.వేణుగోపాల్, డిప్యూటీ జైలర్లు, మినిస్ట్రీరియల్ సిబ్బంది, గార్డింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ డీఐజీ తనిఖీ
Published Tue, Dec 2 2014 3:11 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
Advertisement