Russian Forces Desroy Seven Civilians: ఉక్రెయిన్ రష్యా మధ్య గత 18 రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు రష్యా ప్రపంచ దేశాల విజ్ఞప్తి మేరకు మానవతా సాయం దృష్ట్యా నివాసితులను, విదేశీయులను తరలించేంత వరకు యద్దానికి విరమణ ప్రకటించింది. తొలుత రష్యా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించలేదు కూడా. రాను రాను మరింత విజృంభించింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో విద్యార్థులను, విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేంత వరకు యుద్ధానికి బ్రేక్ అంటూ తన జౌదార్యం అనే ముసుగు వేసుకుంది. కానీ ఆ తర్వాత రష్యా తన తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. అంతేకాదు రష్యా ఉక్రెయిన్ దురాక్రమణలో భాగంగా అనేక దుశ్చర్యలకు పాల్పడింది.
నివాసితుల గృహాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. ఇక అంతటి ఆగకుండా ఇప్పుడు మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా వారిపై కర్కశంగా దాడులు చేస్తుంది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కి సుమారు 36 కి.మీ దూరంలో ఉన్న పెరెమోగా అనే చిన్న గ్రామంలోని ప్రజలను తరలిస్తున్న శరణార్థుల కాన్వాయ్ పై రష్యా బహిరంగంగా కాల్పుల జరిపింది. పైగా ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారని, వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తెలిపింది.
నిజానికి పెరెమెగా అంటే ఉక్రెనియల్‌లో విజయం అని అర్థం. రష్యన్ యుద్ధ ట్యాంకులు ఈ గ్రామం మీదుకు రాజధాని కైవ్ వైపుకు దూసుకుపోతున్నాయి. ఆ క్రమంలోనే రష్యా ఈ క్రూరమైన చర్యలకు పాల్పడిందని పేర్కొంది. మిగిలిన నిర్వాసిత ప్రజలను బలవంతంగా తమ గ్రామానికి తిరిగి తీసుకువచ్చిందిని, పైగా ఎంతమంది ఈ ఘటనలో గాయపడ్డారో కూడా తెలియలేదని వెల్లడించింది. ప్రస్తుతం తాము వారి గురించి తెలుసుకోవడం, మానవతాసాయం అందించడం వంటివి దాదాపు అసాధ్యం అని ఆవేదనగా తెలిపింది.అంతేకాదు అమాయక పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోని రష్యా యుద్ధ నేరానికి పాల్పడిందని ఆక్రోశించింది.
Comments
Please login to add a commentAdd a comment