రాజమండ్రి: గోదావరి పుష్కరాల ముహూర్తం సమీపించింది. మరో 24 గంటల్లో పుష్కర పండగ ఆరంభం కానుంది. ఈ నెల 14 నుంచి 25 వరకు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కర రాజధాని రాజమహేంద్రి పుష్కర పండుగకు ముస్తాబైంది. రోజూ లక్షలాది మంది భక్తులు రాజమండ్రి తరలిరానున్నారు. వారి భద్రతకు పెద్దఎత్తున పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రత్యేక పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు.
ఘాట్లు ఉన్న ప్రాంతంలో నో వెహికిల్ జోన్ బౌండ్రీలను ఏర్పాటు చేశారు. రాజమండ్రి నగరంలో భక్తులు ఘాట్ల వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి నగరంలో ప్రముఖ ఆలయాలు, రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నికగన్న ప్రముఖ ఆలయాలను భక్తులకు చూపించేందుకు నమూనా ఆలయాల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఎగ్జిబిషన్లు, కడియం నర్సరీలు భక్తులను ఆలరించనున్నాయి.
పుష్కరఘాట్లు ఇవే..
కోటిలింగాలఘాట్ పుష్కరఘాట్
మార్కండేయ ఘాట్ పద్మావతి ఘాట్
సరస్వతి ఘాట్ (వీఐపీ ఘాట్) గౌతమీ ఘాట్
సుబ్బాయమ్మ ఘాట్ రామపాదాల ఘాట్ (ధవళేశ్వరం)
ముఖ్యమైన ఆస్పత్రులు
ప్రభుత్వాస్పత్రి 0883-2442555
బొల్లినేని ఆస్పత్రి 0883-2477770
సాయి ఆస్పత్రి 0883-2470033
సురక్ష ఆస్పత్రి 0883-2445504
జీఎస్‌ఎల్ ఆస్పత్రి 0883- 2484999
ఆభయ ఆస్పత్రి 0883-2461640
స్వతంత్ర ఆస్పత్రి 0883-2400401
అత్యవసర సర్వీసులు
పుష్కర కంట్రోల్ రూమ్ 12890 (టోల్‌ఫ్రీ) 0883-2555537/38
పోలీసు కంట్రోల్ రూమ్ 100, 1090
ఆంబులెన్స్ 108
విద్యుత్ శాఖ 1920, 0883-2442590
ఏపీఎస్‌ఆర్టీసీ 0883-2555001/2
లూథర్‌గిరి (ఆర్టీసీ) 0883-2555004/5
హెచ్‌బీ కాలనీ (ఆర్టీసీ) 0883-2555006/7
జెమినీ గ్రౌండ్స్ (ఆర్టీసీ) 0883- 2555003
రైల్వే ఎంక్వైరీ 139, 0883-2423535, 2555117
పుష్కర యాత్రికులు చేయాల్సినవి
నిర్దేశించిన స్నానఘట్టాల వద్ద భక్తులు పుష్కర స్నానం చేయాలి.
అనుమానిత వస్తువులు కనపడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
ట్రాఫిక్ నిబంధనలు, ఆంక్షలను భక్తులు విధిగా పాటించాలి.
చెత్తను చెత్తడబ్బాలో మాత్రమే వేయాలి.
విమాన సర్వీసులు
జెట్ ఎయిర్‌వేస్ 0883-2487009
స్పైస్ జెట్ 93999 78090
పుష్కర నగరాలు
ఈఎస్‌ఐ ఆస్పత్రి
సాంస్కృతిక కళాశాల
ప్రభుత్వం ఆర్ట్స్ కాలేజీ
సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు
సుబ్రహ్మణ్య మైదానం
ఆనం కళాకేంద్రం
పుష్కర యాత్రికులు చేయకూడనివి
పుష్కర ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్యాగ్‌లు పూర్తిగా నిషేధం.
నదీతీరం వద్ద దుస్తులు ఉతకరాదు.
బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కరాదు.
భిక్షాటనను భక్తులు, పర్యాటకులు ప్రోత్సహించరాదు.
నదిలో స్నానం చేసినప్పుడు సబ్బు, షాంపూ ఉపయోగించరాదు.
బహిరంగ మల, మూత్రవిసర్జన చేయరాదు.
బారికేడింగ్ దాటి వెళ్లేందుకు ప్రయత్నించరాదు.
పార్కింగ్ స్థలాలు ఇవే..
హౌసింగ్ బోర్డు కాలనీ (లాలాచెరువు)
చౌడేశ్వరనగర్
శివాలయం
లూథర్‌గిరి
ఆర్ట్స్ కాలేజీ
ఎస్‌కేవీటీ కాలేజీ
ఆర్టీసీ బస్టాండ్
లారీస్టాండ్ (వీఎల్ పురం)
జెమినీ గ్రౌండ్
మార్గాని గ్రౌండ్
గూడ్స్ షెడ్
వీటితో పాటు మరో 143 ప్రాంతాల్లో తాత్కాలిక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మికం
యాగాది కార్యక్రమాలు: ఎస్‌కేవీటీ పాఠశాల
టీటీడీ నమూనా ఆలయం: మున్సిపల్ స్టేడియం
నమూనా దేవాలయాలు: కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల
వాహనాలు ప్రవేశం లేని మార్గం
ధవళ్వేరం-రాజమండ్రి రోడ్డులోని ఐఎల్‌టీడీ జంక్షన్ నుంచి రైల్వేస్టేషన్, కోటిపల్లి బస్టాండ్, వీటీ కాలేజీ రోడ్డు, తాడితోట జంక్షన్, చర్చిగేటు రోడ్డు, కంబాలచెరువు సెంటర్, ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయం, లలితానగర్, సీతంపేట, పేపరు మిల్లు దాటే వరకు వాహనాలకు ప్రవేశం లేని ప్రాంతంగా (నో వెహికిల్ జోన్ బౌండ్రీ) నిర్దేశించారు.
ముఖ్య అధికారులు
రామ్‌ప్రకాష్ సిపోడియా: పుష్కర ప్రత్యేకాధికారి
కె.ధనుంజయరెడ్డి: పుష్కర ప్రత్యేకాధికారి
హెచ్.అరుణ్‌కుమార్: కలెక్టర్
జె.మురళి: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
కేవీఎస్ చక్రధర్‌బాబు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి
వి.విజయ్‌రామరాజు: సబ్ కలెక్టర్, రాజమండ్రి.
పుష్కర పర్వానికి సర్వం సిద్ధం
Published Mon, Jul 13 2015 10:19 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement