
మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రారంభించింది. అవి, మిరే అసెట్ నిఫ్టీ ఎఎఎ పిఎస్‌యు బాండ్ ప్లస్ ఎస్‌డిఎల్ ఏప్రిల్ 2026 50:50 ఇండెక్స్ ఫండ్, మిరే అసెట్ క్రిసిల్ ఐబిఎస్ గిల్ట్ ఇండెక్స్– ఏప్రిల్ 2033 ఇండెక్స్ ఫండ్. మొదటిది 2026 ఏప్రిల్ 30తో మెచ్యూర్ అయ్యే ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లు, రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్‌డీఎల్) ఇన్వెస్ట్ చేస్తుంది.
ఇక రెండోది 2033 ఏప్రిల్ 29 నాటికి మెచ్యూర్ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీల్లో మదుపు చేస్తుంది. కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కుతో మెరుగైన రాబడి అందుకునేందుకు ఇవి ఉపయోగకరంగా ఉండగలవని సంస్థ తెలిపింది. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు అక్టోబర్ 18న ముగుస్తాయి. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాలి. సంస్థ సీఐవో (ఫిక్సిడ్ ఇన్‌కం) మహేంద్ర జాజూ ఈ ఫండ్‌లను నిర్వహిస్తారు.