ఎస్కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ల రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో రాయడానికి గల అర్హత పరీక్ష అయిన ఏపీ సెట్ (ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ )– 2017ను ఆదివారం నిర్వహించడానికి అన్ని ఏర్నాట్లు పూర్తి చేసినట్లు రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎ. మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం నగరంలో 13 సెంటర్లలో నిర్వహించే పరీక్షకు 7,934 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అన్ని సెంటర్లకు అబ్జర్వర్లు, ముగ్గురు ప్రత్యేక అబ్జర్వర్లను నియమించామన్నారు.
ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 31 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాల్లోపు వరకు అభ్యర్థులను అనుమతిస్తామన్నారు.
ఏపీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
Published Sat, Jul 29 2017 9:46 PM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM
Advertisement
Advertisement