విమానంలో ప్రయాణిస్తుండగా ప్రయాణికురాలికి సడెన్‌గా పురిటి నొప్పులు.. | Woman Gives Birth On Pegasus Airplane As Shocked Passengers | Sakshi
Sakshi News home page

విమానంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికురాలికి సడెన్‌గా పురిటి నొప్పులు.. టేకాఫ్‌ చేసేలోపే..

Published Tue, Nov 21 2023 5:17 PM | Last Updated on Tue, Nov 21 2023 5:27 PM

Woman Gives Birth On Pegasus Airplane As Shocked Passenger  - Sakshi

విమానం ప్రయాణిస్తుండగా ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని టేకాఫ్‌ చేసేందుకు సన్నద్ధమయ్యేలోపే ఆ మహిళ ప్రసవించింది. ఈ అరుదైన షాకింగ్‌ ఘటన ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఓ అంతర్జాతీయ విమానంలో జరిగింది. 

వివరాల్లోకెళ్తే..టర్కీ నుంచి ఫ్రాన్స్‌కి బయలుదేరిన పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తుండగా ఓ మహిళ ప్రయాణికురాలు సడెన్‌గా ప్రసవ వేదను గురైంది. దీంతో సిబ్బంది వేగంగా స్పందించి ఆమెను మరొక చోటుకి తరలించారు. అక్కడ పారామెడిక్స్‌ బృందం ఆమెకు డెలివరీ చేయడంలో సహయం చేసింది. ఈ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది విమానాన్నిటేకాఫ్‌ చేయాలనకున్నారు. కానీ అంతలోనే విమానంలోనే ఆ మహిళ  ఓ శిశువుకి జన్మనిచ్చింది.

అయితే ఆ శిశువు నెలలు నిండకుండానే పుట్టడమేగాక వెంటనే ఏడవకపోవడంతో పారామెడిక్స్‌ సంబంధిత ఎయిర్‌పోర్ట్‌ఇక చెందిన అత్యవసర సేవలకు సమాచారం అందించారు. విమానం ప్రాన్స్‌లోని మారంసెయిల్లో టేకాఫ్‌ అవ్వగానే ఓ పారామెడిక్‌ మహిళ ఆ నవజాత శిశువును గుడ్డలో చుట్టి విమానం ముందు భాగంలోకి హుటాహుటినా తీసుకు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా షాక్‌కి గురయ్యారు. ఆ నవజాత శిశువుని, ఆ మహిళను అంబులెన్స్‌ సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

వాస్తవానికి గర్భిణిలు నెలలు సమీపిస్తున్న తరుణంలో చాలా వరకు ఫ్లైట్‌ జర్నీ చేయరు. అందువల్ల విమానంలో ప్రసవం జరగడం అనేది అత్యంత అసాధారణం. అయితే ఇలాంటి ఘటనలు విమానంలో కొత్తేమి కూడా కాదు. ఎందుకంటే  ఇలాంటి ఘటనే ఈక్వెడార్‌లోని గుయాకిల్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు కేఎల్‌ఎం రాయల్ డచ్ విమానంలో కూడా చోటు చేసుకుంది. తాను గర్భవతి అని తెలియని ఓ మహిళా ప్రయాణికురాలు బాత్రూంకని వెళ్లి అనుకోకుండా ఓ బిడ్డకు ప్రసవించి అందర్నీ షాక్‌కి గురి చేసింది.

అదీగాక ఏవియేషన్, స్పేస్, అండ్ ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ జర్నల్‌లో వైద్యులు ఇలాంటి అకస్మాకి ప్రసవాలు ప్రతి 32 వేల మందిలో ఒకళ్లకు జరుగుతాయని అన్నారు. ఆ టైంలో మహిళలు ఫ్లైట్‌ జర్నీ చేస్తే నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇది మీకు, బిడ్డకు కూడా ప్రమాదమని చెప్పుకొచ్చారు. ఆకాశంలో పయనించేటప్పుడూ ఆక్సిజన్‌ తక్కువగా ఉండటంతో ఇలాంటి అనుకోని ఘటనలు జరుతుంటాయని అన్నారు వైద్యులు.

(చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement