
హైదరాబాద్‌కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు.
గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు.
'జన్యుపరమైన కారణాల వల్లే'
మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఇలా ఒకే కాన్పుల్లో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెప్పారు. ఒకే కాన్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణమని, అయితే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీజైగోటిక్ అంటారని తెలిపారు వైద్యులు.
(చదవండి: అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!)
Comments
Please login to add a commentAdd a comment