cheif
-
NATA Convention: సాక్షి ప్రతినిధి సింహాకు శంకర నేత్రాలయ అవార్డు
సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకు ప్రతిష్టాత్మక శంకర నేత్రాలయ అవార్డు దక్కింది. ఎంతో మంది అభాగ్యులకు కంటి వైద్యం అందించడంతో పాటు.. భారత్ తో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది శంకర నేత్రాలయ. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా 2023 తెలుగు మహాసభల సందర్భంగా తమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించినందుకు గాను సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతును సత్కరించింది శంకర నేత్రాలయ. నాటా కన్వెన్షన్ వేదికగా శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డులను అందించారు. డల్లాస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి చేతుల మీదుగా పలువురిని గుర్తించి అభినందించారు. శంకర నేత్రాలయ కార్యక్రమాలు ప్రేక్షకులకు చేరువ అవడానికి సహాకరించిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకి అవార్డు ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. శంకర నేత్రాలయ యూఏఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శంకర నేత్రాలయ ద్వారా ప్రెసిడెంట్ బాల రెడ్డి ఇందుర్తి మరియు టీమ్ కంటి వైద్య సేవాలను అందిస్తున్న విషయం విదితమే. తన సహాకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డితో పాటు సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సారీ... మీ పేరు మరచిపోయాను!) -
బ్రహ్మకుమారీస్ చీఫ్ దాది ఇక లేరు
జైపూర్: బ్రహ్మకుమారీస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ 93 ఏళ్ళ రాజయోగిని దాది హృదయ్ మోహిని గురువారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్ను మూశారు. గత పదిహేను రోజులుగా అనారోగ్య కారణాలతో ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో మోహిని చికిత్స పొందుతున్నారని ఆధ్యాత్మిక సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. బ్రహ్మకుమారీస్ మాజీ చీఫ్ దాది జానకి ఏడాది క్రితం మరణించిన తరువాత మోహినిని చీఫ్‌గా నియమించారు. అబు రోడ్‌లోని బ్రహ్మకుమారీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మోహిని భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్టు వారు తెలిపారు. మార్చి 13న మోహిని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాది మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. రాజయోగిని దాది గుల్జార్ ఆకా హృదయ మోహిని ప్రజాపీఠ బ్రహ్మకుమారీస్ ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ప్రధాన పాలనాధికారి. దాదా లేఖ్‌రాజ్(ఆ తరువాత బ్రహ్మ బాబాగా పేరు మార్చుకున్నారు) స్థాపించిన ‘ఓం నివాస్’ అనే బోర్డింగ్ స్కూల్లో 1936లో ఎనిమిదేళ్ల వయసులోనే దాది గుల్జార్ యజ్ఞ(సంస్థ)లో దాది హృదయ మోహిని చేరారు. చిన్న వయస్సులోనే ఎంతో అనుభవాన్ని ఆర్జించిన దాది మోహిని, ఉన్నత విలువల కోసం ఎంతో కృషి చేశారు. రాజయోగినిగా తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దాది మోహిని ఆధ్యాత్మిక, బోధనా విలువలకు పెట్టిందిపేరు. అతిచిన్న వయస్సు నుంచే ఆమె చేసిన సేవ, చూపిన త్యాగనిరతి దాది మోహినిని ఇప్పుుడు అత్యున్నత స్థానంలో నిలిపింది. మానసిక నిగ్రహం, మానసిక శాంతి, స్థిరత్వం, ధ్యానం లాంటి గుణాల్లో ఆమె సాధించిన విజయం ఆమెను గొప్ప యోగినిగా నిలబెట్టాయి. అనేక దేశాల ఆహ్వానంమేరకు దాది మోహిని తూర్పునుంచి పశ్చిమం వరకు ఎన్నో దేశాలను సందర్శించారు. ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, హాంగ్‌కాంగ్, సింగపూర్, మలేసియా, ఇండోనేíసియా, శ్రీలంక, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, హాలాండ్, పోలండ్, రష్యా తదితర దేశాలెన్నింటికో వెళ్ళి తన బోధనలను వినిపించారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫిలాసఫీ, రాజ్యోగ లాంటి అనేక అంశాల్లో ఆమె అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. -
ఇంటర్‌పోల్ చీఫ్ రాజీనామా.. తెరవెనుక డ్రాగాన్!
బీజింగ్ : అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాంగ్వే అనూహ్యంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన నుంచి రాజీనామా లేఖ అందినట్లు ఇంటర్‌పోల్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆయన స్థానంలో దక్షిణ కొరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కీమ్ జోంగ్ యాంగ్ ఇంటర్‌పోల్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. చైనా ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన ఇంటర్‌పోల్ అధ్యక్షుడు కాకముందు చైనా ప్రజా భద్రత ఉప మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ నుంచి స్వదేశం చైనాకు తిరిగి వెళ్తున్న హాంగ్వే అదృశ్యమైయ్యారు. అవినీతిపై యుద్ధం పేరుతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలువురు రాజకీయ నేతలు, అధికారులను అరెస్ట్ చేయిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మెంగ్ హాంగ్వేను అధికారులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2016లో ఇంటర్‌పోల్ చీఫ్‌గా ఎన్నికైన హాంగ్వే ఆ పదవిలో 2020 వరకూ కొనసాగుతారు. కాగా హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారని, ఆయన క్షేమంగానే ఉన్నారని చైనా అధికారులు ధ్రువీకరించారు. కానీ రాజీనామా తప్ప హాంగ్వేకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు చైనా నిరాకరిస్తోంది. -
బ్యాంకు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ దారుణ హత్య
ఇల్లు అద్దె కోసం వచ్చి హత్యకు పాల్పడిన యువకులు ∙ కాకినాడలో కలకలం రేపిన ఘటన కాకినాడ క్రైం : విశ్రాంత ఉద్యోగుల స్వర్గధామంగా పిలుచుకునే అశోక్‌నగర్–ఎస్బీఐ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హాయిగా భార్యతో జీవిస్తూ.. తన ఇద్దరు కుమారులు అమెరికాలో స్థిరపడటంతో.. ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకిచ్చేందుకు ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డు కారణంగా తన ప్రాణం పోతుందని ఊహించలేక పోయాడా పెద్దాయన. అద్దె ఇల్లు కోసమంటూ వచ్చిన యువకులు బ్లేడ్ కట్టర్‌తో రిటైర్డు ఉద్యోగి గొంతు కోసి హతమార్చిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులో కొచి్చంది. టూలెట్ బోర్డు చూసి.. కాకినాడ అశోక్‌నగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన రిటైర్డ్ స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ బులుసు సూరయ్య (72) తన భార్య విజయలక్షి్మతో కలసి జీప్లస్ వ¯ŒS ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులిద్దరూ ఆదిత్యదత్, సత్యవెంకట చంద్రమౌళిదత్లు అమెరికాలో స్థిరపడ్డారు. కనకవల్లి రాధిక, శ్రీపద్మలకు వివా హం కావడంతో పెద్ద కుమార్తె బెంగళూరు, చిన్నకుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. జీప్లస్ వ¯ŒS గృహం పై అంతస్తులో భార్యా భర్తలిద్దరూ నివసిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్ గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండటంతో అద్దెకిచ్చేందుకు టూలెట్ బోర్డు పెట్టారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గేటు దూకి ముగ్గురు యువకులుపై అంతస్తులోకి వచ్చి కాలింగ్ బెల్లు కొట్టి ఇల్లు అద్దెకు కావాలని కోరారు. విజయలక్ష్మి భర్త సూరయ్యకు కింద పోర్ష¯ŒS తాళాలిచ్చి పంపించింది. కిందక వెళ్లిన భర్త పైకిరాకపోవడంతో ఆమె కిందకు వచ్చింది. అప్పటికే సూరయ్యను గొంతు కోసేసి హత్యకు పాల్పడి, గదిలో పడేసి తాళాలు వేసేసి బయట నిలుచున్నారు. మా ఆయన ఎక్కడకు వెళ్లారని ఆమె ప్రశ్నించగా బయటకెళ్లారని సమాధానమిచ్చారు. కంగారుగా బయటకు వచ్చిన ఆమె ఆటో ఎక్కి పరిసరాలు గాలించింది. ఆ ముగ్గరు యువకులు ఆటో వెనుకే బైక్‌లపై వెళ్లి, తిరిగి ఆటోతో పాటు ఇంటికి వచ్చేశారు. దాహం వేస్తోంది. మంచినీళ్లు కావాలంటూ కోరడంతో ఆమె మేడపైకి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అనంతరం ఆ యువకులు టీపాయ్‌పై ఉన్న సెల్‌ఫోన్, పక్కనే ఉన్న ల్యాప్‌టాప్‌ను దొంగిలించారు. భర్త ఆచూకీ కోసం కాకినాడ శ్రీనగర్‌లో ఉంటున్న సోదరుడు వారణాసి హనుమంతుకి సమాచారం ఇచ్చేందుకు సెల్ఫో¯ŒS వెతకగా కనిపించలేదు. ల్యాప్ టాప్ కూడా కనిపించకపోయేసరికి ఆగంతకులపై అనుమా నం వచ్చింది. వెంటనే ఆమె దొంగ..దొంగా అంటూ బిగ్గరగా అరవడంతో వారు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. షాక్‌కు గురైన విజయలక్షి్మని చూసేందుకు స్థానికులు వచ్చి పరా మర్శించారు. సెల్ఫో¯ŒS సమాచారంతో సోదరి ఇంటికి చేరుకున్న హనుమంతు బావ కోసం చుట్టుపక్కల పరిసరాలను గాలించాడు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సోమవారం అర్ధరాత్రి పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న టూటౌ¯ŒS సీఐ ఉమర్ వచ్చి తాళం తీసి పరిశీలించారు. పోర్ష¯ŒS ముందు గదిలో రక్తం మరకలు ఉండటం, రక్తం మరకల్లో పాదం గుర్తులు, అవి వంట గది వరకు ఉండడం గమనించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సూరయ్యను గమనించారు. సీఐ మహ్మద్ ఉమర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ ఏఆర్ దామోదర్, కాకినాడ క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావులు మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం బృందం, డాగ్స్కా్వడ్లను రప్పించి ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, క్రైం డీఎస్పీ పల్లపురాజుల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోస్ట్‌మార్టం కోసం సూరయ్య మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించినట్టు తెలిపారు. హత్యపై పలు అనుమానాలు డబ్బు, బంగారం కోసం ఆశపడి వచ్చిన దొంగలు అవేమి పట్టు కెళ్లకుండా కేవలం సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ తీసుకెళ్లడం, అకారణంగా ఇంటి యాజమానిని గొంతు కోసి హత్యకు పాల్పడటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లిన నిందితులు దానిని డ్రైనేజీ వద్ద పారేసి వెళ్లిపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు నిందితుల్లో ఒకరిని విజయలక్ష్మి గుర్తించింది. ఇతను కరణంగారి సెంటర్లోని ఒక మెడికల్ షాపులో పనిచేసేవాడని, రెండు నెలల క్రితం మందులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినట్టు తెలిపింది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా భర్తను చంపేసి మంచినీళ్లు అడిగారు నాభర్తను హత్య చేసి ఏమీ తెలియనట్టు నిందితులు పైకి వచ్చి మంచినీళ్లు కావాలని కోరారు. రెండు గ్లాసుల్లో మంచినీరు తీసుకొచ్చి ఇచ్చాను. మంచినీరు తాగేసి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను దొంగిలించారు. బంగారం, నగదు అడిగితే వెంటనే తీసి ఇచ్చేదాన్ని. నా భర్తను పొట్టన పెట్టుకున్నారంటూ విజయలక్ష్మి కన్నీటిపర్యంతమైంది. -
అనురాగ్ ఠాకూర్ కొత్త ఇన్నింగ్స్!
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ ఎంపీ, బీసిసిఐ ఛీఫ్ అనురాగ్ ఠాకూర్ ఇప్పుడు ఎల్టీ అనురాగ్ ఠాకూర్ గా మారిపోయారు. శుక్రవారం ఆయన టెరిటోరియల్ ఆర్మ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్ లో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ దల్బీర్ ఎస్ సుహాగ్ ద్వారా టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త బాధ్యతలు చేపట్టారు. దీంతో మిలటరీలో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా ఠాకూర్ రికార్డు సృష్టించారు. బీసీసీఐ చీఫ్, బిజేపీ ఎంపి, 41 ఏళ్ళ అనురాగ్ ఠాకూర్ ఆర్మీ ఆఫీసర్ గా శుక్రవారం ఉదయం నూతన బాధ్యతలు స్వీకరించారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలోచేరి, దేశానికి సేవ చేయాలన్న కోరిక చిన్నతనంనుంచీ బలంగా ఉండేదని వేడుక సందర్భంగా మాట్లాడిన ఠాకూర్ తెలిపారు. తన కల ఇన్నాళ్ళకు సాకారమైందని, టెరిటోరియల్ ఆర్మీలో పనిచేస్తూ... దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, దేశ భద్రతకు తనవంతు సేవ అందిస్తానని ఠాకూర్ పేర్కొన్నారు. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన పరీక్షను పూర్తి చేసిన అనంతరం ఠాకూర్ తన పర్సనల్ ఇంటర్వ్యూను ఛండీగఢ్ లోనూ, ట్రైనింగ్ ను భోపాల్ లోనూ పూర్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికైన ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ కు అవసరమైన ట్రైనింగ్ ను పూర్తి చేశారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెలనుంచి, సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటీర్లను, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు. -
ఆర్మీలోకి అనురాగ్ ఠాకూర్!
బీజేపీ ఎంపీ, బిసిసిఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ త్వరలో ఆర్మీలో చేరబోతున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారిగా నూతన ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన పరీక్షను, ఇంటర్వూను, పూర్తి చేసిన ఆయన.. తన కల ఇన్నాళ్ళకు సాకారం కానుందని, మిలటరీ డ్రెస్ వేసుకోవాలని, దేశ భద్రతకు తనవంతు సేవ అందించాలన్న కోరిక తీరనుందని ఠాకూర్ వెల్లడించారు. అనురాగ్ ఠాకూర్ త్వరలో ఆర్మీ దుస్తుల్లో కనిపించనున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆయన.. దానికి సంబంధఙంచిన పరీక్షను, ఇంటర్వ్యూను పూర్తి చేశారు. బీజేపీ ఎంపీగా, బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన... టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించి, మిలటరీ లో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలో చేరాలన్న కోరిక బలంగా ఉండేదని, అయితే అనుకోకుండా తన కెరీర్ క్రికెట్, పాలిటిక్స్ మార్గంలోకి మారిపోయిందని ఠాకూర్ తెలిపారు. టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్న 41 ఏళ్ళ ఠాకూర్.. ఛండీగర్ లో నిర్వహించిన పర్సనల్ ఇంటర్వ్యూలో అర్హత పొందిన అనంతరం, భోపాల్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికయిన ఠాకూర్.. టెరిటోరియల్ ఆర్మీలో అర్హతకోసం ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెల నుంచి సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటరీర్లను తీసుకొని, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు. దేశానికి సేవ చేయాలన్న తన కల ఇన్నాళ్ళకు నిజం కాబోతోందని, ఆర్మీ యూనిఫాం ధరించేందుకు ఎంతో తహ తహగా ఉందని ఠాకూర్ ఈ సందర్భంలో తెలిపారు. భద్రతా దళాల్లోని ఎన్నో సమస్యలను ఇప్పటిదాకా బయటినుంచే చూడగల్గుతున్నానని, ఇప్పుడు వాటిని దగ్గరినుంచీ చూడటమే కాక, ఎంపీగా సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి సాధనకోసం పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. -
రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. రూ.5 భోజనం బాగుందంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సర్వే మరోమారు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జానా పదేపదే అదే విషయాన్ని లేవనెత్తడం సరికాదని అన్నారు. పార్టీని బలపరచడంలో జానా దూకుడుగా లేరని సర్వే ఆరోపించారు. ఆ సమయంలోనే.. ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని జానారెడ్డి చెప్పడంతో రాజీనామా అవసరం లేదని, పదవీలోనే కొనసాగాలని ఎమ్మెల్యేలు కోరారు. కాగా, సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వేల మధ్య కూడా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దళితుడైన తనను షబ్బీర్ అలీ టార్గెట్ చేస్తున్నారని సర్వే అన్నారు. పబ్లిక్ మీటింగ్ లోనే పార్టీ నాయకత్వ తీరుపై సర్వే వ్యాఖ్యలు చేయడం సరికాదని షబ్బీర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వే సత్యనారయణతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.