![Russian Helicopter With 22 On Board Goes Missing](/styles/webp/s3/article_images/2024/08/31/helicopter.jpg.webp?itok=8DlrgrKQ)
మాస్కో: తూర్పు రష్యాలోని కమ్‌చత్కాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతయింది. హెలికాప్టర్‌లో ఉన్నవారిలో 19 మంది ప్రయాణికులు కాగా ముగ్గురు సిబ్బంది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ రవాణా ఏజెన్సీ తెలిపింది.
ఎంఐ-8టి శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ శనివారం(ఆగస్టు31) కమ్‌చత్కాలోని వచ్కజెట్స్ అగ్నిపర్వతం వద్ద నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరలేదని సమాచారం. హెలికాప్టర్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానం చేరిన తర్వాత పైలట్ల వద్ద నుంచి రావాల్సిన సమాచారం రాలేదు.
హెలికాప్టర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన హెలికాప్టర్ 1960లో తయారైన డబుల్ ఇంజిన్ హెలికాప్టర్. ఈ మోడల్ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ వీటిని రష్యాతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా వాడుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment