Air plane
-
విమానంలో ప్రయాణిస్తుండగా ప్రయాణికురాలికి సడెన్‌గా పురిటి నొప్పులు..
విమానం ప్రయాణిస్తుండగా ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని టేకాఫ్ చేసేందుకు సన్నద్ధమయ్యేలోపే ఆ మహిళ ప్రసవించింది. ఈ అరుదైన షాకింగ్ ఘటన ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఓ అంతర్జాతీయ విమానంలో జరిగింది. వివరాల్లోకెళ్తే..టర్కీ నుంచి ఫ్రాన్స్‌కి బయలుదేరిన పెగాసస్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తుండగా ఓ మహిళ ప్రయాణికురాలు సడెన్‌గా ప్రసవ వేదను గురైంది. దీంతో సిబ్బంది వేగంగా స్పందించి ఆమెను మరొక చోటుకి తరలించారు. అక్కడ పారామెడిక్స్ బృందం ఆమెకు డెలివరీ చేయడంలో సహయం చేసింది. ఈ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానాన్నిటేకాఫ్ చేయాలనకున్నారు. కానీ అంతలోనే విమానంలోనే ఆ మహిళ ఓ శిశువుకి జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు నెలలు నిండకుండానే పుట్టడమేగాక వెంటనే ఏడవకపోవడంతో పారామెడిక్స్ సంబంధిత ఎయిర్పోర్ట్ఇక చెందిన అత్యవసర సేవలకు సమాచారం అందించారు. విమానం ప్రాన్స్‌లోని మారంసెయిల్లో టేకాఫ్ అవ్వగానే ఓ పారామెడిక్ మహిళ ఆ నవజాత శిశువును గుడ్డలో చుట్టి విమానం ముందు భాగంలోకి హుటాహుటినా తీసుకు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా షాక్‌కి గురయ్యారు. ఆ నవజాత శిశువుని, ఆ మహిళను అంబులెన్స్ సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గర్భిణిలు నెలలు సమీపిస్తున్న తరుణంలో చాలా వరకు ఫ్లైట్ జర్నీ చేయరు. అందువల్ల విమానంలో ప్రసవం జరగడం అనేది అత్యంత అసాధారణం. అయితే ఇలాంటి ఘటనలు విమానంలో కొత్తేమి కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి ఘటనే ఈక్వెడార్‌లోని గుయాకిల్ నుంచి ఆమ్స్టర్డామ్కు కేఎల్ఎం రాయల్ డచ్ విమానంలో కూడా చోటు చేసుకుంది. తాను గర్భవతి అని తెలియని ఓ మహిళా ప్రయాణికురాలు బాత్రూంకని వెళ్లి అనుకోకుండా ఓ బిడ్డకు ప్రసవించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. అదీగాక ఏవియేషన్, స్పేస్, అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ జర్నల్‌లో వైద్యులు ఇలాంటి అకస్మాకి ప్రసవాలు ప్రతి 32 వేల మందిలో ఒకళ్లకు జరుగుతాయని అన్నారు. ఆ టైంలో మహిళలు ఫ్లైట్ జర్నీ చేస్తే నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇది మీకు, బిడ్డకు కూడా ప్రమాదమని చెప్పుకొచ్చారు. ఆకాశంలో పయనించేటప్పుడూ ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో ఇలాంటి అనుకోని ఘటనలు జరుతుంటాయని అన్నారు వైద్యులు. (చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..) -
ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ చైనా పర్యటనలో భాగంగా తన అధికారిక బృందంతో కలిసి రెండు విమానాల్లో బయలుదేరి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ మిత్రదేశమైన చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ తన ప్రతినిధుల బృందంతో కలిసి బయలుదేరారు. అయితే వారంతా ఒక బోయింగ్ 757 విమానంలో వెళుతుండగా వెనుక మరో విమానాన్ని కూడా తమ వెంట తీసుకుని వెళ్లారు. అది ప్రస్తుతం ఫిలిపీన్స్ లోని మనీలా వరకు వారితో పాటు వెళ్ళింది. ఈ నేపథ్యంలో వెల్లింగ్టన్ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయిన చైనాతో జరగబోయే చర్చలు ప్రయోజనకరంగా సాగాలని దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఒక వేళ ఒక విమానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయంగా రెండో విమానం ఉపయోగపడుతుందని ఈ విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ బోయింగ్ 757 విమానాలు 30 ఏళ్ల నాటివి. వాటి సర్వీసు ముగింపు దశకు వచ్చింది. 2028 లేదా 2030లో వాటిని మార్చే అవకాశముందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నాయకులు న్యూజిలాండ్ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదేదో ఒక ఫోన్ చార్జర్ పని చేయకపోతే ఇంకో చార్జర్ వెంట తీసుకుని వెళ్ళినట్టుందని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వెయ్యి ఏళ్ల నాటి మసీదు సందర్శించిన మోదీ.. ప్రత్యేకత ఏంటంటే.. -
విమాన ప్రయాణం విషాదాంతం
ఖాట్మండు: నేపాల్‌లో తారా ఎయిర్ సంస్థకు చెందిన 43 ఏళ్లనాటి పాత విమానం ఆదివారం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. శకలాలను గుర్తించారు. రెండు ఇంజన్లు గల ఈ చిన్నపాటి ప్యాసింజర్ విమానంలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. సెంట్రల్ నేపాల్‌లో పర్యాటక నగరమైన పొఖారా నుంచి సరిగ్గా ఉదయం 10.15 గంటలకు బయలుదేరింది. పశ్చిమ నేపాల్‌లోని జోమ్సమ్ ఎయిర్‌పోర్టులో ఉదయం 10.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా, బయలుదేరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తారా ఎయిర్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా చెప్పారు. ముస్తాంగ్ జిల్లాలోని కోవాంగ్ గ్రామం వద్ద మనపతీ హిమాల్ కొండచరియల కింద లామ్చే నది ఒడ్డున విమానం శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా పైలట్ ప్రభాకర్ ఘిమిరే మొబైల్ సిగ్నల్స్ ట్రాక్ చేసి, విమానం జాడ కనిపెట్టినట్లు నేపాల్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అయితే, ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. ప్రయాణికుల్లో ముంబై సమీపంలోని థానేకు చెందిన ఆశోక్ కుమార్ త్రిపాఠి, ఆయన భార్య వైభవీ బండేకర్, వారి పిల్లలు ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠితోపాటు ఇద్దరు జర్మనీ పౌరులు, 13 మంది నేపాలీలు, ముగ్గురు నేపాల్ సిబ్బంది ఉన్నట్లు తారా ఎయిర్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా వెల్లడించారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేపాల్‌లో 2016లో తారా ఎయిర్‌కు చెందిన విమానం ఇదే పొఖారా–జోమ్సమ్ మార్గంలో కూలిపోయింది. విమానంలోని 23 మంది దుర్మరణం పాలయ్యారు. A Tara Air flight carrying 19 passengers from Pokhara to Jomsom has been reported to have lost contact with the control tower. Aircraft: De Havilland Canada DHC-6-300 Twin Otter Reg: 9N-AET@flightradar24 @KanakManiDixit @HArjyal pic.twitter.com/2H1KI3u1Oy — NepalLinks (@NepaliPodcasts) May 29, 2022 The flight manifest. Source: Devendra Dhakal FB pic.twitter.com/9bTCfvNIBQ — Kanak Mani Dixit (@KanakManiDixit) May 29, 2022 -
విమానం టేకాఫ్ అవుతుండగా..
కోల్‌కతా : ఖతార్ ఎయిర్వేస్కు చెందిన కోల్‌కతా- దోహ విమానాన్ని గురువారం తెల్లవారుజామున టేకాఫ్ అవుతున్న సమయంలో వాటర్ ట్యాంకర్ ఢీకొంది. కో్ల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 100 మంది ప్రయాణీకులున్నారు. ఘటన జరిగిన వెంటనే వారందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేశారు. విమానం పాక్షికంగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. కాగా ఉదయం 2.30 గంటలకు ప్రయాణీకులు విమానంలోకి ఎక్కుతున్న క్రమంలో వాటర్ ట్యాంకర్ విమానం ల్యాండింగ్ గేర్‌కు సమీపంలో మధ్య భాగాన్ని ఢీకొట్టిందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన వెంటనే ప్రయాణీకులను దించివేసి తనిఖీలు చేపట్టారని, ప్రయాణీకులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సమీప హోటల్లో ప్రయాణీకులందరికీ వసతి సౌకర్యం కల్పించామని, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానంలో వారిని దోహా తరలిస్తామని వెల్లడించారు. వాటర్ ట్యాంకర్ బ్రేక్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే విమానాన్ని ఢీ కొట్టిందని ఏఏఐ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఏఏఐ అధికారులు పేర్కొన్నారు. -
'ఉగ్రవాదుల మాటలు నమ్మకండి'
కైరో: దర్యాప్తు నివేదిక వచ్చే వరకు ప్రజలు ఓపిక పట్టాలని, అప్పటి వరకు ఎలాంటి వదంతులు నమ్మవద్దని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి అన్నారు. రష్యా విమానాన్ని తామే కూల్చివేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడమే కాకుండా ఆ విమానం కూలిపోతున్నప్పటి దృశ్యాలను కూడా అది విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు రష్యా ప్రభుత్వం ఈజిప్టు ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను గాల్లో ఎలా వదిలేస్తున్నారంటూ సంరక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారంటూ అసంతృప్తి పెల్లుబికే అవకాశం పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన వివరణ ఇచ్చారు. మరోపక్క, రష్యా కూడా సాంకేతిక లోపం కారణంగానే విమాన కూలిపోయి ఉంటుంది తప్ప ఏ ఉగ్రవాద సంస్థ దానిపై దాడి చేయలేదని పేర్కొంది. రష్యా నుంచి బయలుదేరిన విమానం బయలు దేరిన 23 నిమిషాల్లోనే కూలిపోయి 220మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనపట్ల పలు రకాల అనుమానాలున్నాయి. -
మూడు గంటలు ప్రయాణించి వెనక్కి!
ఎయిర్ ఇండియా విమాన పైలట్ నిర్వాకం న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి గంట ఆలస్యంగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం మూడుగంటలపాటు ప్రయాణించిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. ఎయిరిండియా ప్రతినిధుల వివరాల ప్రకారం... ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (ఏఐ 121) శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు 200 మంది ప్రయాణికులతో షెడ్యూలు కంటే గంట ఆలస్యంగా ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. తర్వాత మూడు గంటలపాటు గాలిలో ప్రయాణించిన తర్వాత మిగతా ప్రయాణ సమయంపై లెక్కలు వేసుకున్న పైలట్ కంగుతిన్నాడు. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి నైట్ కర్ఫ్యూ(రాత్రిపూట ప్రవేశం ఉండదు) సమయంలోగా చేరుకోవడం సాధ్యం కాదని, ఆ తర్వాత అక్కడికి చేరినా విమానాన్ని దింపడం కుదరని గ్రహించాడు. అలాగే విమానం ఆలస్యం అయినందున ఒక పైలట్‌కు పరిమితి ఉన్న డ్యూటీ సమయం కూడా మించిపోతుందని గుర్తించాడు.ఇక చేసేదేమీ లేక విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించాడు. దీంతో అసలే ఆలస్యం.. ఆపై సగందూరం వెళ్లి వెనక్కి వచ్చేసరికి ప్రయాణికులంతా ఉసూరుమన్నారు. కాగా, ప్రయాణికులకు వసతి సౌకర్యాలు కల్పించామని, వారిని ఆదివారం ఉదయం మరో విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్‌కు పంపుతామని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.