ములుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన గజ్వేల్ జీడీఆర్ స్కూల్ కరస్పాండెంట్ వల్లపురెడ్డి మధుకుమార్‌రెడ్డి(35) సికింద్రాబాద్ స¯ŒSషై¯ŒS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. శనివారం రాత్రి 11 గంటలకు అతను ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ నుంచి గజ్వేల్ వస్తున్నాడు. ములుగు అటవీ పరిశోధన కేంద్రం సమీపంలో అది అదుపుతప్పి డివైడర్‌ను, ఆ తరువాత లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుకుమార్‌రెడ్డితోపాటు, మనోజ్‌కుమార్‌రెడ్డి, నవీ¯ŒSరెడ్డిలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మధుకుమార్‌రెడ్డి స¯ŒSషై¯ŒS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ సమాచారం తెలియడంతో గజ్వేల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓవైపు కుటుంబ సభ్యులు, బంధువులు, మరోవైపు విద్యార్థుల రోదనలతో జీడీఆర్ స్కూల్ ప్రాంగణం శోకసాగరంలో మునిగిపోయింది. సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.