1/5
కర్ణాటక పందల్పూడి బ్రీడ్ పొట్టేలు
2/5
ఒంగోలు జాతి పొట్టేలు,డెక్కన్ బ్రీడ్ పొట్టేలు
3/5
రూ.1.20 లక్షల విలువైన ఆస్ట్రేలియన్ బ్రీడ్ పొట్టేలు
4/5
త్యాగ నిరతిని చాటే బక్రీద్ కోసం మేండే(పొట్టేళ్లు) సిద్ధంగా ఉన్నాయి. రూ.వేల నుంచి రూ.లక్షల విలువ చేసే పొట్టేళ్లు ఖుర్బానీ కోసం వేచివున్నాయి. ఖమ్మంలోని అల్నూర్ షీప్ పార్మ్ యజమానులు దేశవిదేశాల్లోని వివిధ జాతుల గొర్రెలు, మేక పొట్టేళ్లను అమ్మకానికి ఉంచారు. నెల్లూరు, ఒంగోలు, డెక్కన్, కర్ణాటక, ఆస్ట్రేలియాలకు చెందిన గొర్రెలు, మేక పొట్టేళ్లను సయ్యద్ బర్కత్ఖాద్రి కొనుగోలు చేశారు. వీటి ధర రూ.60వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉన్నట్లు తెలిపారు.‘కేవలం రక్తం చిందించడం, మాంసం ఆరగించడం ఖుర్బానీ లక్ష్యం కాదు. దైవమార్గంలో ధనం, ప్రాణం, ఇతర ప్రీతికరమైన వాటిని త్యాగం చేయగలిగే దృఢ సంకల్పం ఉండాలని’ ముస్లిం మతపెద్దలు సూచిస్తున్నారు. ఖుర్బానీ ఇవ్వడం ఇస్లామియా చరిత్రలోని త్యాగాలలో అత్యంత ఉన్నతమైనదిగా అభివర్ణించారు. ఖుర్బానీ ఆర్థిక స్తోమత గల ప్రతి విశ్వాసీపై విధిగా నిర్ణయించబడటంతో పొట్టేళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
– ఫొటోలు: రాధారపు రాజు, ఫొటోగ్రాఫర్, ఖమ్మం
5/5
త్యాగ నిరతిని చాటే బక్రీద్‌ కోసం మేండే(పొట్టేళ్లు) సిద్ధంగా ఉన్నాయి. రూ.వేల నుంచి రూ.లక్షల విలువ చేసే పొట్టేళ్లు ఖుర్బానీ కోసం వేచివున్నాయి. ఖమ్మంలోని అల్‌నూర్‌ షీప్‌ పార్మ్‌ యజమానులు దేశవిదేశాల్లోని వివిధ జాతుల గొర్రెలు, మేక పొట్టేళ్లను అమ్మకానికి ఉంచారు. నెల్లూరు, ఒంగోలు, డెక్కన్, కర్ణాటక, ఆస్ట్రేలియాలకు చెందిన గొర్రెలు, మేక పొట్టేళ్లను సయ్యద్‌ బర్కత్‌ఖాద్రి కొనుగోలు చేశారు. వీటి ధర రూ.60వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉన్నట్లు తెలిపారు.‘కేవలం రక్తం చిందించడం, మాంసం ఆరగించడం ఖుర్బానీ లక్ష్యం కాదు. దైవమార్గంలో ధనం, ప్రాణం, ఇతర ప్రీతికరమైన వాటిని త్యాగం చేయగలిగే దృఢ సంకల్పం ఉండాలని’ ముస్లిం మతపెద్దలు సూచిస్తున్నారు. ఖుర్బానీ ఇవ్వడం ఇస్లామియా చరిత్రలోని త్యాగాలలో అత్యంత ఉన్నతమైనదిగా అభివర్ణించారు. ఖుర్బానీ ఆర్థిక స్తోమత గల ప్రతి విశ్వాసీపై విధిగా నిర్ణయించబడటంతో పొట్టేళ్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.
– ఫొటోలు: రాధారపు రాజు, ఫొటోగ్రాఫర్, ఖమ్మం