బుక్కరాయసముద్రం : ఓపెన్ ఎయిర్ జైలు సిబ్బంది, జీవిత ఖైదీలు సమష్టిగా జైలు అభివృద్ధికి కృషి చేయాలని రాయలసీమ జైళ్ల శాఖ డీఐజీ జయవర్ధన్ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని ఓపెన్ ఎయిర్ జైలులో సిబ్బంది, ఖైదీలతో సమావేశం నిర్వహించారు. జైలులో ఎంత మంది ఖైదీలు ఉన్నారు? ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అంకితభావంతో పని చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ గోవిందరాజులును ఆదేశించారు. అలాగే జీవిత ఖైదీలు నియమ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.