Mirae Asset India
-
మిరే అసెట్ నుంచి నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్
హైదరాబాద్: మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాలి. ఏక్తా గాలా దీనికి ఫండ్ మేనేజరుగా ఉంటారు. 12 టాప్ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇది ట్రాక్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందనున్న బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు, మెరుగైన రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ హెడ్ (ఈటీఎఫ్ ప్రోడక్ట్) సిద్ధార్థ్ శ్రీవాస్తవ తెలిపారు. మొండి బాకీల సమస్యను వదుల్చుకున్న బ్యాంకింగ్ రంగం గత కొన్నాళ్లుగా మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్ విప్లవంతో ఈ రంగం మరింత వృద్ధి చెందగలదని చెప్పారు. -
ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెడుతున్న మ్యూచువల్ ఫండ్ ఇదే
దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, అందులోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ పట్ల సానుకూలంగా ఉన్న వారు.. ఈ విభాగంలో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆరంభం నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే చక్కని పనితీరుతో దూసుకుపోతోంది. సెబీ 2017లో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వర్గీకరణకు ముందు ఈ పథకం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌తో ఉండేది. అనంతరం ఎక్కువ పెట్టుబడులను లార్జ్ క్యాప్ విభాగానికి కేటాయించే విధంగా మార్పులు చేసింది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం కిందకు ఇది వస్తుంది. 5 స్టార్ రేటెడ్ పథకం కావడం గమనార్హం. రాబడులు ఈ పథకంలో ఏడాది రాబడులు 19 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షికంగా 26 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. అలాగే, ఐదేళ్లలో వార్షికంగా 17 శాతం, ఏడేళ్లలో వార్షికంగా 18 శాతం, పదేళ్లలో 23 శాతం చొప్పున రాబడులను అందించింది. కానీ, ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా భావించే బీఎస్ఈ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ సూచీ పెరుగుదల ఏడాదిలో 21 శాతం, మూడేళ్లలో 24 శాతం, ఐదేళ్లలో 14 శాతం, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో 14.58 శాతం చొప్పునే ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. ఏడాది కాలం మినహాయిస్తే మిగిలిన అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. ఇక ఈ పథకం 2010 జూలై 9న ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా 19.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది. పెట్టుబడుల విధానం లార్జ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం, గరిష్టంగా 65 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ పథకం గత పనితీరును పరిశీలించినట్టయితే కొన్ని సందర్భాల్లో వెనుకబడినప్పటికీ.. తర్వాతి సంవత్సరాల్లో అద్భుత రాబడులతో సగటున మెరుగైన పనితీరును చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ముఖ్యంగా భవిష్యత్తులో బ్లూచిప్ కంపెనీలుగా అవతరించే సామర్థ్యాలున్న మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలను గుర్తించి వాటిల్లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.25,332 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం తనవద్దనున్న పెట్టుబడుల్లో 98.66 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ముఖ్యంగా మెగాక్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 55 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉండగా, మిడ్‌క్యాప్‌లో 40 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ కొంచెం అదనపు రాబడులను దీర్ఘకాలంలో ఇస్తాయి. కనుక మూడు విభాగాల్లోనూ ఎక్స్పోజర్ ఉండడం రాబడుల పరంగా అనుకూలమైనది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 79 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాల స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 28 శాతం వరకు పెట్టుబడులను ఈ రంగంలోని కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 9 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆటోమొబైల్ కంపెనీలకు 8.32 శాతం పెట్టుబడులు కేటాయించింది. టెక్నాలజీ రంగ కంపెనీల్లో 8.23 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7.85 శాతం, సేవల రంగ కంపెనీల్లో 7.66 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. -
సంపద సృష్టికి అనుకూలమైన ఫండ్: ఫండ్ రివ్యూ
మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్‌ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్‌క్యాప్‌లో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. ఎందుకంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో ఉంటుంది. మల్టీక్యాప్ ఫండ్స్ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది. రాబడులు ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి అన్ని కాలాల్లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు ఇవ్వలేక పోయింది. ఇందుకు మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది తప్పిస్తే దీర్ఘకాలంలో నమ్మకమైన పనితీరును గమనించొచ్చు. మూడేళ్లలో 20 శాతం, ఐదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా పరిగణించే ‘నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్ఐ’ రాబడులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో వరుసగా 7 శాతం, 18 శాతం, 13 శాతంగానే ఉండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగంలో చక్కని రాబడుల చరిత్ర కలిగిన పథకం ఇది. పదేళ్లలో వార్షిక రాబడి 22 శాతంగా ఉంటే, ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి వార్షిక ప్రతిఫలం 20 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌నకు 35-65 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంది. నగదు నిల్వలను ఎక్కువగా ఉంచుకోకుండా, పెట్టుబడులను దాదాపుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.24,643 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 99 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉండగా, మిగిలిన ఒక శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లో 53.5 శాతం లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 42 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 4 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 71 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే 36 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రంగ స్టాక్స్‌లో 28 శాతం వరకు ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాత ఆటోమొబైల్‌లో కంపెనీల్లో 9.46 శాతం, ఇంధన రంగ కంపెనీల్లో 9.36 శాతం, టెక్నాలజీలో 8.22 శాతం, హెల్త్‌కేర్‌లో 7 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ దిద్దుబాటుకు గురికావడాన్ని చూశాం. దీంతో గత ఏడాది కాలంలో ఈ పథకం రాబడులను ఇవ్వలేకపోయింది. 2011, 2018 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం మొత్తం మీద మార్కెట్‌తో పోలిస్తే నష్టాలను పరిమితం చేసింది. -
మిరే అసెట్ నుంచి టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్
మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రారంభించింది. అవి, మిరే అసెట్ నిఫ్టీ ఎఎఎ పిఎస్‌యు బాండ్ ప్లస్ ఎస్డిఎల్ ఏప్రిల్ 2026 50:50 ఇండెక్స్ ఫండ్, మిరే అసెట్ క్రిసిల్ ఐబిఎస్ గిల్ట్ ఇండెక్స్– ఏప్రిల్ 2033 ఇండెక్స్ ఫండ్. మొదటిది 2026 ఏప్రిల్ 30తో మెచ్యూర్ అయ్యే ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లు, రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్డీఎల్) ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక రెండోది 2033 ఏప్రిల్ 29 నాటికి మెచ్యూర్ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీల్లో మదుపు చేస్తుంది. కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కుతో మెరుగైన రాబడి అందుకునేందుకు ఇవి ఉపయోగకరంగా ఉండగలవని సంస్థ తెలిపింది. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు అక్టోబర్ 18న ముగుస్తాయి. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాలి. సంస్థ సీఐవో (ఫిక్సిడ్ ఇన్‌కం) మహేంద్ర జాజూ ఈ ఫండ్లను నిర్వహిస్తారు. -
మిరే అస్సెట్ తక్కువ వడ్డీకే స్టాక్ ఫండింగ్
ముంబై: మిరే అస్సెట్‌కు చెందిన ఎం.స్టాక్ ‘మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ’ (ఎంటీఎఫ్)ను ఆరంభించింది. 7.99 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. పరిశ్రమలోనే ఇది కనిష్ట వడ్డీ రేటుగా పేర్కొంది. ఈక్విటీలకు సంబంధించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తక్షణమే నిధుల సదుపాయం పొందొచ్చని తెలిపింది. 700 స్టాక్స్‌కు సంబంధించి 80 శాతం మార్జిన్‌ను పొందొచ్చని వివరించింది. మార్జిన్ ఫండింగ్ (రుణం)తో కొనుగోలు చేసిన షేర్లను ఎంత కాలం పాటు అయినా కొనసాగించుకోవచ్చని తెలిపింది. ట్రేడర్లు రూపాయి బ్రోకరేజీ లేకుండా అపరిమిత డ్రేడ్స్ చేసుకోవచ్చని ఈ సంస్థ ప్రకటించింది. రూ.10 లక్షల వరకు ఫండింగ్పై 9.49 శాతం రేటు, రూ.10–25 లక్షల మధ్య తీసుకుంటే రూ.8.99 శాతం రేటు, రూ.25 లక్షలకు పైగా ఫండింగ్ తీసుకున్న వారికి 7.99 శాతం రేటును వసూలు చేస్తున్నట్టు తెలిపింది. షేర్ల ప్లెడ్జ్ (ఫండింగ్ కోసం), అన్ ప్లెడ్జ్ లావాదేవీపై కేవలం రూ.12 వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. -
Mirae Asset Hybrid Equity Fund: రిస్క్‌కు మించి రాబడులు
ఒమిక్రాన్ వేరియంట్ పై నెలకొన్న అనిశ్చితి, సులభ ద్రవ్య లభ్యత విధానాలకు సెంట్రల్ బ్యాంకులు స్వస్తి చెబుతుండడం ఇవన్నీ 2022లో మార్కెట్ల గమనాన్ని నిర్ధేశించనున్నాయి. అనిశ్చితి సమయాల్లోనూ, తాము చేసే పెట్టుబడులకు రిస్క్ మరీ ఎక్కువగా ఉండకూడదని భావించే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఇవి ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ల వ్యాల్యూషన్ల ఆధారంగా రెండు విభాగాల మధ్య కేటాయింపులను మారుస్తుంటాయి. కనుక పోర్ట్‌ఫోలియో గురించి ఇన్వెస్టర్ ఎక్కువగా ఆందోళన పెట్టుకోవాల్సిన పని ఉండదు. పెట్టుబడుల విధానం.. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం మధ్య (మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. దీర్ఘకాలం పాటు (ఐదేళ్లకు పైగా) ఇన్వెస్ట్ చేసే వారికి రిస్క్ ఉన్నా కానీ ఇవి మంచి రాబడులను ఇస్తాయి. 20–35 శాతం పెట్టుబడులను డెట్ సాధనాలకు కేటాయిస్తాయి. ఈ విభాగంలో మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. అచ్చమైన ఈక్విటీ ఫండ్ మాదిరే స్వల్పకాలానికి హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడా ఎక్కువ భాగాన్ని ఈక్విటీలకే కేటాయిస్తుంటాయి. మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం ఈక్విటీలకు 70–75 శాతం మధ్య పెట్టుబడులను కేటాయిస్తుంటుంది. వృద్ధికి మెరుగైన అవకాశాలు ఉండి, హేతుబ్ధమైన వ్యాల్యూషన్ల వద్ద లభించే స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. ఇందుకోసం బోటమ్ అప్ విధానాన్ని అనుసరిస్తుంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,229 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీలకు 74.9 శాతం పెట్టుబడులను కేటాయించింది. డెట్‌లో 18 శాతం ఇన్వెస్ట్ చేసి, మిగిలిన ఆస్తులను నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌లో 50 శాతం, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 11 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 25 శాతం పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రాబడులు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం గడిచిన మూడేళ్లలో సగటున 7.9 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ ఇదే విభాగంలోని మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ 16 శాతానికి పైనే సగటు వార్షిక రాబడిని (ట్రెయిలింగ్) ఇచ్చింది. ఐదేళ్లలో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ విభాగం సగటు వార్షిక రాబడి 13.7 శాతం దగ్గర ఉంటే, ఈ పథకంలో రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏ కాలంలో చూసినా కానీ ఈ పథకం పనితీరు పరంగా ముందుండడాన్ని గమనించొచ్చు. మార్కెట్ల దిద్దుబాటు సమయంలో నష్టాలను కూడా పరిమితంగా ఉండే విధానాలను అనుసరిస్తుంది. డెట్ విభాగంలో అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఏఏఏ రేటింగ్ కలిగిన కార్పొరేట్ బాండ్లను ఎంచుకుంటుంది. డెట్‌లో రిస్క్ తీసుకోదు. చదవండి: Fund Review: స్థిరత్వంతో కూడిన రాబడులు.. మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ -
మిరే అసెట్ హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్
మిరే అసెట్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్‌ను ప్రకటించింది. ఒకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ కాగా మరొకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్). మొదటిదానిలో పెట్టుబడులకు నవంబర్ 29, రెండో దానికి డిసెంబర్ 1 ఆఖరు తేదీ. ఈటీఎఫ్‌కు సిద్ధార్థ శ్రీవాస్తవ, ఎఫ్వోఎఫ్కు ఏక్తా గాలా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. హాంకాంగ్ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టయిన 30 చైనా టాప్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి. -
రిస్క్ తక్కువతో రాబడులు
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్ అధికం. కాకపోతే ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్ స్టాక్స్.. మార్కెట్ పతనాల్లో ఇతర స్టాక్స్‌తో పోలిస్తే కాస్త బలంగా నిలబడతాయి. అందుకే ఇతర స్టాక్స్‌తో పోలిస్తే లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో రిస్క్ కాస్త తక్కువ. అదే సమయంలో డెట్ ఫండ్స్‌లోనూ (క్రెడిట్‌రిస్క్ ఫండ్స్ మినహా) రిస్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టేవే హైబ్రిడ్ ఫండ్స్. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ కూ డా ఒకటి. ఈ రెండు విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఈ పథకం రూపంలో లభిస్తుంది. పెట్టుబడుల విధానం హైబ్రిడ్ ఫండ్స్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల్లోనూ పెట్టుబడుల సమతూకాన్ని మారుస్తుంటాయి. కంపెనీల వ్యాల్యూషన్లు, మార్కెట్లలో అస్థిరతలకు తగినట్టు అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులు పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తుంటాయి. కానీ, ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ వెసులుబాటు అంతగా ఉండదు. ఈ పథకం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ విభాగం కిందకు వస్తుంది. అంటే పెట్టుబడి అవకాశాల లభ్యతకు అనుగుణంగా 65 నుంచి 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. అదే విధంగా 20–35 శాతం వరకు డెట్‌కు కేటాయిస్తుంది. కొంత రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు, దీర్ఘకాలం పాటు (ఐదేళ్లకు మించి) ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విషయంలో ఈ ఫండ్.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26.42 శాతం పెట్టుబడులు ఈ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 13 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 10 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. రాబడులు: ఈ పథకం 2015 జూలైలో ప్రారంభమైంది. పోటీ పథకాలతో పోలిస్తే ఇప్పటి వరకు మంచి పనితీరే చూపించింది. ఈ ఫండ్ గడిచిన ఏడాది కాలంలో 10.2 శాతం రాబడులను అందించింది. కానీ ఇదే కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 8.5 శాతంగానే ఉన్నాయి. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం 9.8 శాతం, ఐదేళ్లలో 9.5 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. పథకం ఆరంభం నుంచి చూస్తే రాబడులు వార్షికంగా 10.67 శాతం చొప్పున ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం రాబడులతో పోలిస్తే ఈ పథకం పనితీరు ముందంజలో ఉంది. ముఖ్యంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో అధిక నాణ్యత కలిగిన (ఏఏఏ) డెట్ పెట్టుబడులు ఉండడాన్ని గమనించాలి. అలాగే, ఈక్విటీ పెట్టుబడుల్లోనూ ఎక్కువ భాగాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. ఈ పథకం దాదాపు ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలకు 70 నుంచి 75 శాతం వరకే కేటాయిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి ఈక్విటీ కేటాయింపులు 78 శాతంగా ఉండగా, డెట్‌లో 13.4 శాతం పెట్టుబడులు, నగదు సమానాల్లో 8 శాతం వరకు కలిగి ఉంది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 56 స్టాక్స్ ఉన్నాయి. -మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ - 7.49 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు - 6.79 శాతం ఇన్ఫోసిస్ - 4.99 శాతం ఐసీఐసీఐ బ్యాంకు 4.68 శాతం టీసీఎస్ 4.29శాతం యాక్సిస్ బ్యాంకు 3.38 శాతం ఎస్బీఐ 2.53 శాతం ఐటీసీ 2.30 శాతం హెచ్‌యూఎల్ 2.15 ఎల్అండ్టీ 2.14 -
పన్ను ఆదాకు చక్కని పథకం
పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల నుంచి పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్ పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్ పథకాల్లో చేసే పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఆ లోపు వాటిని వెనక్కి తీసుకు నే అవకాశం ఉండదు. దీర్ఘకాల లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం ఈ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. రాబడులు..: ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు మెరుగైన రాబడులనే ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 13.1 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 200 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్) రాబడులు ఏడాదిలో కేవలం 9 శాతంగా, మూడేళ్లలో వార్షికంగా 14.1 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రారంభించిన రోజు నుంచి చూస్తే ఇప్పటి వరకు సగటున వార్షికంగా 18.69 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి రూ.1.65 లక్షలు సమకూరేది. 2016, 2017లో పన్ను ఆదా విభాగం సగటు రాబడులను మించి పనితీరు చూపించిన ఈ పథకం, 2018 మార్కెట్ కరెక్షన్ సమయంలో నష్టాలను పరిమితం చేసింది. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో నష్టాలు సగటున 6 శాతంగా ఉండగా, మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకంలో నష్టాలు 2.3 శాతానికే పరిమితమయ్యాయి. పెట్టుబడుల విధానం..: 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 99 శాతం పెట్టుబడులకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ ఉంది. నగదు నిల్వలు కేవలం ఒక శాతం లోపునే ఉన్నాయి. ఈ పథకం బ్యాంకింగ్ రంగానికి పెద్ద పీట వేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలోని స్టాక్స్‌లో 37 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 12 శాతం మేర ఎనర్జీ రంగంలో, ఎఫ్ఎంసీజీలో 10 శాతం, హెల్త్‌కేర్‌లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. కన్స్ట్రక్షన్, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ విలువ పరంగా ఎటువంటి స్టాక్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈఎల్ఎస్ఎస్ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 54 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారీ లార్జ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 70% వరకు పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్‌క్యాప్ 25%, స్మాల్ క్యాప్‌నకు 5 శాతం వరకు పెట్టుబడులు కేటాయించింది. -
మీ లక్ష్యాలకు గన్ షాట్
దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్‌ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ ఒకటి. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్‌క్యాప్‌లో దూకుడైన రాబడులు రెండూ ఈ పథకంలో భాగం. ఎందుకంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో ఉంటుంది. మల్టీక్యాప్ ఫండ్స్ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది. రాబడులు ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి అన్ని కాలాల్లోనూ రాబడుల విషయంలో మెరుగైన పనితీరును నిరూపించుకుంది. ఏడాది కాలంలో 10.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 18.6 శాతం, ఐదేళ్లలో 21 శాతం వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఇదే కాలంలో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే ‘నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250టీఆర్ఐ’ రాబడులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో వరుసగా 2 శాతం, 14.5 శాతం, 12.8 శాతంగానే ఉండడం గమనార్హం. బెంచ్ మార్క్‌తో చూసుకుంటే 4–6 శాతం అధిక రాబడులు అందించింది. అంతేకాదు ఇదే విభాగంలోని కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, ఎల్అండ్టీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాల కంటే పనితీరు పరంగా ముందుండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగంలో చక్కని రాబడుల చరిత్ర కలిగిన పథకం ఇది. పెట్టుబడుల విధానం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌నకు 35–65 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంది. నగదు నిల్వలను ఎక్కువగా ఉంచుకోకుండా, పెట్టుబడులను దాదాపుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతానికి 99.52 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉండగా, పెట్టుబడుల్లో కేవలం 0.48 శాతమే నగదు రూపంలో కలిగి ఉంది. ప్రస్తుతం 50.5 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయగా, మరో 43 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో, 6.43 శాతం మేర స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి ఉంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 61 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే 37.63 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రంగ స్టాక్స్‌లో 33 శాతం వరకు ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాత హెల్త్‌కేర్‌లో 12.59 శాతం, ఇంధన రంగ స్టాక్స్‌లో 8 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ తీవ్ర అస్థిరతలు, దిద్దుబాటుకు గురికావడాన్ని చూశాం. గత ఏడాది కాలంలో లార్జ్‌క్యాప్ సూచీ 7 శాతం లాభపడితే, మిడ్‌క్యాప్ సూచీ 4 శాతం పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 10 శాతం మేర రాబడులు అందించిందంటే దీని పనితీరుకు ఇదే నిదర్శనం. 2011, 2018 మార్కెట్ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని కూడా పరిశీలించొచ్చు. -
అత్యవసర నిధి కోసం లిక్విడ్ ఫండ్స్..?
మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్‌లో డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ప్లాన్‌కు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్ల ఎన్ఏవీల మధ్య రూ. 4 తేడా ఉంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవీ అధికంగా ఉండటంతో నాకు యూనిట్లు తక్కువగా వచ్చాయి. డెరైక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్లలో ఏది ఇన్వెస్టర్లకు మంచిదో వివరించండి? - కుమార్, మంగళగిరి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవీ అధికంగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ ప్లాన్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్ రాబడులు అధికంగా ఉన్నాయా లేదా అన్నది అసలు విషయం. ఏ ఇతర ప్లాన్లతో పోల్చినా కూడా డెరైక్ట్ ప్లాన్ ద్వారా వచ్చే రాబడి అధికంగా ఉంటాయి. వ్యయాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించే దళారీలకు చెల్లించే కమిషన్, ఇతర ఖర్చులు డెరైక్ట్ ప్లాన్లలో ఉండవు. ఇలా ఆదా అయిన వ్యయాలను సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్వెస్టర్లకే అందిస్తాయి. అందుకే ఈ డెరైక్ట్ ప్లాన్ల ఎన్ఏవీ, రాబడులు అధికంగా ఉంటాయి. ఏ ఫండ్‌ను కొనుగోలు చేయాలో అన్న విషయంపై మీకు పూర్తి స్థాయిలో స్పష్టత ఉన్నప్పుడే మీరు డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్చేయడం మంచిది. ఇలా కాని పక్షంలో రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రాబడులు అధికంగా వస్తాయనేది కాదనలేని సత్యం. అయితే ఈ డెరైక్ట్ ప్లాన్‌ను ఎంచుకునేందుకు బాగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఏడాది క్రితం నేనొక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పడు ఈ ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)లో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)లోకి మళ్లిద్దామనుకుంటున్నాను. సెక్షన్ 80సీ కింద నాకు ఏమైనా పన్ను రాయితీలు లభిస్తాయా? - మల్లిక, హైదరాబాద్ ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లించడాన్ని -ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని మరో ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌చేయడంగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్ నుంచి ఏడాది కాలంలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లిస్తే మీరు షార్ట్టెర్మ్క్యాపిటల్ గెయిన్స్ పన్ను, ఏడాది దాటిన తర్వాత అయితే లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈక్విటీ ఫండ్స్‌పై ఏడాది దాటితే ఎలాంటి లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మీ విషయానికొస్తే, మీ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఏడాది పూర్తయినందున మీరు ఎలాంటి లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిన పని లేదు. ఇక ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌చేసిన తేదీ నుంచి లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీరు ఈఎల్ఎస్ఎస్లో ఎస్టీపీ విధానంలో మళ్లించిన ప్రతీ ఇన్‌స్టాల్‌మెంట్‌కు అప్పటి నుంచి మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. నా నెలజీతానికి ఆరురెట్లు మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను. నేను 30 శాతం పన్ను పరిధిలోకి వస్తాను. మిత్రులు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని చెబుతున్నారు. ఈ అత్యవసర నిధి ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉండాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునేలా ఉండాలి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అదనపు వడ్డీని అందించగలగాలి. తగిన సలహా ఇవ్వండి. - అబ్రహాం, గుంటూరు అత్యవసర నిధి కోసం ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. తక్కువ రిస్క్, ఎక్కువ లిక్విడిటీ...వాటిల్లో కొన్ని. అత్యవసర నిధి కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది లిక్విడ్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. 91 రోజుల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూరిటీ అయ్యే సెక్యూరిటీల్లో ఈ లిక్విడ్మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మనీ మార్కెట్ ఇన్ స్ట్రుమెంట్స్, స్వల్ప కాలిక కార్పొరేట్డిపాజిట్లు, ట్రెజరీ సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్స్ల్లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే ఆ మొత్తం ఇతర మ్యూచువల్ ఫండ్ల్లా కాకుండా ఒక బిజినెస్ డేలోనే మీ చేతికి అందుతాయి. తక్కువ రిస్క్, అధిక లిక్విడిటీ కారణంగా అత్యవసర నిధి కోసం వీటికి ప్రాధాన్యత ఇస్తారు. వీటిపై వడ్డీ 6-8 శాతం వరకూ వస్తుంది. అయితే మీరు మీ అత్యవసర నిధి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని కొంత నగదుగా మీ దగ్గర, కొంత సేవింగ్స్‌బ్యాంక్ అకౌంట్లోనూ, మిగిలినది లిక్విడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం సమంజసంగా ఉంటుంది.