అక్రమ ఖైదీలకు పరిహారం ఇవ్వరా?
విశ్లేషణ
న్యాయస్థానం విధించిన శిక్ష కన్నా ఎక్కువ కాలం ఖైదీని జైల్లో నిర్బంధిస్తే ఆ ఖైదీకి పరిష్కారమేమిటో తెలి యజేయాల్సిన బాధ్యత జైళ్ల అధికారులపైన లేదా? తనను అనవసరంగా 18 రోజుల కాలం ఎక్కువగా నిర్బంధిం చారని, దీనికి పరిష్కారం ఏమిటని తీహార్ జైలునుంచి విడుదలైన ఒక మాజీ ఖైదీ ఓం ప్రకాశ్ గాంధీ ఆర్టీఐ కింద అడిగారు.
ఆర్టికల్ 21 కింద జీవన స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్య్రాలకు రాజ్యాంగం హామీ ఇస్తున్నది, న్యాయస్థానం నిర్దేశించిన శిక్ష నుంచి జైలు అధికారులు మంచి నడ వడిక ఆధారంగా తగ్గింపు చేస్తారు. ఆ కాలాన్ని కూడా తగ్గించి ఖైదీని విడుదల చేయాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు ప్రకారం శిక్ష అనుభవించి జైలునుంచి విడుదైలైన తర్వాత మాజీ ఖైదీ ఓం ప్రకాశ్ ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా తన హక్కులకు సంబంధించి అనేక పత్రాలను సంపాదించారు. ఆ పత్రాల ఆధారంగా, తాను ఆగస్టు 15, 2014న విడుదల కావలసి ఉండగా, 19న విడు దల చేశారని, తమకు అధికారులు ఇచ్చిన 15 రోజుల రెమిషన్ కూడా ఇవ్వలేదని తేల్చారు. 18 రోజుల అక్రమ నిర్బంధానికి ఎవరు బాధ్యులని ఓం ప్రకాశ్ గాంధీ అడిగారు.
దానికి ప్రజాసమాచార అధికారి (పీఐఓ) ఎవరినీ శిక్షాకాలం కన్నా ముందే విడుదల చేసే ప్రసక్తే ఉండదని, ఒకవేళ ఎక్కువ కాలం నిర్బంధిస్తే అందుకు ఖైదీ న్యాయస్థానానికి వెళ్లి పరిహారం కోరాల్సి ఉంటుం దని జవాబిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదుల విభాగానికి అతను విన్నవించుకోవడం మినహా మరే ఇతర ఏర్పాటూ లేదని వివరించారు. రెండో అప్పీలు విచారణలో అధికారులు, ైఖైదీని 18 రోజుల పాటు అదనంగా జైల్లోనే ఉంచారన్న మాటను ఖండించలేదు. ఒకవేళ వేరే నేరం కేసులో ఈ ఖైదీ అండర్ ట్రయల్ ఖైదీ అయితే విడుదల చేయడం సాధ్యం కాదని వివరించారు. అయితే ఓం ప్రకాశ్ గాంధీ మరో కేసులో అండర్ ట్రయల్ ఖైదీ అని ఎలాంటి రుజువులూ చూపలేదు. ఇంతటి కీలకమైన ప్రాథమిక హక్కుకు సంబంధించి విధానం లేకపోవడం మంచి పాలనా విధానం కాజాలదు. కోర్టుకు వెళ్లండి అని చెప్పడం సరైన సమాధానమూ కాదు.. సమాచారమూ కాదు.
వ్యక్తి జీవన హక్కును, వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రా లను వ్యవస్థాపితమైన న్యాయవిధానాల ద్వారా హరించవలసిందే తప్ప మరో విధంగా హరించడా నికి వీల్లేదని మన సంవిధానం ఆర్టికల్ 21 నిర్దే శిస్తున్నది. పొరపాటుననో లేదా నిర్లక్ష్యం వల్లనో ఎక్కువ రోజులు నిర్బంధించామనే వాదనకు ఆస్కా రం లేదు. ఒక వేళ ఆ విధంగా నిర్బంధిస్తే అందుకు బాధ్యుడైన అధికారి పరిహారం చెల్లించవలసి ఉం టుంది. లేదా అతని పక్షాన ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే అని న్యాయనియమాలు వివరి స్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, వర్సెస్ చల్లా రామ కృష్ణారెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఈ అంశంపై 26.4. 2000 సంవత్సరంలో ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఖైదీల పైన శత్రువులు దాడిచేసి ఒకరిని చంపేస్తారు. గాయ పడిన బంధువులు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వ జైళ్ల శాఖపై దాఖలు చేసిన కేసు ఢిల్లీ దాకా వెళ్లింది. ఈ సంఘటనకు జైలు అధికారుల నిర్లక్ష్యం కారణ మని భావించి అందుకు ప్రభుత్వం పరిహారం చెల్లిం చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డీపీ వాధ్వా, ఎస్ సాగిర్ అహ్మద్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశిం చింది. ఈ కేసులోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లక్షా 44 వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశిం చింది. దానిపైన రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.
మరో కీలకమైన కేసులో విచారణఖైదీ రుదుల్‌షా జైల్లో ఉన్న సమయంలో కింది కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించి, విడుదల చేయాలని ఆదేశించింది. కాని ఆ తరువాత కూడా రుదుల్ షాను 14 సంవత్సరాల పాటు జైల్లో ఉంచారు. ఒక ప్రజా ప్రయోజన వాజ్యంలో ఈ దారుణంపై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిం దేనని, రుదుల్ షా వర్సెస్ బీహార్ రాష్ర్టం ఏఐఆర్ 1983/1086 కేసులో 1 ఆగస్టు 1983న తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారమే మొదటి నిర్బంధం జరిగిన ప్పటికీ, శిక్షాకాలం తీరిన తరువాత కూడా కొనసాగిం చడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు వివరించింది.
సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(సి) ప్రకా రం ప్రజాబాహుళ్యానికి వర్తించే విధానాలు రూపొం దించినపుడు ప్రభుత్వ విభాగాలు ఆ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తమంత తామే ప్రచురించాలని నిర్దేస్తున్నది. అంటే జైళ్లలో అక్ర మంగా కారాగారవాసాన్ని పొడిగిస్తే అందుకు పరి ష్కారం ఏమిటి? దాన్ని ఏ విధంగా సాధించాలి? ఎవరిని పరిష్కారం అడగాలి? ఏ విధంగా? అనే వివ రాలను ప్రభుత్వ సంస్థ ఇవ్వవలసి ఉంటుంది.
పరిహారం ఇవ్వాలంటే ప్రత్యేకంగా దానికోసమే ఒక పిటిషన్ వేయాలని జైలు అధికారులు అన్నారు. ఈ రెండో అప్పీలునే పరిహారం కోరే పిటిషన్‌గా భావించాల్సి ఉంది. ఇప్పటికైనా ఓం ప్రకాశ్ గాంధీ నుంచి దరఖాస్తు తీసుకుని పరిశీలించాలని, ఇటు వంటి కేసులకు సంబంధించి పరిహారం చెల్లించే విధానాన్ని రూపొందించవలసిన బాధ్యత ఉందని కమిషన్ గుర్తుచేసింది.
(ఓం ప్రకాశ్ గాంధీ వర్సెస్ తీహార్ జైలు కేసు ఇఐఇ/అ/అ/2015/000431లో 29.3.2016న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్,
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com