చెన్నై, సాక్షి ప్రతినిధి: హత్య, హత్యాయత్నం, దోపిడీ తదితర నేరాలకు సంబంధించి పలువురు నిందితులు జైళ్లలో కాలం గడుపుతున్నారు. వాయిదాలపై వాయిదాలతో అటు కోర్టులకు, ఇటు జైళ్లశాఖకు వారు భారమైపోతున్నారు. జైలు, కోర్టుల మధ్య నిందితులను తిప్పడం పరిమిత సంఖ్యలో ఉన్న పోలీసు సిబ్బందికి క ష్టంగా తయారైంది. వాయిదాలకు హాజరుపరిచే సమయంలో ఖైదీ పరారీ కాకుండా చూడడం పోలీసులకు సవాలుగా మారింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇందుకు పరిష్కారంగా జైల్ అదాలత్ నిర్వాహించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది.
నిబంధనల పరిధిలోకి వచ్చిన ఖైదీలను విడుదల చేయడమే అదాలత్ ముఖ్య ఉద్దేశం. నేరానికి తగిన శిక్షాకాలంలో 50 శాతం పూర్తి చేసినవారు, న్యాయవాదులను నియమిం చుకోలేని, కోర్టులు విధించే జరిమానాలను చెల్లించలేని పేదల కేసులను జైల్ అదాలత్ పరిధిలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయా కేటగిరీలకు చెందిన నిందితు లు అదాలత్‌కు హాజరై న్యాయమూర్తుల సమక్షంలో నేరాన్ని అంగీకరించి, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన నిందితులను విడుదల చే యవచ్చ ని సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొం ది. మొత్తం ఈ ప్రక్రియను రెండునెలల్లోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
తమిళనాడులో 9 సెంట్రల్ జైళ్లు, 3 మహిళా జైళ్లు, 5 ప్రత్యేక జైళ్లు, 9 జిల్లా జైళ్లు, 95 జోనల్ జైళ్లు ఇలా మొత్తం 121 జైళ్లు ఉన్నాయి. చెన్నై పుళల్ సెంట్రల్ జైలులో 2,223 మంది మగ ఖైదీలు, 120 మహిళా ఖైదీలు, 2,343 విచారణ ఖైదీలు ఉన్నారు. కడలూరులో 275, పళయంగాడులో 550, తూత్తుకూడి, కన్యాకుమారిలో 300 ఇలా మొత్తం 7వేల మంది ఖైదీలు ఉన్నారు. ఆదివారం రాత్రి వరకు రాష్ట్రంలోని 121 జైళ్లలో అదాలత్ నిర్వహించి 3 వేల కేసులను పరిశీలించి మొత్తం 2500 మంది ఖైదీలు విడుదలకు అర్హులుగా తేల్చినట్లు సోమవారం న్యాయూధీశులు ప్రకటించారు. ఒక్క పుళల్ సెంట్రల్ జైలుకు సంబంధించే 850 మంది విచారణ ఖైదీలు విడుదల కానున్నారు.
వీరిలో చెన్నై జిల్లాకు చెందిన వారు 290 మంది, కాంచీపురం జిల్లావారు 260 మంది, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన ఖైదీలు 304 మంది ఉన్నారు. అలాగే సేలం సెంట్రల్ జైలు నుంచి మొత్తం455 మందిలో సేలం, ధర్మపురి, కృష్ణగి రి, నామక్కల్ జిల్లాలకు చెందిన ఖైదీలు ఉన్నా రు. తిరునెల్వేలీ, తూత్తుకూడి, కన్యాకుమారికి చెందిన 174 మంది, కడలూరు సెంట్రల్ జైలు నుంచి కడలూరు, విళుపురం జిల్లాల ఖైదీలు 170 మందికి విముక్తి కలగనుంది.
మదురై సెంట్రల్ జైలు నుంచి మదురై, దిండుగల్లు, విరుదునగర్, రామనాథపురం జిల్లాలకు చెందిన 57 మందికి విముక్తి ప్రసాదించారు. తిరుచ్చికి చెందిన 58 మందిలో 48 మంది విడుదలకు నోచుకోవడం విశేషం. వేలూరులో 39, కోయంబత్తూరులో 23 మంది విడుదలకు అర్హులయ్యూరు. జైల్ అదాలత్‌పై జెళ్లశాఖ ఐజీ మవురియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమకు ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు. అయినా రాష్ట్రంలో విచారణ ఖైదీల జాబితాను సిద్ధం చేశామని తెలిపారు. సుప్రీం కోర్టు నుంచి తగిన ఆదేశాలు అందగానే జైల్ అదాలత్ ప్రకారం విడుదలకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి హోంశాఖకు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం ఖైదీల విడుదలకు సన్నాహాలు చేస్తామని తెలిపారు.
అక్టోబర్‌లో ఖైదీల విడుదల
Published Tue, Sep 9 2014 12:36 AM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM
Advertisement
Advertisement