సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో కలిపి 2022 సంవత్సరంలో 119 మంది ఖైదీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 109 మంది ఉరి వేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణలోని అన్ని జైళ్లలో కలిపి 11 మంది ఖైదీలు సహజ మరణం పొందగా, ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపింది. కాగా 2021తో పోల్చుకుంటే ఖైదీల మరణాలు తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా జైళ్లలో పరిస్థితులు, ఖైదీల మరణాలపై నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఒక నివేదిక రూపొందించింది. ఇందులోని వివరాలను ఇటీవల కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
2022లో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లలో కలిపి 1,955 మంది ఖైదీలు మృతి చెందారు. 1,773 మందిది సహజ మరణం కాగా, 159 మంది అసహజ రీతిలో మరణించారు. మిగతావి మిస్టరీ మరణాలు. సహజ మరణం పొందిన 1,773 మందిలో 1,670 మంది అనారోగ్యంతో, మరో 103 మంది వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు.
అనారోగ్య మృతుల్లో 428 మంది ఖైదీలు గుండె సంబంధ వ్యాధులతో, 190 మంది ఊపిరితిత్తుల సమస్యలతో, మరో 100 మంది క్యాన్సర్ కారణంగా మరణించారు. టీబీ కారణంగా 89 మంది, కిడ్నీ సమస్యలతో 81 మంది, బ్రెయిన్ హెమరేజ్‌తో 58 మంది, డ్రగ్స్, ఆల్కహాల్ విత్ డ్రావల్ లక్షణాల కారణంగా 37 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 351 మంది అనారోగ్యంతో మరణించారు. పశి్చమ బెంగాల్ (174), బిహార్ (167) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అసహజ మరణాల్లో హత్యలు, దాడులు
అసహజ మరణాల్లో 109 మంది ఉరేసుకోగా 10 మంది ఇతర ప్రమాదాల్లో మృతి చెందారు. తోటి ఖై దీల చేతుల్లో నలుగురు హత్యకు గురయ్యారు. బ యటి వారి దాడిలో ఒకరు, కారణాలు తెయని మర ణాలు మరో 25 వరకు నమోదయ్యాయి. అస హజ మరణాల్లోనూ అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లోనే 24 మంది మృతి చెందారు. 17 మందితో కర్ణాటక, 15 మందితో హరియాణ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నా యి.
పారిపోయింది 257 మంది.. పట్టుకుంది 113 మందిని
మొత్తం 257 మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయినట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. వీరిలో 113 మందిని తిరిగి పట్టుకోగలిగారు. 2020లో 355 మంది, 2021లో 312 మంది పారిపోయినట్టు నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment