'ఉగ్రవాదుల మాటలు నమ్మకండి' | Sisi asks people to wait for probe in Russian plane crashing | Sakshi
Sakshi News home page

'ఉగ్రవాదుల మాటలు నమ్మకండి'

Published Sun, Nov 1 2015 9:24 PM | Last Updated on Thu, Jul 11 2019 6:15 PM

'ఉగ్రవాదుల మాటలు నమ్మకండి' - Sakshi

'ఉగ్రవాదుల మాటలు నమ్మకండి'

కైరో: దర్యాప్తు నివేదిక వచ్చే వరకు ప్రజలు ఓపిక పట్టాలని, అప్పటి వరకు ఎలాంటి వదంతులు నమ్మవద్దని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి అన్నారు. రష్యా విమానాన్ని తామే కూల్చివేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడమే కాకుండా ఆ విమానం కూలిపోతున్నప్పటి దృశ్యాలను కూడా అది విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు రష్యా ప్రభుత్వం ఈజిప్టు ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రాణాలను గాల్లో ఎలా వదిలేస్తున్నారంటూ సంరక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారంటూ అసంతృప్తి పెల్లుబికే అవకాశం పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన వివరణ ఇచ్చారు. మరోపక్క, రష్యా కూడా సాంకేతిక లోపం కారణంగానే విమాన కూలిపోయి ఉంటుంది తప్ప ఏ ఉగ్రవాద సంస్థ దానిపై దాడి చేయలేదని పేర్కొంది. రష్యా నుంచి బయలుదేరిన విమానం బయలు దేరిన 23 నిమిషాల్లోనే కూలిపోయి 220మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనపట్ల పలు రకాల అనుమానాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement