మాస్కో: రష్యాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆ దేశానికి చెందిన లోహ విహంగాలు ఏదో ఒక కారణంగా కుప్పకూలిపోతున్నాయి. తాజాగా, ఓ హెలికాప్టర్ కుప్పకూలి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదిహేనుమందిని ఆస్పత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. 22మంది ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బందితో కలిసి వెళుతున్న మిగ్-8 హెలికాప్టర్ రష్యాలోని ఉత్తర క్రాస్నోయార్క్ ప్రాంతంలో ప్రమాదానికి గురై కుప్పకూలిపోయింది.
దీనికి సమీపంలోనే ఓ విమానాశ్రయం కూడా ఉంది. అంతకుముందు రష్యాకు చెందిన విమానం ఒకటి ఉగ్రవాదుల దాడిలో కూలిపోగా, మొన్న టర్కీ సేనలు ఓ సుఖోయ్ యుద్ధ విమానాన్ని కూల్చి వేశారు. తాజాగా, ఓ మిగ్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. సాంకేతిక కారణాల మూలంగానే హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని అధికారులు చెప్తున్నారు. రెండు టర్బైన్లు ఉండే ఈ హెలికాప్టర్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. దాదాపు 50 దేశాలు వీటిని ఉపయోగిస్తున్నారు.
కుప్పకూలిన రష్యా హెలికాప్టర్
Published Thu, Nov 26 2015 5:46 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM
Advertisement