డిసెంబర్‌లో ఏఎన్‌యూకు ‘నాక్’
డిసెంబర్‌లో ఏఎన్‌యూకు ‘నాక్’
Published Tue, Oct 25 2016 6:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
సిద్ధంగా ఉండాలని వీసీ రాజేంద్రప్రసాద్ ఆదేశం
ఏఎన్‌యూ: వర్సిటీకి నాక్(నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్) ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ లక్ష్యంగా అందరూ పని చేయాలని వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ కోరారు. నాక్ ఏర్పాట్లపై సోమవారం వీసీ విభాగాధిపతులు, ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ తొమ్మిది మందితో కూడిన నాక్ బృందం డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో ఏఎన్‌యూ సందర్శించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరిగిన, చేపట్టాల్సిన పనులను వీసీ అడిగి తెలుసుకున్నారు. నాక్‌కు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. వీసీలు, ఉన్నతాధికారులు మారుతుంటారని కానీ యూనివర్సిటీ ఖ్యాతి మాత్రం శాశ్వతంగా ఉంటుందన్నారు. అంతర్గత లోపాలను సరిదిద్దుకునేందుకు యూనివర్సిటీ ఎంచుకున్న నిపుణులతో నిర్వహించే నాక్ పీర్‌టీం సందర్శనలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. నాక్ Sపీర్‌టీం అన్ని విభాగాల్లోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇస్తుందని చెప్పారు. నాక్ ఏర్పాట్ల కమిటీ సభ్యుడు డాక్టర్ ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
Advertisement