మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ మారణహోమంలో ఇప్పటివరకు 137కు మంది మృతి చెందారు. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. అయితే దారుణాకి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదే విషయాన్ని అమెరికా సైతం బహిరంగంగా ధృవీకరిస్తూ ప్రకటనలు చేయటం గమనార్హం. అయితే అమెరికా ప్రకటనలపై తాజాగా రష్యా స్పందించింది. ఉక్రెయిన్, ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమిర్ జలెన్‌స్కీని రక్షించటం కోసమే అమెరికా.. ఈ దాడిని ఐసిస్‌పైకి నెడుతోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా అన్నారు. తాను అమెరికా వైట్ హౌస్‌ను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నిజంగా ఈ దాడికి పాల్పండింది ఐసిస్ అని మీరు (అమెరికా) ఖచ్చితంగా చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే అభిప్రాయం మీద అమెరికా ఉండగలదా? అని నిలదీశారు.
గతం మధ్య ప్రాచ్య దేశాలకు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా జోక్యం చేసుకోవటం వల్ల రాడికల్, ఉగ్రవాదుల అధిపత్యం పెరిగిందని మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ క్రీయాశీలకంగా ఉండటాని అమెరికా జోక్యమే కారణమన్నారు. ఇలా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని తెలిపారు. నియంత్రణ వైఖరితో ప్రపంచాన్ని ఉగ్రవాదులకు మద్దతుగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఉక్రెయిన్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించి అమెరికా చేస్తున్న వ్యాఖ్యలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికే.. కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పుతిన్ ఆరోపణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందిస్తూ.. మాస్కో మారణహోమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు తమకు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment