ఢిల్లీ: మణిపూర్‌లో అమానవీయ ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తక్షణమే చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు సరైన చర్చ జరిగింది లేదు. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమమని చెప్పారు. ఈ సున్నితమైన అంశం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
మణిపూర్ అంశంపై చర‍్చకు సహకరించాలని హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలను కోరారు. మణిపూర్ అంశంపై నిజం తెలియాల‍్సిన అవసరం ఉందని అన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మణిపూర్ అంశంపై మూడు సార్లు సమావేశం వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు సమావేశం ప్రారంభం కాగానే హోం మంత్రి చర్చకు సిద్ధమని తెలిపారు. అయినప్పటికీ అమిత్ షా ప్రసంగానికి అడ్డుపడిన ప్రతిపక్షాలు గందరగోళం చేశారు. దీంతో స్పీకర్ హోం బిర్లా మరోసారి సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
కొన్నిరోజులుగా అల్లర్లతో రగులుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అల్లర్లలో ఇప్పటికే 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లపై పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
అయితే.. రూల్ నెంబర్ 267 ప్రకారం చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం 176 కింద చర్చిద్దామని స్పష్టం చేసింది. దీని ప్రకారం 267 కింద ప్రత్యేకంగా సుధీర్ఘమైన చర్చలు జరగాల్సి ఉంటుంది. 176 కింద అయితే.. తక్కువ కాల వ్యవధిలో చర్చను ముగిస్తారు.
ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు: కూతురి ఆచూకీ కోసం ఎదురుచూపులు.. ఆసుపత్రికి ఫోన్ చేస్తే..
Comments
Please login to add a commentAdd a comment