మాస్కో: తూర్పు రష్యాలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ ఘటన విషాదాంతమైంది. హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్ నుంచి చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు.
హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నవారిలో అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
A Vityaz Aero Mil Mi-8 helicopter (RA-25656) impacted terrain at an elevation of 900 m after taking off from the Vachkazhets volcano in Kamchatka Krai, Russia. At least 17 occupants have reportedly died:https://t.co/qGBfRTfp6z pic.twitter.com/fEUPuoUZQ4
— Aviation Safety Network (ASN) (@AviationSafety) September 1, 2024
ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్‌చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి శనివారం(ఆగస్టు31) బయల్దేరింది. కానీ, గమ్యస్థానానికి చేరలేదు.
వచ్కజెట్స్ సమీపంలో రాడార్ నుంచి హెలికాప్టర్ మాయమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్లు తరచు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ రష్యాలో వాటిని ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment