సాక్షి, హైదరాబాద్: గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లకే నగరవాసులు జై కొడుతున్నారు. 44 శాతం కస్టమర్లు రెడీ టు హోమ్స్‌లో కొనేందుకు లేదా 24 శాతం మంది కనీసం 6 నెలల్లోపు పూర్తయ్యే గృహాల కొనుగోళ్లకే మక్కువ చూపుతున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే తెలిపింది. నిర్మాణం పూర్తయిన గృహాలకు జీఎస్‌టీ లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణమని సర్వే తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2013, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు సుమారు 5.76 లక్షల వరకుంటాయని అనరాక్ డేటా తెలిపింది. గత రెండేళ్లుగా నగరంలో వాణిజ్య, ఆఫీసు విభాగాల్లో పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment