పుష్కరాలకు సర్వం సిద్ధం
– కలెక్టర్ సత్యనారాయణరెడ్డి
–ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేవు
వాడపల్లి(దామరచర్ల)
కష్ణా పుష్కరాకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం దామరచర్ల మండలం వాడపల్లి స్నానఘాట్లను, ఇతర పుష్కర పనులను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో గోదావరి పుష్కరాలకు 3కోట్ల మంది భక్తులు వచ్చారని, రెండు జిల్లాలో జరుగుతున్న కష్ణా పుష్కరాలకు అదే సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నామన్నారు.ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 2650 మీటర్ల 28 స్నానఘాట్లను అందంగా ముస్తాబు చేస్తున్నామన్నారు.11శాఖల సిబ్బంది మూడు షిఫ్టులలో ఘాట్ల వద్ద విధులు నిర్వహిస్తారన్నారు. 2500 తాగునీటి ఆర్వో ప్లాంట్లు,2300 టాయ్‌లెట్లు నిర్మించినట్లు తెలిపారు. భక్తుల సమూహం అ«ధికంగా ఉంటే 40 నిమిషాల నుంచి 1గంట పాటు వేచి ఉండేందుకు వీలుగా 1657 ఎకరాల్లో పార్కింగ్.హోల్డింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేశామన్నారు. ఘాట్ల వద్ద మెడికల్,కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎగువ ప్రాంతంలో వస్తున్న వర్షాలతో ఇప్పటికే శ్రీశైలంకు నీళ్లు వస్తున్నాయన్నారు. దీంతో పుష్కరాలకు నీటి విడుదల ఉంటుందని, భక్తులు ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఆయన వెంట ఏజేసీ వెంకట్రావ్,ఆర్డీఓ కిషన్‌రావు,తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి,ఐబీ ఎస్.ఈ ధర్మానాయక్, డీఈ మురళి, పీఆర్ ఈఈ హన్మంతరావు, డీఎస్పీ మరాంగోపాల్‌రావు, సీఐలు రవీందర్, భిక్షపతి,ఎస్.ఐ చరమంద రాజు పాల్గొన్నారు.