Sakshi TV North America Chief Correspondent Awarded At NATA 2023 - Sakshi
Sakshi News home page

NATA Convention: సాక్షి ప్రతినిధి సింహాకు శంకర నేత్రాలయ అవార్డు

Published Wed, Jul 5 2023 9:51 AM | Last Updated on Wed, Jul 5 2023 11:44 AM

Sakshi TV North America Chief Correspondent Awarded At NATA 2023

సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకు ప్రతిష్టాత్మక శంకర నేత్రాలయ అవార్డు దక్కింది. ఎంతో మంది అభాగ్యులకు కంటి వైద్యం అందించడంతో పాటు.. భారత్ తో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది శంకర నేత్రాలయ.

నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా 2023 తెలుగు మహాసభల సందర్భంగా తమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించినందుకు గాను సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతును సత్కరించింది శంకర నేత్రాలయ. నాటా కన్వెన్షన్ వేదికగా శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి  మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డులను అందించారు. డల్లాస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి చేతుల మీదుగా పలువురిని గుర్తించి అభినందించారు. శంకర నేత్రాలయ కార్యక్రమాలు ప్రేక్షకులకు చేరువ అవడానికి సహాకరించిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకి అవార్డు ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు.

శంకర నేత్రాలయ యూఏఎస్‌ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శంకర నేత్రాలయ ద్వారా ప్రెసిడెంట్ బాల రెడ్డి ఇందుర్తి మరియు టీమ్ కంటి వైద్య సేవాలను అందిస్తున్న విషయం విదితమే. తన సహాకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డితో పాటు సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: సారీ... మీ పేరు మరచిపోయాను!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement