ఒక మహిళ గర్భం ధరించడం పిల్లలను కనడం అనేది అత్యంత కఠిన నియమాతో కూడిన పని. అయిన మాతృత్వపు మమకారంతో ప్రతి స్త్రీ సునాయాసంగా ఆ బాధ్యతను మోస్తుంది. అయితే ఎవరైనా మహా అయితే ఐదుగురు లేదా పది మంది వరకు కనడం గురించి విని ఉంటాం. ఏకంగా 69 మంది పిల్లలను కనడం గురించి విన్నారు. ఈ విషయాన్ని గుర్తించి గిన్నిస్ రికార్డుల్లో సైతం ఆ మహిళ పేరుని నమోదు చేశారు అధికారులు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎక్కడ జరిగిందంటే..
ఈ అరుదైన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఒకరు కాదు, నలుగురు కాదు, ఒక మహిళ ఏకంగా 27 సార్లు గర్భం దాల్చింది. ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. రష్యా నివాసి అయిన వాలెంటినా వాసిలీవ్ అనే మహిళ 1725 మరియు 1765 మధ్య 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది. మాస్కోలోని స్థానిక ప్రభుత్వ నివేదిక ప్రకారం, రష్యన్ రైతు ఫియోడర్ వాసిలీవ్ భార్య వాలెంటినా వాసిలీవ్ సుమారు 27 ప్రసవాలతో 69 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది.
అందులో 16 మంది కవలలే ఉండటం విశేషం. అంటే ఏడు ప ఏడు ప్రసవాల్లో ట్రిపులెట్స్‌ని, నాలుగు ప్రసవాల్లో నలుగురు చొప్పున పిల్లలను ప్రసవించింది. చరిత్రలో జరిగిన ఈ వింతను వెలికితీసి గుర్తించడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ తల్లి పేరును అత్యంత ఫలవంతమైన తల్లిగా నమోదు చేసింది. రష్యాలోని కొన్ని చారిత్రక పుస్తకాల్లో దీని గురించి ఉంది. పైగా ప్రజలు కూడా ఈ విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ రైతు ఫియోడర్ వాసిలీవ్ మరొక స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఎనిమిది సార్లు గర్భవతి అయ్యి 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది.
దీంతో వాసిలీవ్ మొత్తం 87 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిలో 84 మంది మాత్రమే జీవించి ఉన్నారు. మిగిలిన ఏడుగురు పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే చనిపోయినట్లు నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా..ఒక మహిళ అన్ని సార్లు గర్భం ధరించడం సాధ్యమేనా అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సంతాన సాఫల్య వైద్యుడు జేమ్స్ సెగర్స్ పరిశోధన చేశారు. ఆయన తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇక్కడ వాలెంటినా 40 సంవత్సరాల వ్యవధిలో 27 గర్భాలకు తగినంత సమయం కలిగి ఉంటేనే ఇంతమంది పిల్లలను కనగలదని అన్నారు.
అంతేగాదు ఒక స్త్రీ సైన్సు పరంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ మందిని కనగలదని చెప్పారు. మహిళలు సాధారణంగా 15 సంవత్సరాల వయస్సులో రుతుక్రమంలోకి వస్తారు. వారి అండాశయాలు ప్రతి 28 రోజులకు ఒక గుడ్డును విడుదల చేయడం ప్రారంభిస్తాయి. మెనోపాజ్‌లో గుడ్డు సరఫరా అయిపోయే వరకు ఈ అండోత్సర్గము కొనసాగుతుంది. ఈ అండోత్సర్గం తగ్గిపోయే మహిళ వయసు 51 ఏళ్లు అని తెలిపారు.
ఇక్కడ ప్రసవాల సంఖ్య పెరిగే కొద్ది సంతానోత్పత్తి స్థాయి పడిపోతుంటుందని, ముఖ్యంగా 40 ఏళ్లు సమీపించేటప్పటికీ ప్రతి చక్రానికి బిడ్డ పుట్టే అవకాశం ఒక్క శాతంగానే ఉంటుందని అన్నారు. ఇక్కడ ఈ మహిళ వాలెంటినా 18 ఏళ్ల వరకు ప్రసవిస్తూనే ఉండి ఉండాలి. అలా ఆలోచిస్తే.. అన్ని సార్లు మహిళ గర్భం ధరించడం అనేది ఆమెకు బిడ్డకు చాలా ప్రమాదకమరమైనది, పైగా సాధ్యం కాదని అన్నారు జేమ్స్ సెగర్స్.
Comments
Please login to add a commentAdd a comment