
జైళ్లలో గర్భిణులకు సౌకర్యాలు లేవు!
►వైద్య సదుపాయాలు, ప్రసవ ఏర్పాట్లూ లేనే లేవు
►హైకోర్టుకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ నివేదిక
►ఆ నివేదికను బట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేయండి
►సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేయండి
►ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: విచారణ ఎదుర్కొంటూ జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ మహిళా ఖైదీ లు, వారి పిల్లలు, గర్భిణులకు అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నివేదించారు. అత్యధిక శాతం జైళ్లలో వైద్య సదుపాయాలు లేవని, రెసిడెంట్ మెడికల్ డాక్టర్లు కూడా లేరని, చాలా చోట్ల ఈ పోస్టు ఖాళీగా ఉందన్నారు. జైళ్లలో ఉన్న గర్భిణులను చెకప్‌లు, ప్రసవా ల నిమిత్తం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళుతు న్నారని, ఏ జైలులో కూడా ప్రసవ ఏర్పాట్లు లేవని వివరించారు. పుట్టి న పిల్లలను తల్లితోనే ఉండేందుకు అను మతినిస్తున్న జైలు అధికారులు, ఆ పిల్లలకు వాతావరణ పరిస్థి తులకు తగినట్లుగా దుస్తుల సౌకర్యం కల్పించడం లేదన్నారు. అత్యధిక జైళ్లలో అంతర్గత విద్య, వినోద ఏర్పాట్లు లేవని తెలిపారు. ‘రాష్ట్రంలోని జైళ్లలో నలుగురు గర్భిణులు, తల్లులతో పాటు 35 మంది పిల్లలు ఉన్నారు. చాలా జైళ్లలో పిల్లలకు వండిపెట్టేందుకు ఏర్పాట్లేవీ లేవు. పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో జైళ్లలో ఎటువంటి రికార్డులను నిర్వహించ డం లేదు. దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో వాక్సిన్లు వేస్తున్నారు. ఖైదీలకు దూరంగా పిల్లలు ఉండేందుకు అత్యధిక జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లేవీ లేవు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో మానసిక వైకల్యంతో బాధప డుతున్న 112 మంది ఉన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారం మినహా మిగిలిన జైళ్లలో ఎక్కడా మానసిక వైకల్యంతో బాధపడు తున్న వారికి ప్రత్యేక వసతి ఏర్పాట్లు లేవు. రాష్ట్రంలోని అన్నిజిల్లాల న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శులు 4 కేంద్ర కారా గారాలను, ఒక ఓపెన్ ఎయిర్ జైల్, 3 ప్రత్యేక మహిళా జైళ్లు, 8 జిల్లా జైళ్లు, 4 స్పెషల్ సబ్‌జైళ్లు, 66 సబ్‌జైళ్లు సందర్శిం చారు. వారి వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించాం’ అని సభ్య కార్యదర్శి తన నివేదికలో పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి కూడా ఓ నివేదికను సమర్పించారు. గురువారం ఈ నివేదికల్ని న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఈ నివేదికలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరి శీలన చేసి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలతో నివేదికలు సమర్పించాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బాల నేరస్తులు, మహిళా ఖైదీల హక్కుల కోసం రాష్ట్రాలేం చర్యలు తీసుకుంటు న్నాయో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల్ని∙గతం లో నివేదికలు కోరిన విషయం తెలిసిందే.