స్టెరిలైట్ ప్లాంట్ వ్యతిరేక ఆందోళన ఫోటో
సాక్షి,ముంబై: తమిళనాడులోని తూత్తుకుడిలో కాల్పుల ఉదంతంతో వేదాంత షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. వేదాంతకు చెందిన స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ ప్రజలు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నాటి మార్కెట్లో వేదాంతా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. 5.5 శాతానికిపైగా క్షీణించి 10 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. జూలై 5, 2017 నాటి స్థాయికి పడిపోయింది.
తమిళనాడును అట్టుడికించిన తూత్తుకూడి ఘటనపై స్టెరిలైట్ కంపెనీ సీఈవో రామనాధ్ స్పందించారు. ఈ విధ్వంసం వెనుక కరుడుగట్టిన శక్తులు ఉన్నాయని విమర్శించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి పర్యావరణ కాలుష్యం సహా, ఇతర అన్ని నిబంధనలకనుగుణంగానే తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తదుపరి వాదనలు జూన్ 6వతేదీన ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment