ముంబై: మిరే అస్సెట్‌కు చెందిన ఎం.స్టాక్ ‘మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ’ (ఎంటీఎఫ్)ను ఆరంభించింది. 7.99 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. పరిశ్రమలోనే ఇది కనిష్ట వడ్డీ రేటుగా పేర్కొంది. ఈక్విటీలకు సంబంధించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తక్షణమే నిధుల సదుపాయం పొందొచ్చని తెలిపింది. 700 స్టాక్స్‌కు సంబంధించి 80 శాతం మార్జిన్‌ను పొందొచ్చని వివరించింది.
మార్జిన్ ఫండింగ్ (రుణం)తో కొనుగోలు చేసిన షేర్లను ఎంత కాలం పాటు అయినా కొనసాగించుకోవచ్చని తెలిపింది. ట్రేడర్లు రూపాయి బ్రోకరేజీ లేకుండా అపరిమిత డ్రేడ్స్ చేసుకోవచ్చని ఈ సంస్థ ప్రకటించింది. రూ.10 లక్షల వరకు ఫండింగ్‌పై 9.49 శాతం రేటు, రూ.10–25 లక్షల మధ్య తీసుకుంటే రూ.8.99 శాతం రేటు, రూ.25 లక్షలకు పైగా ఫండింగ్ తీసుకున్న వారికి 7.99 శాతం రేటును వసూలు చేస్తున్నట్టు తెలిపింది. షేర్ల ప్లెడ్జ్ (ఫండింగ్ కోసం), అన్ ప్లెడ్జ్ లావాదేవీపై కేవలం రూ.12 వసూలు చేస్తున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment