గ్రీన్ఫీల్డ్ పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదు | Minister Peethala Sujatha respond on Greenfield school issue | Sakshi
Sakshi News home page

గ్రీన్ఫీల్డ్ పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదు

Published Tue, Jul 22 2014 12:57 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

Minister Peethala Sujatha respond on Greenfield school issue

హైదరాబాద్ : మంత్రి పీతల సుజాత గ్రీన్ఫీల్డ్ ఉదంతంపై స్పందించారు. గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదని ఆమె తెలిపారు. విద్యార్థులను చితకబాదిన కరస్పాండెంట్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు పీతల సుజాత తెలిపారు. ప్రిన్సిపల్పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

 

ప్రభుత్వ ఉద్యోగి అయిన కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాల నడపటం చట్టవిరుద్దమన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలోతో సమగ్ర విచారణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్వచ్ఛంద సంస్థలపై విచారణ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాల కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పీతల సుజాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement