national crime records
-
ఏడాదిలో 119 మంది ఖైదీల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో కలిపి 2022 సంవత్సరంలో 119 మంది ఖైదీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 109 మంది ఉరి వేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణలోని అన్ని జైళ్లలో కలిపి 11 మంది ఖైదీలు సహజ మరణం పొందగా, ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపింది. కాగా 2021తో పోల్చుకుంటే ఖైదీల మరణాలు తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా జైళ్లలో పరిస్థితులు, ఖైదీల మరణాలపై నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఒక నివేదిక రూపొందించింది. ఇందులోని వివరాలను ఇటీవల కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లలో కలిపి 1,955 మంది ఖైదీలు మృతి చెందారు. 1,773 మందిది సహజ మరణం కాగా, 159 మంది అసహజ రీతిలో మరణించారు. మిగతావి మిస్టరీ మరణాలు. సహజ మరణం పొందిన 1,773 మందిలో 1,670 మంది అనారోగ్యంతో, మరో 103 మంది వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. అనారోగ్య మృతుల్లో 428 మంది ఖైదీలు గుండె సంబంధ వ్యాధులతో, 190 మంది ఊపిరితిత్తుల సమస్యలతో, మరో 100 మంది క్యాన్సర్ కారణంగా మరణించారు. టీబీ కారణంగా 89 మంది, కిడ్నీ సమస్యలతో 81 మంది, బ్రెయిన్ హెమరేజ్‌తో 58 మంది, డ్రగ్స్, ఆల్కహాల్ విత్ డ్రావల్ లక్షణాల కారణంగా 37 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 351 మంది అనారోగ్యంతో మరణించారు. పశి్చమ బెంగాల్ (174), బిహార్ (167) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అసహజ మరణాల్లో హత్యలు, దాడులు అసహజ మరణాల్లో 109 మంది ఉరేసుకోగా 10 మంది ఇతర ప్రమాదాల్లో మృతి చెందారు. తోటి ఖై దీల చేతుల్లో నలుగురు హత్యకు గురయ్యారు. బ యటి వారి దాడిలో ఒకరు, కారణాలు తెయని మర ణాలు మరో 25 వరకు నమోదయ్యాయి. అస హజ మరణాల్లోనూ అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లోనే 24 మంది మృతి చెందారు. 17 మందితో కర్ణాటక, 15 మందితో హరియాణ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నా యి. పారిపోయింది 257 మంది.. పట్టుకుంది 113 మందిని మొత్తం 257 మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయినట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. వీరిలో 113 మందిని తిరిగి పట్టుకోగలిగారు. 2020లో 355 మంది, 2021లో 312 మంది పారిపోయినట్టు నివేదిక తెలిపింది. -
పైశాచికత్వంపై కొరడా!
అతనో డాక్టర్. విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతూ ఆన్లైన్లో ఓ బాలిక పోర్న్ వీడియో చూశాడు. అంతటితో ఆగని వైద్యుడు వీడియోను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాలో ఉన్న తన ఫేక్ ఐడీ ద్వారా పబ్లిక్ డొమైన్లో షేర్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వివరాలన్నింటినీ సేకరించిన పోలీసులు.. ఆ డాక్టర్‌ను అరెస్ట్ చేసేందుకు వెళితే ఆ తప్పు తాను చేయలేదంటూ బుకాయించాడు. తీరా సాక్ష్యాలు చూపించాక తోక ముడవగా నిందితుడిని కోర్టుకు తరలించారు. చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో గత నెల వరకు 1,787 మంది పిల్లల పోర్న్(అశ్లీల) వీడియోలను పలు సామాజిక మాధ్యమాల్లో, స్నేహితులకు షేర్ చేశారు. చట్ట విరుద్ధమైన ఈ నేరానికి పాల్పడిన వాళ్లపై క్రిమినల్ కేసుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందులో భాగంగా నిందితుల వివరాలను 26 జిల్లాల ఎస్పీలకు అందజేయగా.. వాళ్లపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ).. అనేది అమెరికాకు చెందిన ఎలాంటి లాభాపేక్ష ఆశించని స్వచ్ఛంద సంస్థ. 2019లో ఈ సంస్థ మనదేశంతో ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సహకారంతో ఇక్కడ పనిచేస్తోంది. ఈ సంస్థ తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురైన పిల్లలతో పాటు లైంగిక దాడికి గురైన పిల్లల్ని సంరక్షిస్తుంది. అలాగే 18 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలకు సంబంధించిన అసభ్య వీడియోలు(పోర్న్) ఇంటర్నెట్ నుంచి తీసుకుని మరొకరికి చేరవేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడం వంటివి చేస్తే ఆ వీడియోలను తొలగించడంతో పాటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రంలో జిల్లాల వారీగా వివరాలు సేకరించి కేంద్ర హోంశాఖ ద్వారా ఆయా రాష్ట్రాల హోంశాఖలకు పంపుతోంది. లింగ భేదంతో సంబంధం లేకుండా పిల్లల గోప్యత, హక్కులను కాలరాసే ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీఎంఈసీ పంపిన వివరాల ఆధారంగా నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అప్లోడ్ చేసినా, షేర్ చేసినా.. ఇక అంతే! ప్రతి నెలా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలను టిప్‌లైన్ సాంకేతిక వ్యవస్థతో కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర హోంశాఖకు అందుతోంది. ఒక టిప్‌లైన్‌లో ఏ వ్యక్తి ఏ తేదీన, ఏ సమయంలో, ఏ మొబైల్/కంప్యూటర్ నుంచి ఏ పోర్న్ వీడియోను ఆప్‌లోడ్ చేశాడు? ఎందులో షేర్ చేశాడు? ఏ స్థలం నుంచి పోర్న్ వీడియో అప్లోడ్ చేశాడు? ఆ చిత్రం ఎన్ని నిమిషాలు ఉంది? ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరం ఇంటర్నెట్ ప్రొటోకాల్ అడ్రస్? అనే వివరాలను టిప్‌లైన్‌లో నిక్షిప్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక సాక్ష్యాలు కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్‌కు అందుతున్నాయి. పోలీస్ శాఖ దీన్ని జిల్లాల వారీగా విభజించి ఓ ఫైల్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రతి మూడు నెలలకోసారి ఈ అశ్లీల వీడియోలు షేర్ చేసే వారి వివరాలుంటాయి. గత నెల వరకు రాష్ట్రంలో 1,787 మంది ఈ నేరానికి పాల్పడ్డట్టు నివేదిక అందింది. అత్యధికంగా గుంటూరులో 330, విశాఖ 270, ఎన్టీఆర్ విజయవాడ 238, కడప 126, నెల్లూరు 102, ప్రకాశం 94, అనంతపురం 90, తిరుపతి 77, శ్రీకాకుళం 70, చిత్తూరు 59, కాకినాడ 56, ప.గో 50, కర్నూలు 49, బాపట్ల 44, కృష్ణా 30, విజయనగరం 25, నంద్యాల 14, ఏలూరు 14, పల్నాడు 12, కోనసీమ 11, అన్నమయ్య 10, సత్యసాయి 6, అనకాపల్లి 4, పార్వతీపురం 2, రాజమండ్రి 2, అల్లూరి సీతారామరాజు 2 మంది ఈ నేరాలకు పాల్పడ్డారు. కాగా, ఇప్పటివరకు 680 మందిపై కేసులు నమోదయ్యాయి. శిక్షలు కఠినతరం ఈ కేసుల్లో కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు. సాక్ష్యాధారాలు న్యాయస్థానంలో రుజువైతే మొదటిసారి ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రెండోసారి ఇదే తప్పు చేస్తే గరిష్టంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది. -
భయభ్రాంత భారతమా? భయమే ఆయుధమా?
దేశం ఎన్నో విషయాలకు ఉలిక్కిపడు తోంది. అవి 140 పదాల ట్వీట్లు కావొచ్చు, వాట్సాప్ సందేశాలు కావొచ్చు, ఫేస్బుక్ పోస్టులు, ఈ-మెయిల్స్, ఆర్టికల్స్, పుస్తకాలు, పాటలు, నాటకాలు, సినిమాలు... అసలు దేశాన్ని అస్థిరపరచనిది అంటూ ఏదీ లేదు. దేశద్రోహం, మతపరమైన లేదా వర్గపరమైన సెంటిమెంట్లను దెబ్బకొట్టడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులను గనక సంకేతంగా భావిస్తే దేశం వినా శనానికి దగ్గరగా ఉన్నట్టు. ప్రపంచంలోని ఇంకే దేశమూ రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు చేశారని ఆరోపిస్తూ తన సొంత పౌరుల మీద ఇన్ని కేసులు పెట్టదు. ఒకవేళ ఈ కేసులన్నీ వాస్తవమైనవే అయితే, స్పష్టంగా ఈ దేశంలో ఏదో లోపం ఉందని అర్థం. నిర్మాణం లోపభూయిష్టం అయివుండాలి, లేదా ఇక్కడి ప్రజలకు దేశం పట్ల ప్రేమ లేద నుకోవాలి. అలా కానట్టయితే, ‘ఇతరులు’ అనుకునే వాళ్లందరి తోనూ రాజకీయ లెక్కలు సరిచూసుకుంటున్నట్టు. సాధారణంగా ఈ ఇతరులు అనేవాళ్లు ముస్లింలు, వామపక్షీయులు, అర్బన్ నక్సలైట్లు, విద్యార్థులు, ఇంకా ఇతర విస్మృత వర్గాలకు చెందిన కార్యకర్తలు. ఇంకోలా చెప్పాలంటే, ఎవరి అభిప్రాయం అత్యధిక ప్రజలను రెచ్చగొట్టేట్టుగా ఉందో వాళ్లు దేశ వ్యతిరే కులు అవుతారు, వాళ్లను రాజ్యపు సర్వశక్తులతో వేటాడుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2017–19 మధ్య రాజ్యానికి వ్యతిరేకంగా నమోదైన కేసులు 25,118. సగటున ఏడాదికి 8,533. ఈ రాజ్య వ్యతిరేక నేరాల్లో 93 కేసులు దేశ ద్రోహం(సెక్షన్ 124ఎ); 73 కేసులు దేశం మీద యుద్ధం తల పెట్టినవి(సెక్షన్ 121 లాంటివి); 58 కేసులు దేశ సమగ్రతకు సంబంధించినవి(సెక్షన్ 153బి); 1,226 కేసులు ‘ఉపా’. నిజ మైన తీవ్రవాద దాడి ఒక్కటి కూడా దేశంలో జరగని కాలంలో ‘ఉపా’, ‘దేశద్రోహం’ కేసుల్లో వందల మంది అరెస్టయ్యారు. దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారా? ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని హింసామార్గంలో కూలదోయాలని మాట్లా డటం విన్నామా? కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాదులు దేశం నుంచి విడిపోవాలని కోరుకున్నారు. కానీ వాళ్లెప్పుడూ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయాలని మాట్లాడలేదు. 2004లో సీపీఐ (మావోయిస్ట్) సభ్యులు విప్లవం అన్నారు. వాళ్ల ప్రయత్నంలోని నిరర్థకత అర్థమై వాళ్లు కూడా దాని గురించి మాట్లా డటం మానేశారు. దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారంటే, ప్రభుత్వంలో తీవ్ర లోపం ఉందని అర్థం. సుదీర్ఘ కాలంగా ఈ పరిపాలన నడుస్తున్న తీరు ఎంతోమంది యువ కులు, పరిశోధక విద్యార్థులను తీవ్రవాదులుగా మార్చేస్తోందని అర్థం. లేదా ఈ మొత్తం విషయమే ఒక ప్రహసనం. ప్రపంచంలో బహుశా మన ఒక్కదేశంలోనే 73 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా అన్ని రాజకీయ పక్షాల నాయకులు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునివ్వడంలో ఎంత మాత్రమూ అలసిపోరు. ఇక్కడ పాఠశాలల్లో ప్రారంభం నుంచే దేశభక్తిని ప్రబోధిస్తాం, అయినా చాలామంది దేశానికి అశుభం కోరుకుంటారని తలుస్తాం. నిరంకుశత్వం అనే భావన భారత రాజ్యాన్ని పట్టిపీడిస్తోంది. ఏమాత్రం భిన్నాభిప్రాయం పొడ సూపినా మన రాజకీయ నాయకులు తీవ్రమైన అభద్రతకు లోనవుతున్నారు. నిర్మాణాత్మకంగా ఏమీచేయనప్పుడు, వాళ్లు చూపగలిగేది రాజకీయ వ్యూహమే. ‘ఒక్కరిని చంపు, పదివేల మందిని భయపెట్టు’ అంటాడు గొప్ప చైనా వ్యూహకర్త సన్ ట్జూ. ‘ఒక్కరిని తప్పుడు కేసులో ఇరికించు, పదివేలమందిని భయపెట్టు’ అని భారతదేశం దీన్ని నవీకరించింది. 2017–19 మధ్య 6,250 కేసులు భిన్న వర్గాల మధ్య వైరాన్ని పెంచడం అన్న కారణంతో నమోదైనవి. ఇవన్నీ కూడా సెంటిమెంట్లను దెబ్బతీశారని పెట్టినవి. విశ్వగురువుగా చెప్పు కునే దేశంలోని ప్రజలు ఇంత అతిసున్నిత మనస్కులు అయ్యారా? దైవదూషణ చట్టం మన దగ్గర లేదుగానీ 153ఎ, 295ఎ సెక్షన్లను మితిమీరి వాడటం పరిస్థితిని దానికంటే దిగ జారుస్తోంది. అనుద్దేశపూర్వకంగా ఏదైనా మతాన్ని అవమా నిస్తే అదేమీ నేరం కాదని 1957 నాటి రామ్‌జీ లాల్ మోదీ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా, ద్వేషంతో చేసేదే నేరం. వీళ్లు చాలడం లేదని ఈమధ్య మనకు ‘అంతర్జాతీయ కుట్రదారులు’ కూడా తయారయ్యారు. 1976లో ఒక కేసులో తీర్పిస్తూ వి.ఆర్.కృష్ణ అయ్యర్ తన మద్దతుదారులకంటే విమర్శకుల నుంచే ఎక్కువగా ప్రభుత్వం నేర్చుకోగలదని వ్యాఖ్యానించారు. అలాంటిది తేలికపాటి హాస్యానికి కూడా పోలీసు కేసులు పెట్టే రోజులొచ్చాయి. అంటే దేశం ‘భయభ్రాంత భారత్’ అవుతోందని అర్థం. లేదంటే, తన ప్రజలను పాలించడానికి భయం అనే ఆయుధాన్ని వాడుతోం దని అనుకోవాలి. ఎన్.సి. ఆస్థానా వ్యాసకర్త విశ్రాంత ఐపీఎస్ అధికారి, కేరళ మాజీ డీజీపీ -
ఠాణా నుంచి ఇంటర్‌పోల్ దాకా..
సాక్షి, హైదరాబాద్: రాజధాని కమిషనరేట్ పరిధిలో ప్రతీక్షణం రద్దీగా ఉంటే ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ హత్య జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఫింగర్ ప్రింట్ సేకరించారు. అనుమానిత వేలిముద్రలను ఫింగర్ ప్రింట్‌బ్యూరో, ఫ్యాక్ట్ (ఫింగర్ ప్రింట్ అనాలసిస్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్) ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. అతికొద్ది నిమిషాల్లోనే నిందితుడిని గుర్తించారు. నిందితుడు పాత నేరస్తుడు ఎంజే నాగరాజుగా తేలింది. దీంతో అతడి కోసం వేట సాగించిన పోలీసులు 24 గంటల్లోనే నేరస్థుడిని కటకటాల్లోకి పంపించారు. రెండేళ్ల క్రితం వరకు కేవలం రాష్ట్రానికి చెందిన నిందితుల వేలిముద్రల డాటా మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటర్‌పోల్‌లో ఉన్న నిందితుల జాబితా వరకు ఆన్లైన్ డేటా బేస్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటగా రాష్ట్ర పోలీస్ శాఖ... టెక్నాలజీని వినియోగించి నేరాల నియంత్రణకు విశేషంగా ప్రయత్నిస్తున్న పోలీస్ శాఖ.. కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు కోసం వేలిముద్రల డేటాబేస్‌ను ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌తో అనుసంధానించింది. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఫింగర్ ప్రింట్స్ డేటాను ఆన్లైన్లో అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉండేలా సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్)తో సైతం అనుసంధానించింది. ఇలా 9 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 1.22 లక్షల నేరస్తుల వేలిముద్రలను డేటాబేస్‌లో పెట్టి 868 పెండింగ్ కేసులను ఛేదించింది. అలాగే రూ.7.2కోట్ల సొత్తును స్వాధీనం చేసుకుంది. 42 గుర్తు తెలియని మృతదేహాలను సైతం గుర్తించింది. ఆటోమేటెడ్ ఫింగర్ ఫ్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను పెట్రోలింగ్ సిబ్బందికి మొబైల్యాప్ ద్వారా అందించింది. దీంతో క్షణాల్లో ఘటన స్థలి నుంచే నిందితుడు పాత నేరస్తుడా? లేకా కొత్తగా నేరం చేశాడా? అన్నది తేలిపోతుంది. ఇంటర్‌పోల్ జాబితా సైతం... కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్‌లో ఓ వ్యక్తి హత్య జరిగింది. నిందితుడు దేశం దాటి పారిపోయినట్లు అక్కడి పోలీసులు ఇంటర్‌పోల్‌కు సమాచారమిచ్చారు. ఇంటర్‌పోల్ నుంచి మన సీబీఐకి సమాచారం అందింది. నిందితుడి అనుమానిత వేలిముద్రలను సీబీఐ–ఎన్సీఆర్బీ ఫ్యాక్ట్‌లోని వేలిముద్రలతో సరిపోల్చి పంజాబ్‌కు చెందిన ఏపీ సింగ్‌గా గుర్తించారు. ఇలా విదేశాల్లో, మన దేశంలో జరిగిన హత్య కేసుల దర్యాప్తులో ఇప్పుడు ఫ్యాక్ట్ ఫింగర్ ప్రింట్ కీలకంగా మారింది. ఇంటర్‌పోల్‌కు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ డేటాను సైతం మన దేశంలోని ఏ స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచైనా దర్యాప్తు అధికారులు అనాలిసిస్ చేసుకునే వెసులుబాటు దొరికింది. దేశవ్యాప్తంగా 11.68లక్షలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు సేకరించిన వేలిముద్రల డేటా ఫ్యాక్ట్‌లో అందుబాటులో ఉంది. ఇలా ఈ ఏడాది మే చివరి వరకు 11,68,775 ఫింగర్ ప్రింట్స్ డేటా బేస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇంటర్‌పోల్ నుంచి మన డేటాబేస్ అనాలిసిస్ కోసం 15,718 ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. ప్రతీ నెలా దేశవ్యాప్తంగా 7,162 వేలిముద్రలు ఫ్యాక్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఆన్లైన్ డేటాబేస్కు వస్తున్నట్లు సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో తెలిపింది. -
పిల్లలపై అత్యాచారాలను అరికట్టలేమా?
పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్త వినని రోజు లేదు. ఈ పరిస్థితి ఏ ఒక్క రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితమైంది కాదు. భారతదేశం యావత్తు రోజుకు పదుల సంఖ్యలో ఈ ఘటనలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో గణాంకాల మేరకు 2014లో దేశవ్యాప్తంగా 89,423 ఘటనలు చోటు చేసుకుంటే పిల్లలపై ఈ అత్యాచారాలు 2015–94,172కి పెరిగాయి. ఇక 2016లో ఈ సంఖ్య 1,06,958కి చేరుకోగా 2017లో రెండు లక్షలు దాటిందని అంచనాలు వేస్తున్నారు. దేశం వెలుపలా, దేశం లోపలా కేంద్ర ప్రభు త్వం అత్యంత విమర్శకు గురైన కథువా ఘటనకు కంటితుడుపు చర్యగా ప్రజల ముందు కోర్టుల ముందు తామూ ఏదో చేశామని చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అదరా బాదరాగా సవరించి పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష వేసేలా చట్టాన్ని సవరించి చేతులు దులుపుకున్నారు. దీంట్లోనూ బాధిత బాలికల వయసు 12 ఏళ్లలోపు ఉంటేనే నిందితుడికి ఉరిశిక్ష అని పేర్కొన్నారు. 12 ఏళ్ల పైబడిన బాధితుల మాట ఏంటి? ఇక బీజేపీ అధికారం చేపట్టిన తర్వాతి కాలంలో నాలుగున్నర లక్షల అత్యాచార ఘటనలు జరిగాయి. ఇందులో ఎంతమందిని ఉరితీయగలరు. కేవలం శిక్షల ద్వారా నేరాలు తగ్గుతాయనుకుంటే నిర్భయ చట్టం ద్వారా నేరాలు తగ్గాయా? పిల్లలపై జరిగిన అత్యాచారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రాజకీయ కోణంలో చూస్తున్నాయనడానికి ఏపీలో గుంటూరులోని దాచేపల్లిలో ఓ పసిపాపపై అత్యాచారం జరిగితే, నింది తుడు సుబ్బయ్య ఏపీ ప్రతిపక్ష నాయకుడితో ఉన్న ఫొటోను చూపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న పాలక పక్షానికి నిందితుణ్ణి పట్టుకుని శిక్షించడం, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపన లేకపోవడం చూసి అసహ్యం కలుగుతోంది.నేరాలు జరిగాక శిక్షలు వేస్తామనడం కంటే నేరాలు జరగకుండా చూడటానికి ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే పిల్లలను కొంతమేరకైనా రక్షించుకోగలం కానీ కేవలం రాజకీయ కోణంలో చూస్తే పిల్లలు అత్యంత అన్యాయానికి గురౌతారు. అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం ‘ 93910 24242 -
డ్రంక్ & డ్రైవ్..
సంవత్సరం 2015 ప్రమాదాలు 5,01,423 మృతులు 1,46,133 మద్యం, డ్రగ్స్ వల్ల ప్రమాదాలు 16,298 రోజుకు19 మంది.. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో దేశంలో మరణిస్తున్న వారి సంఖ్య ఇదీ. 2015లో దేశంలో మొత్తం 5,01,423 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. 1,46,133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 16,298(3.2 శాతం) ప్రమాదాలు మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగినవే అని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. 2015లో డ్రంక్ అండ్ డ్రైవ్ , డ్రగ్స్ కారణంగా జరిగే ప్రమాదాల్లో 6,755 మంది మృత్యువాతపడగా.. 18,813 మంది క్షతగాత్రులయ్యారు. ఇక 2015లో ప్రతి పది నిమిషాలకు తొమ్మిది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ గణాంకాలు వెల్లడించాయి. తక్కువగా అంచనా వేస్తున్నారు.. మద్యం తాగడం వల్ల జరిగే ప్రమాదాలను తక్కువగా అంచనా వేస్తున్నారని యేల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ సర్వేకు సహ నేతృత్వం వహించిన డేనియల్ కెనిస్టన్ చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడం ఆలస్యమైతే.. ప్రమాదానికి మద్యం కారణమా కాదా అనేది తెలుసుకోవడం కష్టమవుతుందని చెప్పారు. అమెరికా పరిశోధకులు, రాజస్థాన్ పోలీసులు కలసి ఆ రాష్ట్రంలో ఓ యాంటీ డ్రంక్ అండ్ డ్రైవ్ పోగ్రామ్‌ను అమలు చేశారు. ఒక నిర్దిష్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల్లో దీనిని అమలు చేయగా.. రాత్రిపూట జరిగే ప్రమాదాల సంఖ్య 17 శాతం తగ్గగా.. మరణాల సంఖ్య 25 శాతం తగ్గింది. పోలీసు తనిఖీలను విస్తృతం చేస్తే రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని వీరు చెపుతున్నారు. 2010–2011 మధ్య జరిగిన ఈ సర్వే నివేదిక ఇటీవల విడుదలైంది. మద్యం వల్లే ఎక్కువ.. సాధారణంగా డ్రైవర్ల తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల కంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని అమెరికా బోస్టన్‌లో ఉన్న మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధన యూనిట్ అబ్దుల్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్(జే–పీఏఎల్)కు చెందిన పరిశోధకులు, రాజస్థాన్‌లో రాష్ట్ర పోలీసుల సర్వేలో వెల్లడైంది. మద్యం సేవించడం వల్ల సాధారణంగా జరిగే 2.4 ప్రమాదాలకు ఒకరు మరణిస్తుంటే.. మందు తాగి ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించడం.. ఘాట్ రోడ్డులో ప్రయాణించడం వల్ల జరిగే 2.9 ప్రమాదాల్లో ఒకరు.. అడ్డదిడ్డంగా వాహనాన్ని నడపడం వల్ల ప్రతి 3.06 ప్రమాదాలకు ఒకరు మృత్యువాత పడుతున్నారట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం అన్ని ప్రమాదాల్లోనూ మద్యం తాగడం వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య 1.5 శాతం. ఇతర కారణాలతో పోలిస్తే అతి ఎక్కువగా జరుగుతున్న ప్రమాదాలు ఇవే. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో 42 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే ఓవర్ స్పీడ్ వల్ల 30 శాతం.. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్ల 33 శాతం.. వాతావరణ పరిస్థితుల వల్ల 36 శాతం మంది మరణిస్తున్నారు. - సాక్షి తెలంగాణ డెస్క్ -
మహిళలకు ఢిల్లీ ఇప్పటికీ ప్రమాదకరమే!
మహిళలకు ఏమాత్రం భద్రత లేని నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన నేరాలు 5 శాతం తగ్గినా, రాజధానిలో మాత్రం మహిళలకు భద్రత పూర్తిగా కొరవడింది. 2014 సంవత్సరంతో పోలిస్తే 2015లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు దేశవ్యాప్తంగా కొంతవరకు తగ్గినట్లు జాతీయ నేరాల లెక్కల్లో తెలిసింది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో అత్యాచారాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని ఈ వివరాల ద్వారా తేలింది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాలు 4 శాతం పెరిగాయి. సగటున దేశంలో ఇతర ప్రాంతాల కంటే మహిళలు అత్యాచారాలకు గురయ్యే ప్రమాదం ఢిల్లీలోఏ 4 రెట్లు ఎక్కువ అని ఇప్పటికే చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 2015 సంవత్సరంలో 32,127 హత్యలు, 34,651 అత్యాచారాలు, 36,188 దోపిడీలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇవి 5 శాతం తగ్గాయి. 2014లో మహిళలపై 3.37 లక్షల నేరాలు జరగ్గా, 2015లో 3.27 లక్షలు జరిగాయి. అయితే పిల్లలపై నేరాలు మాత్రం 89 వేల నుంచి 94 వేలకు పెరిగాయి. పోలీసు దళాల్లో సిబ్బంది సంఖ్య తగినంతగా లేకపోవడంతో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశమే కనిపించడం లేదని అంటున్నారు.