correspondent
-
కీచక కరస్పాండెంట్‌పై పోక్సో కేసు
అనంతపురం : అనంతపురం నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ నాల్గో తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాజంలో ఇన్నాళ్లూ పెద్ద మనిషిగా చలామణి అయిన 73 ఏళ్ల ఇతను మనవరాలి వయసు ఉన్న అభం శుభం తెలియని చిన్నారిని లోబరచుకుని అకృత్యానికి ఒడిగట్టాడు. అమానుష ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బాధిత చిన్నారి తల్లిదండ్రులు ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన వారు. బతుకుదెరువు కోసం దుబాయిలో ఉంటున్నారు. దీంతో పిన్ని సంరక్షణలో చిన్నారి ఉంటోంది. రెండు నెలల క్రితం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నాల్గో తరగతిలో చేర్పించారు. కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ గత శని, ఆదివారం రెండు దఫాలు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నారి తన పిన్నికి ఫోన్లో తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణను పోలీసులకు అప్పగించారు. ‘నగ్నంగా మీద పడుకోవాలని సార్ (ఆంజనేయులు గౌడ్) తరచూ అంటుంటాడు. క్లాస్‌కు వెళ్లాలి.. సార్ కొడతారని చెప్పినా వినకుండా నన్ను అలా చేశారు. ఒకసారి డబ్బులు కూడా ఇచ్చాడు. అవి పెట్టెలో పెట్టి తాళం వేయడం మరచిపోయాను. దీంతో డబ్బులు ఎవరో తీసుకున్నార’ని అమాయకంగా వివరించింది. ఈ మాటలు విన్న పిన్ని, బాబాయ్ బోరున విలపిస్తూ శుక్రవారం ఉదయమే పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న కరస్పాండెంట్‌ను నిలదీశారు. ఇంతలోనే విద్యార్థి సంఘాల నాయకులకు విషయం తెలియడంతో వారు కూడా వచ్చి కరస్పాండెంట్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతన్ని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతపురం అర్బన్ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఆంజనేయులు గౌడ్ నుంచి కీలక విషయాలను రాబట్టారు. లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైందని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో చిన్నారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.టీడీపీ నాయకుల అండకరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్‌కు మద్దతుగా టీడీపీకి చెందిన కొందరు నాయకులు సోషల్ మీడియాలో అనుకూల పోస్టింగ్‌లు పెట్టారు. అభం శుభం తెలియ ని విద్యార్థినిపై అఘాయిత్యం జరిగితే ఖండించాల్సింది పోయి.. కీచక కరస్పాండెంట్‌కు అనుకూలంగా పోస్టింగ్‌లు పెట్టడం గమనార్హం. వారి తీరును సామా న్య ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.నిందితుణ్ని కఠినంగా శిక్షించాలిచిన్నారి ఫోన్లో విషయం చెప్పడంతో పాఠశాల వద్దకు వచ్చాం. పాప ఏడుస్తూనే ఉంది. ఏమి జరిగింది చెప్పమ్మా అంటే.. జరిగినది మొత్తం వివరించింది. వెంటనే మా అన్న, మా చెల్లి వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. మా అన్నవాళ్లు అందరూ వచ్చారు. తెలుగు టీచర్ చెప్పింది అంట .. ఇక్కడ జరిగింది మీ వాళ్లకు చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరించారట. జరిగిన దాని గురించి చెప్పొద్దు. డబ్బులు ఇస్తామని చెప్పారు. డబ్బులు కూడా పాపకు ఇచ్చారు. అఘాయిత్యానికి పాల్పడిన పాఠశాల కరస్పాండెంట్‌ను కఠినంగా శిక్షించాలి. – చిన్నారి పిన్ని -
NATA Convention: సాక్షి ప్రతినిధి సింహాకు శంకర నేత్రాలయ అవార్డు
సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకు ప్రతిష్టాత్మక శంకర నేత్రాలయ అవార్డు దక్కింది. ఎంతో మంది అభాగ్యులకు కంటి వైద్యం అందించడంతో పాటు.. భారత్ తో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది శంకర నేత్రాలయ. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా 2023 తెలుగు మహాసభల సందర్భంగా తమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించినందుకు గాను సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతును సత్కరించింది శంకర నేత్రాలయ. నాటా కన్వెన్షన్ వేదికగా శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డులను అందించారు. డల్లాస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి చేతుల మీదుగా పలువురిని గుర్తించి అభినందించారు. శంకర నేత్రాలయ కార్యక్రమాలు ప్రేక్షకులకు చేరువ అవడానికి సహాకరించిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకి అవార్డు ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. శంకర నేత్రాలయ యూఏఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శంకర నేత్రాలయ ద్వారా ప్రెసిడెంట్ బాల రెడ్డి ఇందుర్తి మరియు టీమ్ కంటి వైద్య సేవాలను అందిస్తున్న విషయం విదితమే. తన సహాకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డితో పాటు సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సారీ... మీ పేరు మరచిపోయాను!) -
అనంతపురం: శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ ఉమాపతి ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రం మండంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ ఉమాపతి(56) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. జిల్లాలోని దేవరకొండలో కరస్పాండెంట్ ఉమాపతి, సహా కారు డ్రైవర్ కొండపైకి వెళ్లారు. అనంతరం, డ్రైవర్‌ను దింపిసి కరస్పాండెంట్ ఉమాపతి.. స్పీడ్‌గా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కొండపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ సార్.. సార్ అంటూ అరుస్తున్న ఉమాపతి పట్టించుకోలేదు. అయితే, ఉమాపతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కీచక కరస్పాండెంట్.. ప్లస్‌టూ విద్యార్థినులతో..
సాక్షి, చెన్నై(తిరువళ్లూరు): ప్లస్‌టూ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైగింక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించిన బాలికలు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు.. తిరునిండ్రవూర్‌లోని ఏంజెల్ మెట్రిక్ ప్రైవేటు పాఠశాలలో సుమారు 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నర్సరీ నుంచి ప్లస్‌టూ వరకు పాఠశాల చైర్మన్ సిందై జయరామన్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు వినోద్(34) కరస్పాడెంట్‌గా ఉన్నారు. కొద్ది రోజులుగా వినోద్ ప్లస్‌టూ, ప్లస్‌వన్ విద్యార్థినులను కౌన్సిలింగ్ పేరిట ప్రత్యేక గదికి పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లౌగింక వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లపై సైతం లౌగింకంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై పలుమార్లు పాఠశాల చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు బుధవారం ఉదయం తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. వినోద్‌ను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. విషయం తెలుసుకున్న సీఈఓ రామన్, డీఈఓ రాధాకృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. జరిగిన విషయాలను విద్యార్థినులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతనిపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వినోద్ కోసం గాలిస్తున్నారు. నాలుగు రోజులు పాఠశాలకు సెలవు విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులు ఆందోళన చేయవద్దని..నిందితులపై చర్యలు తీసుకుంటామని.. విద్యార్థినుల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇస్తూ మేసేజ్‌లు పంపింది. బీజేపీ నాయకులకు చుక్కెదురు విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు వారికి మద్దతుగా నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళన రాజకీయ కోణంలో వెళుతున్నట్లు గుర్తించిన కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇది పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్య సమస్య అని.. తామే పరిస్కరించుకుంటామని తెలిపారు. -
లైంగిక వేధింపులపై స్పందించిన మహిళ కమిషన్
సాక్షి, విజయవాడ : మచిలీపట్నంలోని సారా గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ శనివారం కాలేజీని సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించిన ఆమె..ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సహా ఇతరులెవరినీ కమిషన్ ఈ కార్యక్రమానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థినులతో సమావేశమైన వాసిరెడ్డి పద్మ కళాశాల కరస్పాండెంట్ తీరుతెన్నుల గురించి ఆరా తీశారు.(చదవండి : కోరిక తీరిస్తేనే.. లేదంటే జీవితాంతం..) -
విద్యార్థినికి అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ
-
విద్యార్థినికి అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో గతవారం జరిగిన అత్యాచారయత్నం ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధిత విద్యార్థికి అండగా నిలిచింది. విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన కళాశాల కరస్పాండెంట్ వెంకట సత్య నరిసింహ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు బాధితురాలు, కాలేజీ విద్యార్థులతో కలిసి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్‌కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. కాగా, మాయ మాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్న కరస్పాండెంట్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిపై గత సోమవారం లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
స్టూడెంట్ ని ఇంటికి పిలిచి..కరస్పాండెంట్ కీచక చర్య
విశాఖపట్నం ,అల్లిపురం : కీచక కరస్పాండెంట్‌ను శిక్షించాల్సిందే అంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతతకు దారి తీసింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డాబాగార్డెన్స్‌లో ప్రేమసమాజం ఎదుట గల విశాఖ ఒకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు మంగళవారం కోపోద్రిక్తులయ్యారు. కళాశాలలో చదివే విద్యార్థినులతో కరస్పాండెంట్ గాది వెంకట సత్య నరిసింహ కుమార్ అలియాస్ కుమార్ కీచకుడిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మంగళవారం విద్యార్థులంతా కలిసి కళాశాలలో కుమార్‌ను నిలదీశారు. బాధితురాలి కథనం ప్రకారం... విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న బాధితురాలు కైలాసపురంలో గల కళాశాల హాస్టల్లో ఉండేది. అయితే హాస్టల్లో సౌకర్యాలు బాగోలేవని ఇటీవల బయట అద్దె గది తీసుకుని ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కుమార్ తల్లి కాలం చేయడంతో ఇంటి పనులున్నాయని బాధితురాలిని శుక్రవారం కుమార్ ఇంటికి పిలిపించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె అతని కాళ్లు పట్టుకుని బతిమలాడి అక్కడి నుంచి బయటపడింది. జరిగిన విషయాన్ని సోమవారం కళాశాలలో సహ విద్యార్థినులకు చెప్పి... తాను చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలియజేసింది. దీంతో విద్యార్థులంతా విషయాన్ని కళాశాలలో మరో ఉపాధ్యాయుడు సురేష్‌కు వివరించారు. ఆత్మహత్య చేసుకుని సాధించేదేముంది అంటూ బాధితురాలిని వారించారు. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులంతా కరస్సాండెంట్ కుమార్ కార్యాలయంలోకి వెళ్లి నిలదీశారు. ఆ సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గ్లోరీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె కుమార్‌ని హెచ్చరించాల్సిందిపోయి మద్దతుగా నిలవడంతో విద్యార్థులు కోపోద్రోక్తులయ్యారు. కుమార్‌పై వారంతా తిరగబడేసరికి టూ టౌన్ పోలీసులు విషయం తెలుసుకుని అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో విద్యార్థులు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై గతంలో మూడు కేసులు నిందితుడు కుమార్ గతంలో నర్సీపట్నంలో కూడా కళాశాలలు నడిపినట్లు అతని భార్య సాయిలక్ష్మి తెలిపింది. అతనిపై అక్కడ కూడా లైంగిక వేధింపులపై మూడు కేసులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అక్కడి కళాశాలలు మూసివేసి ఇక్కడకు చేరుకున్నాడని, అతడిని కళాశాల ప్రిన్సిపాల్ గ్లోరీ వెంట తిప్పుకుంటుందని భార్య తీవ్రస్థాయిలో ఆరోపించింది. తన భర్తను తనకు కాకుండా చేస్తోందని ఆరోపించింది. వారికి శిక్ష పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేసింది. విద్యార్థులకు పలువురి మద్దతు బాధిత విద్యార్థినితో పాటు కళాశాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీతో పాటు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు, ఐద్వా నగర కార్యదర్శి ప్రియాంక అండగా నిలబడ్డారు. కళాశాల విద్యార్థులతో కలిసి డాబాగార్డెన్స్ నుంచి ర్యాలీగా రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడి నుంచి ఆటోలలో కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎస్ఐ ఉమా వెంకటేశ్వరరావుని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ కళాశాలకు గుర్తింపులేదన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా వేరే కళా శాల ద్వారా పరీక్షలు రాసే అవకాశం కల్పించా లని డిమాండ్ చేశారు. లేకుంటే జీవీఎంసీ వద్ద భారీ ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. కంచరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు బాధితురాలు ఫిర్యాదు మేరకు కంచరపాలెం ఎస్ఐ ఉమ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశా రు. నిందితుడిని విచారిస్తున్నట్లు ఆయన తెలిపా రు. ఈ మేరకు నగర పోలీస్ కుమార్ మహేష్‌చంద్ర లడ్డా నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అతని ఆదేశాల మేరకు కంచరపాలెం పోలీసులు నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల ప్రవర్తనపై విద్యార్థుల ఆగ్రహం ఫిర్యాదు తీసుకోకపోవడంతో టూ టౌన్ పోలీసులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడికి కొమ్ము కాస్తున్నారని, అతడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బైఠాయించారు. మరోవైపు ఎస్ఐ మహేష్ విద్యార్థులకు అండగా ఉన్న అధ్యాపకుడు సురేష్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఏ1గా సురేష్ పేరు పెడతామనడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న ఈస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి స్టేషన్ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సంఘటన జరిగింది కైలాసపురం అయినందున అది ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. నిందితుడిని, బాధితులను అక్కడకు పంపిస్తామన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో విద్యార్థులు అక్కడి నుంచి నిష్క్రమించారు. అనంతరం విద్యార్థులు కళాశాల వద్దకు చేరుకుని ఫ్లెక్సీలను చించివేశారు. కళాశాల అద్దాలు పగలగొట్టటంతో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అక్కడి నుంచి పంపించి వేశా>రు. కళాశాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పదో తరగతి పరీక్షకు ఒకరికి బదులు మరొకరు
ధర్మారం(ధర్మపురి): ఒకరికి బదులు మరొకరు పదో తరగతి పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఖిలావనపర్తి మారుతీ విద్యాలయం పదోతరగతి విద్యార్థులకు మండలంలోని దొంగతుర్తి హైస్కూల్ పరీక్షా కేంద్రం కేటాయించారు. మారుతీ విద్యాలయంలో పదోతరగతి చదువుతున్న కోల మహేష్, పెండ్యాల శ్రీనివాస్ పరీక్షలు రాయాల్సి ఉండగా... వీరికి బదులుగా ఇంటర్ చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన మామిడిశెట్టి పవన్‌కుమార్, సామంతుల హరీష్ కేంద్రానికి వచ్చారు. ప్రశ్నాపత్రం.. ఆన్సర్షీట్ తీసుకున్న విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి సంతకాలు పరిశీలించారు. తేడాగా కనిపించడంతో నిలదీశారు. దీంతో విద్యార్థులు అసలు విషయం చెప్పారు. పెద్దపల్లి ఏసీపీ హాబీబ్‌ఖాన్, సీఐ నరేందర్ దొంగతుర్తి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. పదో తరగతి విద్యార్థులకు బదలుగా ఇంటర్ విద్యార్థులను ప్రొత్సహించి పరీక్షలు రాయించిన మారుతీ విద్యాలయం కరస్పాండెంట్ కొమురయ్య, విద్యార్థులు కోల మహేష్, పెండ్యాల శ్రీనివాస్, ఇంటర్ విద్యార్థులు మామిడిశెట్టి పవన్‌కుమార్, సామంతుల హరీష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
'సర్టిఫికెట్స్ కావాలంటే కోరిక తీర్చు'
చెన్నై : మహిళా టీచర్‌ను వేధించిన ఓ ప్రభుత్వేతర పాఠశాలకు చెందిన కరస్పాండెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ రెండు నెలల కిందటే తన ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఆ టీచర్ తన ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చింది. అయితే, తన గదిలోకి రావాలంటూ ఆ స్కూల్ కరస్పాండెంట్ రవి పిలిచాడు. అనంతరం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. ఒప్పుకోకపోతే ఆమె గురించి చెడుగా ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన టీచర్‌కు అసభ్య సందేశాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. -
కరస్పాండెంట్ అత్యాచారం చేశాడని..
కేకే.నగర్: చెన్నైలో పాఠశాల విద్యార్థినిపై కరెస్పాండెంట్ అత్యాచారం జరపడంతో ఆమె ఆత్మహుతి చేసుకుని మృతి చెందింది. దీనికి సంబంధించి న్యాయం కోసం ప్రజలు పాఠశాలను ముట్టడించడంతో పోలీసులు పాఠశాలకు తాళం వేశారు. చెన్నై కోయంబేడు సీమాత్తమ్మన్ నగర్‌కు చెందిన పళనివేలు(40) కోయంబేడు మార్కెట్లో టమాట వ్యాపారం చేస్తున్నాడు. ఇతని కుమార్తె మణిమాల(14). విరుగంబాక్కంలో గల ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదివింది. పళనివేలు చెల్లెలు శశికళ(37) అళగమ్మాళ్ నగర్లో నివసిస్తోంది. ఈమె భర్త శరవణన్(42) నెర్కుండ్రంలో పాఠశాల నడుపుతున్నాడు. మణిమాల సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చే సమయంలో అత్త ఇంటికి వెళ్ల రావడం అలవాటు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చిన మణిమాలపై మత్తుమందు చల్లి అత్యాచారం జరిపారు. జరిగిన సంఘటన గురించి ఎవరికి చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. అయితే మణిమాల ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. దిగ్భ్రాంతి చెందిన అతడు తన వలన చెల్లెలు జీవితం నాశనం కాకూడదని మౌనం వహించాడు. ఆ తరువాత మణిమాల అత్త ఇంటికి వెళ్లడం మానేసింది. ఇదిలా ఉండగా బుధవారం ఇంటిలో మణిమాల ఆత్మహుతి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని కోయంబేడు మార్కెట్ పోలీసుల ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఆమె సూసైడ్ నోట్లో మామ, అత్త ఇద్దరూ తనను అశ్లీలంగా చిత్రాలు తీశారని, శరవణన్ తనపై అత్యాచారం జరిపాడని మనస్తాపంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు రాసి ఉంది. పరారీలో వున్న శశికళ, శరవణన్ ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శరవణన్, శశికళలను అరెస్టు చేయాలని పళనివేల్ బంధువులు ప్రజలు 150 మందికి పైగా శుక్రవారం ఉదయం శరవణన్ నడుపుతున్న పాఠశాలను ముట్టడించి ఆందోళన జరిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్కూలుకు తాళం పెట్టి ప్రజలతో చర్చలు జరిపారు. శరవణన్ ను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రేపు వడుప్సా కరస్పాండెంట్లకు సన్మానం
విద్యారణ్యపురి : వడుప్సా ఏర్పా టు 36 ఏళ్లయిన సందర్భంగా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈనెల 25న హన్మకొండలోని అలకనంద గార్డెన్ లో నిర్వహించనున్నామని వడుప్సా జిల్లా అధ్యక్షు డు బుచ్చిబాబు వెల్లడించారు. శుక్రవారం హన్మకొండలోని వడు ప్సా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ నమాట్లాడుతూ ఆదివారం టీచర్స్‌డేను కూడా జరుపుకుంటున్న సందర్భంగా ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లను సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. వడుప్సా చేపట్టిన కార్యక్రమాలు, సమస్యలపై చర్చించడంతో పాటు కార్యాచరణపై సమావేశంలో తీర్మానించనున్నట్లు పేర్కొన్నారు. వడుప్సా జిల్లా జనరల్ సెక్రటరీ దేవేందర్‌రెడ్డి, శ్రీధర్, బాధ్యులు చక్రపాణి, రామచంద్రమూర్తి, పాల్గొన్నారు. -
చికిత్సపొందుతూ స్కూల్ కరస్పాండెంట్ మృతి
ములుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన గజ్వేల్ జీడీఆర్ స్కూల్ కరస్పాండెంట్ వల్లపురెడ్డి మధుకుమార్‌రెడ్డి(35) సికింద్రాబాద్ స¯ŒSషై¯ŒS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. శనివారం రాత్రి 11 గంటలకు అతను ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ నుంచి గజ్వేల్ వస్తున్నాడు. ములుగు అటవీ పరిశోధన కేంద్రం సమీపంలో అది అదుపుతప్పి డివైడర్‌ను, ఆ తరువాత లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుకుమార్‌రెడ్డితోపాటు, మనోజ్‌కుమార్‌రెడ్డి, నవీ¯ŒSరెడ్డిలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మధుకుమార్‌రెడ్డి స¯ŒSషై¯ŒS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ సమాచారం తెలియడంతో గజ్వేల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓవైపు కుటుంబ సభ్యులు, బంధువులు, మరోవైపు విద్యార్థుల రోదనలతో జీడీఆర్ స్కూల్ ప్రాంగణం శోకసాగరంలో మునిగిపోయింది. సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. -
కలెక్టరేట్ ఇక ఈ-ఆఫీస్
నక్కలగుట్ట : వరంగల్ కలెక్టరేట్ ఇక ఈ-ఆఫీస్‌గా మారనుంది. జిలాల కలెక్టరేట్లోని ఫైళ్లనీ ఇకనుంచి ఆన్లైన్ లో కరస్పాండెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతి ఫైల్‌ను ఒక్క సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు వెళ్లాలన్నా ఆన్లైన్లోనే పంపనున్నారు. దీనికి గానూ కలెక్టరేట్ లోని ప్రతి సెక్షన్ అధికారికి ఈ-మెయిల్ క్రియేట్చేసి ఒక్క డిజిటల్ టోకెన్ కేటాయిస్తారు. జూలై ఒక్కటి నుంచి ఏడు వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డిజిటల్ ఇండియా వారోత్సవాలుగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ-ఆఫీసుల నిర్వహణ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ర్టం లోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ-ఆఫీసులుగా మార్చాలని నిర్ణయం తీసుకుని సెప్టెంబర్‌లోగా ఈ ప్రతిపాదనను పూర్తి చేయూలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల అధికారులు ఎక్కడ ఉన్నా పనులు చకచకా అయ్యే అవకాశాలు ఉన్నారుు. కలెక్టరేట్‌తో పాటు వరంగల్ గ్రేటర్ నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయూల్లో సైతం ఈ- ఆఫీస్‌గా మార్చేందుకు అన్ని విభాగాల్లోనూ సన్నాహాలు కొనసాగుతున్నారుు. ఈ కార్యకర్యక్రమం విజయవంతం అరుుతే జనగామ మున్సిపాలిటీ, జిల్లాలోని నగర పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో కూడా ఇ- ఆఫీఆఫీసు అమలులోకి రానున్నాయి. -
గోవర్దన్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన యూనివర్సిటీఅసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్‌ను కులం పేరుతో దూ షించి, కడప నగరానికి వస్తే చంపేస్తామని బెదిరించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, బసవతారక లా కాలేజీ కరస్పాండెంట్ గోవర్దన్‌రెడ్డిపై తక్షణం ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయాలని దళిత, ఇతర సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివా రం వారు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖడించారు. లక్ష్మీప్రసాద్‌ను దూషించినందుకు యూనివర్సిటీ అధికారులు ఈనెల 17వ తేదీన ఎస్పీకి ఫిర్యాదు చేశారని, ఆయన ఇంతవరకూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసును ఇంతవరకూ పెండ్లిమర్రికి బదిలీ చేయలేదన్నారు. ఉన్నత స్థాయి లో ఉన్న దళిత ఉద్యోగిపై ఇంత జరిగినా పోలీ సులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎస్పీ స్పందించి యూనివర్సీటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదును వెంటనే ఎఫ్ఐఆర్ చేసి పెండ్లిమర్రికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గోవర్ధన్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయకపోతే జిల్లాలోని అన్ని దళిత సంఘాలను కూడగలుపుకుని ఆందోళను చేపడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎదుట అందోళన నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కేసీ లక్షుమయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లుగారి వెంకటసుబ్బయ్య, బీఎస్పీ జిల్లా జనరల్ సెక్రటరీ ఓబయ్య, వీఆర్ఏ అసోసియేట్ జిల్లా జనరల్ సెక్రటరీ రామాంజనేయులు, అడ్వకేట్ శేషయ్య, డీఎంఎఫ్ సంగటి మనోహర్, రాయలసీమ ఎస్సీ,ఎస్టీ హ్యూమన్‌రైట్స్ అధ్యక్షుడు జేవీ రమణ, బీసీ రాష్ట్ర కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, అంబేద్కర్ మిషన్ ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేట్ అధ్యక్షుడు నారాయణయాదవ్, మాదిగ ఉద్యోగుల సమాఖ్య జయన్న, జోనస్, ఎమ్మార్పీఎస్ నాయకులు పిచ్చయ్య ప్రొఫెసర్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు., -
గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదు
హైదరాబాద్ : మంత్రి పీతల సుజాత గ్రీన్‌ఫీల్డ్ ఉదంతంపై స్పందించారు. గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదని ఆమె తెలిపారు. విద్యార్థులను చితకబాదిన కరస్పాండెంట్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు పీతల సుజాత తెలిపారు. ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాల నడపటం చట్టవిరుద్దమన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలోతో సమగ్ర విచారణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్వచ్ఛంద సంస్థలపై విచారణ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాల కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పీతల సుజాత తెలిపారు. -
అంధ విద్యార్థులపై కర్కశత్వం
అల్లరి నెపంతో ముగ్గురిని తీవ్రంగా కొట్టిన ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ నిందితులకు దేహశుద్ధి చేసిన బాధితుల బంధువులు, వివిధ సంఘాల ప్రతినిధులు సాక్షి, కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా): అసలే బాలలు.. ఆపై అంధులు.. తెలిసీ తెలియక ఓ తప్పు చేశారేమో... పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ రెచ్చిపోయారు... అంధ విద్యార్థులపై అమానుషంగా దాడి చేశారు... వదిలేయమని ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా చావబాదారు... ఒక విద్యార్థిపై కూర్చుని రాక్షసంగా ప్రవర్తించారు... ఈ దారుణాల్ని రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన ఒక వ్యక్తి మీడియాకు అందజేయడంతో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతి నిధులు స్కూల్‌కు వెళ్లి కరస్పాండెంట్‌కు, ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జాతీయ బాలల హక్కుల కమిటీ కోరింది. ఇది చాలా దారుణమైన చర్యని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కుషాల్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు, విద్యార్థుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంస్థలు, విదేశీ విరాళాలతో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద కె.వి.రావు గ్రీన్‌ఫీల్డ్స్ అంధుల ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థకు కె.వి.రావు కరస్పాండెంట్‌గా, శ్రీనివాస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ అంధులే. ఈ నెల 18న విద్యార్థులు సాయి (9), సురేంద్రవర్మ (12), జాన్సన్ (13) అల్లరి చేశారని ఆగ్రహించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వారిని బెత్తంతో తీవ్రంగా కొట్టారు. ఒక విద్యార్థిపై కూర్చుని రాక్షసంగా ప్రవర్తించారు. ఈ దారుణాల్ని రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన ఒక వ్యక్తి మీడియాకు సోమవారం అందజేశాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు పాఠశాలకు వెళ్లి కరస్పాండెంట్‌కు, ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.శ్రీనివాసులురెడ్డి పాఠశాలను సందర్శించారు. ఈ సంఘటనపై ఎంఈవోను విచారణాధికారిగా నియమించినట్లు డీ ఈవో తెలిపారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఎంఈవో ఫిర్యాదు మేరకు తిమ్మాపురం పోలీసులు కేసు నమోదుచేసి రావు, శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ల చేతుల్లో గాయపడిన సాయి, సురేంద్రవర్మ, జాన్సన్‌లను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. -
అంధ విద్యార్ధులను చితకబాదిన నిర్వాహకుల అరెస్టు
-
అంధులను గొడ్డులా బాదేసిన కరస్పాండెంట్