సర్వం సిద్ధం | Everything is ready | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Published Wed, Mar 14 2018 12:35 PM | Last Updated on Wed, Mar 14 2018 12:35 PM

Everything is ready - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే  నెల 2వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బెంచీలు, తాగునీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాల కల్పించిన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు  

పోలీసుస్టేషన్లలో ప్రశ్నపత్రాలు 
ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలీసుస్టేషన్లకు చేరాయి. ఏ రోజుకారోజు ప్రశ్నపత్రాలను ఉదయం కేంద్రాలకు తీసుకువెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ను కట్టడి చేసేందుకు రెవెన్యూ శాఖ ఉద్యోగులను సిట్టింగ్‌ స్వా్కడ్‌గా నియమిస్తున్నారు. గతంలో వీరిని సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రమే నియమించేవారు. కానీ ఈసారి అన్ని కేంద్రాల్లో నియమించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.  

పకడ్బందీ ఏర్పాట్లు 
గత విద్యాసంవత్సరంలో జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట పాఠశాలతో పాటు జిల్లాలోని పలు కేంద్రాల్లో ఇన్విజిలేటర్లే కాపీయింగ్‌ ప్రోత్సహించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలా జరగకుండా మాస్‌కాపీయింగ్‌ను పకడ్బందీగా నిర్మూలించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 1,200 మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేయగా, 94 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 94 మంది డిపార్ట్‌ మెంటల్‌ అధికారులు నియమించారు.

అలాగే, 94 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌ సభ్యులను నియమించిన అధికారులు ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు ఏర్పాటుచేశా రు. ఐదుగురు విద్యాశాఖ అధికారులు, ఐదుగురు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఐదుగురు మం ది పోలీస్‌శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన స్క్వాడ్లు ముగ్గురు చొప్పున విడిపోయి తనిఖీ చేపడుతారు.  

కాపీయింగ్‌ జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత 
ఏదైనా పరీక్ష కేంద్రంలోని గదిలో మాస్‌ కాపీయింగ్‌ జరిగితే ఆ గది ఇన్విజిలేటర్లనే బాధ్యులను చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రంలో పరీక్ష ప్రారంభం కాగానే కాపీయింగ్‌ జరిగితే తమదే బాధ్యత అంటూ ఇన్విజిలేటర్‌ లేఖను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తప్పుపడుతున్నారు. విద్యార్థులు తెలిసీ తెలియక చేసే తప్పుకు తమను బాధ్యతలను సరైన పద్ధతి కాదని, ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు 
విద్యార్థులకు ఎలాంటి మానసికమైన ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. నిమిషం నిబంధన, సీసీ కెమెరాలు ఇతర ఏ విధ మైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూ స్తున్నాం. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేంద్రంలో అవకతవకలు జరిగితే ఇన్విజిలేటర్లనే బాధ్యులుగా చేసే లా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఒక్కో గదికి కేటాయించే 25 మంది విద్యార్థులు ఒత్తిడి లోనుకాకుండా, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్లపై ఉంది. 
– సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి 

ఎవరి గుర్తింపు లేకుండా హాల్‌టికెట్లు....  

కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫీజు చెల్లించలేదనే కారణంగా హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తెలిసిం దే. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసు కున్న ప్రభుత్వం నేరుగా ఆన్‌లైన్‌ పద్ధతి లో హాల్‌టికెట్లు అందించే పద్ధతికి శ్రీకా రం చుట్టింది. హెచ్‌ఎం, ఇతర అధికారుల సంతకం లేకుండానే విద్యాశాఖ వెబ్‌సైట్‌ ద్వారా తీసుకున్న హాల్‌టికెట్‌తో పరీక్షకు హాజరయ్యే వెసలుబాటు కల్పించారు.

అంతేకాకుండా నిరుపేద విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. హాల్‌టికెట్‌ చూపించి బస్సులో ప్రయాణించొచ్చు. కాగా, జి ల్లాలో కేవలం ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు తప్పనిసరికాకున్నా.. కెమెరా లు ఉన్న కేంద్రాల్లో విద్యార్థులు ఒత్తిడికి లోననవుతారని చెబుతున్నారు.


మొత్తం పరీక్ష కేంద్రాలు        94 
పరీక్ష రాయనున్న విద్యార్థులు    21,189 
రెగ్యులర్‌ కేంద్రాలు        90 
విద్యార్థులు        20,087 
ప్రైవేట్‌ కేంద్రాలు        04 
విద్యార్థులు        1,102  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement