ఈ వారం వ్యవసాయ సూచనలు | this week agricultural suggestions | Sakshi
Sakshi News home page

ఈ వారం వ్యవసాయ సూచనలు

Published Sun, Jun 11 2017 9:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

ఈ వారం వ్యవసాయ సూచనలు

ఈ వారం వ్యవసాయ సూచనలు

తొలకరి ప్రారంభమైంది. సార్వా వరి నారుమళ్ల తయారీకి రైతులు సన్నద్ధమవుతున్నారు. సార్వా పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే విత​‍్తన ఎంపిక, నారుమడి తయారీ, ఎరువులు, సస్యరక్షణ చర్యలు మొదలగు విషయాలలో రైతులు ఈ దిగువ మెళకువలు పాటించాలి.
విత్తన రకాల ఎంపిక 
దీర్ఘ, మధ్యస్థ కాలిక రకాలైన స్వర్ణ (ఎంటీయూ-7092), సాంబమసూరి (బీపీటీ-5204), విజేత (ఎంటీయూ-1001), ఇంద్ర (ఎంటీయూ-1061), అమర (ఎంటీయూ-1064), ​ ప్రభాత్‌ (ఎంటీయూ-3626), పార్థీవ (ఎన్‌ఎల్‌ఆర్‌-33892), సోనామసూరి (బీపీటీ-3291), శ్రీకాకుళం సన్నాలు (ఆర్‌బీఎల్‌-2537), వసుంధర (ఆర్‌జీఎల్‌-2538), నెల్లూరు సోనా (ఎన్‌ఎల్‌ఆర్‌-3041), స్వర్ణముఖి (ఎన్‌ఎల్‌ఆర్‌-145), పుష్యమి (ఎంటీయూ-1075) సార్వాకు అనువైన రకాలు.
 
విత్తన శుద్ధి
విత్తనం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా కాపాడుకునేందుకు విధిగా విత్తన శుద్ధి చేయాలి. ఒక కిలో పొడి విత్తనానికి 3 గ్రాములు లేదా లీటరు నీటికి 1 గ్రాము కార్బెండిజమ్‌ కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టాలి. తరువాత 24 గంటలు మండె కట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లాలి. 
మరిన్ని వివరాలకు మీ జిల్లాలోని ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌ లేదా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ను సంప్రదించగలరు.
రైతులు మరిన్ని సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 1800-425-430కు ఫోన్‌ చేయవచ్చు.
డాక్టర్‌. కె.రాజారెడ్డి,
విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,
గుంటూరు -522 509
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement