visually impaired
-
బీదర్‌లో అంధుడి నామినేషన్
బీదర్: లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటకలో నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శక్తివంతమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక భావోద్వేగ ఉదాహరణ బీదర్‌లో ఆవిష్కృతమైంది. బీదర్ లోక్‌సభ స్థానానికి ఒక అంధుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీదర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయంతో అసమానతలు, అడ్డంకులను ధిక్కరిస్తూ ముందుకు వచ్చారు. బీదర్ తాలూకాలోని కడ్వాడ్ గ్రామానికి చెందిన దిలీప్ నాగప్ప భూసా తన మద్దతుదారులతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ప్రమాణాన్ని దిలీప్ చదివి వినిపించి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది.. రెస్టారెంట్లన్నీ..
రెస్టారెంట్లన్నీ సాధారణంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటిని ఇస్తుంది. మహా అయితే ప్రత్యేకంగా ఉండేందుకు మరింత హంగులు ఆర్భాటాలతో కస్టమర్లని ఆకర్షించే యత్నం చేస్తాయి అంత వరకే. కానీ దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరం ఉన్న కస్టమర్ల సంగతిని గుర్తించవు అనలా లేక పరిగణించరు అని చెప్పాలో తెలియదు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవాళ్ల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్లు రెస్టారెంట్‌కి వచ్చి.. మెను చూసి ఆర్డర్ ఇవ్వాలంటే మరొకరి సాయం తీసుకోవాల్సిందే. లేదా వారు ఫ్రెండ్స్నో, బంధువులనో తోడు తెచ్చుకోవాల్సిందే. ఇంతవరకు ఎవ్వరికీ.. వారు కూడా మెనుని చూసి ఆర్డర్ చేసుకుంటే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు. ఆ దిశగా అడుగులు వేయాలేదు . కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా అడుగులు వేసి ఆచరణలోకి తీసుకొచ్చి చూపింది. ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. ఇండోర్‌లోని గురుకృపా రెస్టారెంట్ దృష్టిలోపం ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు కూడా స్వయంగా మెను చూసి ఆర్డర్ చేసుకుని తిసేలా చేసింది ఆ రెస్టారెంట్. మహేష్ దృష్టిహీన్ కళ్యాణ సంఘ నుంచి కొంతమంది దృష్టిలోపం ఉన్న పిల్లలను రెస్టారెంట్‌కి ఆహ్వానించారు. బ్రెయిలీ లిపిలో చెక్కబడిన మెనూ కార్డ్ సాయంతో ఆ పిల్లలంతా తమ ఆర్డర్లను స్వయంగా వారే తెప్పించుకుని తిన్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతమంది రెస్టారెంట్ ఆపరేటర్లు కలిసిన తర్వాత ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియన్ గ్రూప్ చైర్పర్సన్ భావన గనేదివాల్ మాట్లాడుతూ..అన్ని రెస్టారెంట్లవారు ఇలా చేసేలా పురికొల్పేందుకు మహేష్ దృష్టిహీన్ కళ్యాణ్ సంఘ్ నుంచి దృష్టి లోపం ఉన్న పిల్లలను పిలిపించి ట్రయల్ వేశాం. అది నిజంగా సక్సెస్ అయ్యింది. వారికోసం ఈ బ్రెయిలీ లిపి మెను కార్డ్‌లను చండీగఢ్ నుంచి తెప్పించి. అలాంటి పది కార్డ్‌లను ఇతర రెస్టారెంట్లకు పంపుతాం. ఇక నుంచి రెస్టారెంట్లన్నీంటిలో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ మెనూ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలనుకుంటున్నాం. రెస్టారెంట్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు దృష్టిలోపం ఉన్న కస్టమర్లు ఇక ఇబ్బంది పడరు, పైగా ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. అని చెప్పుకొచ్చారు భావన గనేదివాల్. ఇక సదరు గురుకృపా రెస్టారెంట్ యజమాని సిమ్రాన్ భాటియా మాట్లాడుతూ.. యంగ్ ఇండియా గ్రూప్ మమ్మల్ని సంప్రదించి బ్రెయిలీ లిపిలో మెను కార్డ్‌లను తయారు చేయమని అడిగింది. ఇది మాకు కొత్తగా అనిపించినా.. నచ్చింది. ఇంతవరకు అలాంటి సౌకర్యం ఏ రెస్టారెంట్లలోనూ లేదు. పిల్లలంతా అలా బ్రెయిలీ లిపి మెను కార్డులను చూసి ఆర్డర్ చేసినప్పుడూ చాలా ఆనందంగా అనిపించిందన్నారు రెస్టారెంట్ యజమాని భాటియా. అలాగే దృష్టిలోపం పిల్లలు సైతం తాము మెను కార్డ్‌ని చదవి ఆర్డర్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. ఇది తమకి ఎవ్వరిపై ఆధారపడటం లేదన్న ఫీలింగ్‌ని ఇచ్చిందన్నారు. అందరికీ ఇలాంటి సౌకర్యం అందాలని కోరుకుంటున్నారు. ఏదీఏమైన ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్ అనుకున్నదే తడువుగా ఆచరించి చూపడం ఇంకా గ్రేట్ కదూ!. (చదవండి: వాట్! ఈజిప్టు మమ్మీ నుంచి పరిమిళాలు వెదజల్లే "సెంట్"! షాకింగ్ విషయాలు వెల్లండించిన శాస్త్రవేత్తలు!) -
అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం
ఇండోర్: అంధత్వాన్ని లెక్కచేయకుండా చివరికి అనుకున్నది సాధించి చూపారు సామాన్య కుటుంబానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి భారీ వేతన ప్యాకేజీ అందుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యశ్.. సొనాకియా ఇండోర్‌లో బీటెక్ చేశారు. ‘స్క్రీన్–రీడర్ సాఫ్ట్వేర్ సాయంతో చదువుకున్న నేను, కోడింగ్ నేర్చుకుని ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టా. మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో నెగ్గి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్‌కు ఎంపికయ్యా’అని చెప్పారు. ‘మైక్రోసాఫ్ట్ ఇచ్చిన రూ.47 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ ఆఫర్‌కి ఓకే చెప్పాను’అని వివరించారు. యశ్ సొనాకియా తండ్రి యశ్పాల్ స్థానికంగా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. మొదటి సంతానమైన యశ్‌కు పుట్టుకతోనే గ్లూకోమా ఉంది. అప్పట్లో స్వల్పంగా ఉన్న కంటిచూపు క్రమక్రమంగా తగ్గుతూ 8 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా అంధుడై పోయారు. దీంతో, యశ్ 5వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలో చదివారు. ఆ తర్వాత, తన తోబుట్టువులతోపాటే సాధారణ స్కూలుకు వెళ్లారు. వాళ్లే చదువులో అతడికి సాయం చేసేవారు. ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్న కల సాకారం చేసుకునేందుకు యశ్ ఎంతో కష్టపడ్డాడు. నా కోరికా అదే. చివరికి ఫలించింది’అని యశ్పాల్ గద్గదస్వరంతో అన్నారు. -
అంధురాలు ఆవేదన.. గూడు లేకుండా చేశారయ్యా!
రహమత్‌నగర్: తన నివాసం తొలగించడం పట్ల ఓ అంధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం అందించిన పట్టా ప్రకారం కేటాయించిన స్థలంలోనే నివాసం నిర్మించుకున్నా.. కొంత మంది బస్తీ నాయకులు రెవెన్యూ సిబ్బందికి తప్పుడు సమాచారం అందించి తన నివాసాన్ని కూల్చివేయించారని అంధురాలైన చంద్రమ్మ వాపోయింది. ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్‌గాంధీనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రమ్మ మాట్లాడుతూ... అంధురాలైన తన విజ్ఞప్తి మేరకు 1993వ సంవత్సరంలో తహసీల్దార్ తనకు ఫాం డీ పట్టాను (ఎఫ్.4477.93) అందజేశారన్నారు. ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీనగర్‌లోని తనకు కేటాయించిన 89 ప్లాట్లోనే చిన్న షెడ్డు వేసుకుని తన కుమార్తెతో కలిసి జీవిస్తున్నానని తెలిపింది. అయితే కొంత మంది బస్తీ నాయకులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో రెవెన్యూ సిబ్బంది తాను నివాసం ఉంటున్న షెడ్డును తొలగించారని ఆమె వాపోయింది. తన పేరున ఇచ్చిన పట్టా ఉండగా తన నివాసం ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. అంధురాలైన తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డిలకు చంద్రమ్మ విజ్ఞప్తి చేసింది. -
కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్ అయ్యాడు!
పుట్టుకతోనే దృష్టి లోపం.. దానికి తోడు కటిక పేదరికం.. సమస్యను సవాల్‌గా స్వీకరించాడు... కృషి, పట్టుదలతో అంధత్వాన్ని జయించాడు. అన్నీ బాగుండి.. ఆర్ధికస్తోమత సహకరించి.. ఏ కళలోనైనా, క్రీడలోనైనా రాణించడం పెద్ద విషయమేమీ కాదు. కంటి చూపు సరిగా లేకపోయినా చదువుతో పాటు క్రికెట్లోనూ రాణిస్తూ పేరుతెచ్చుకున్న గణేష్ విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నల్లమాడ: సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన సరస్వతి, ప్రభాకర్ దంపతులు వ్యవసాయ కూలీలు. అరకొర సంపాదనతో అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండో కుమారుడు గణేష్.. పుట్టుకతోనే దృష్టి లోపంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శస్త్రచికిత్స చేస్తే చూపు మెరుగుపడుతుందన్న వైద్యుల సూచన మేరకు ఆపరేషన్‌నూ చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. 30 శాతం కంటి చూపుతో ఉన్న కుమారుడి భవిష్యత్తు తలచుకుని నిరుపేద తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు. చదువుల్లో టాప్.. గణేష్ విద్యాభ్యాసం ఆద్యంతం బ్రెయిలీ లిపిలోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ కదిరి సమీపంలోని మొటుకుపల్లి ఆర్డీటీ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి పదో తరగతి వరకూ అనంతపురం సమీపంలోని పంగల్ రోడ్డులో ఉన్న ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో, ఇంటర్ తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో, అక్కడే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపించిన గణేష్ ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. క్రికెట్ అంటే మక్కువ.. గణేష్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఐదో తరగతిలో ఉన్నప్పుడే తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆయా పోటీల్లో ప్రతిభ చాటుకోవడంతో అతని క్రీడా ప్రస్థానం మలుపు తిరిగింది. 2012లో తిరుపతి జట్టు తరఫున ఆడి బీ2 (30 శాతం కంటి చూపు ఉన్నవారు) విభాగంలో ఆంధ్రా ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అనంతరం ఆంధ్రాజట్టులో స్థానం దక్కించుకుని ఆల్‌రౌండర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటివరకూ తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యధిక వికెట్లు, పరుగులు చేసిన క్రీడాకారుడిగా ఖ్యాతి గడించాడు. కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో వరుసగా మూడు రంజీ ట్రోఫీలు గెలిచిన జట్టులో గణేష్ ఆటతీరు కీలకంగా మారింది. అజయ్‌కుమార్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఇండియా జట్టుకు ఆడాలన్నదే తన లక్ష్యమని గణేష్ తెలిపాడు. సాధారణ క్రికెటర్లలాగే అంధ క్రికెటర్లను కూడా ప్రభుత్వాలు గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు. గణేష్ సాధించిన విజయాలు 2018 చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ నుంచి పాల్గొని జట్టు విజయంలో కీలకంగా మారాడు. 2018లో కోల్‌కత్తాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకున్నాడు. 2019, 2020లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి నగేష్ ట్రోఫీని ఆంధ్ర జట్టు కైవసం చేసుకోవడంలో కీలకంగా మారాడు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆంధ్రా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. -
15 ఏళ్లకే చూపు పూర్తిగా తగ్గింది... అయినా ధైర్యంగా.. ఇప్పుడు నెలకు 50 వేలు సంపాదిస్తూ
Visually Impaired Woman Geetha Inspiring Journey In Telugu: గీత పదమూడేళ్ల అమ్మాయి. బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదని తరచూ చెప్తోంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. రకరకాల పరీక్షలు చేశారు. రెటినైటిస్ పిగ్మెంటోసా అని తేల్చారు. అది అత్యంత అరుదైన జన్యుపరమైన సమస్య. వైద్యం ద్వారా పోయిన చూపును తీసుకురావడం కాదు కదా దృష్టి మరింత క్షీణించకుండా ఆపడమూ సాధ్యం కాలేదు. పదిహేనేళ్లు వచ్చేటప్పటికి చూపు పూర్తిగా తగ్గిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు 39 ఏళ్ల సక్సెస్ఫుల్ ఉమన్. సొంత కుటీరపరిశ్రమ ద్వారా నెలకు యాభై వేలు సంపాదిస్తోంది. ‘గీతాస్’ అని తన పేరుతోనే తన ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంది, తన విజయాన్ని తన పేరుతోనే నమోదు చేసుకుంది. తన పేరునే ఒక బ్రాండ్‌గా మార్చుకుంది. నచ్చని పదం ‘రెస్ట్’ కేరళలోని త్రిశూర్కి చెందిన గీత దృష్టిలోపం కారణంగా దేనినీ ఆపలేదు. ఆత్మవిశ్వాసంతో చదువును బ్రెయిలీలో కొనసాగించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఏమీ చేయకుండా ఊరుకోవడం తనకు నచ్చలేదు. దాంతో భర్త సహకారంతో చిన్న రెస్టారెంట్ ప్రారంభించింది. ఆమె స్వయంగా వండేది కూడా. ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ అది. వంటకాలు, పండ్ల రసాలు అన్నీ సేంద్రియ పద్ధతులతో పండించిన పండ్లు, కూరగాయలు, ధాన్యాలతోనే. ఆ ప్రయత్నం ఆమెను విజయపథంలో నడిపించింది. కాలం పరీక్షలు పెట్టకుండా ఆగదు. ఆ రెస్టారెంట్ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆమె మరో ప్రదేశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కొంతకాలం ఇల్లు, పిల్లల పెంపకంలో విశ్రాంతిగా గడపమని భర్త సలీశ్ సూచించాడు. అతడు మెడికల్ రిప్రజెంటేటివ్. గీతకు ఇష్టంలేని మాట ‘విశ్రాంతి’. సొంత పరిశ్రమ అయితే ఎక్కువ సమయం పరిశ్రమ కోసమే కేటాయించాల్సి వస్తోంది. ఉద్యోగం అయితే కొంత వెసులుబాటు ఉంటుందని ఆలోచించింది. కానీ అప్పటికే ఆమె రెస్టారెంట్ నడిపి తనను తాను నిరూపించుకుని ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ సాహసం చేయలేదు. ఎవరూ ఇవ్వకపోతే ఏంటి? నేనే మరొకరికి ఉద్యోగం ఇస్తాను అనుకుంది గీత దృఢంగా. తనకు బాగా పట్టున్న వంట పనినే ఈ సారి ఇంటి నుంచి మొదలు పెట్టింది. అలాగే షెల్ఫ్‌లైఫ్ ఎక్కువ కాలం ఉండే పదార్థాలను వండసాగింది. వాటిని ఆన్లైన్లో మార్కెట్ చేయడమూ మొదలుపెట్టింది. ‘గీతాస్ హోమ్ టు హోమ్’ బ్రాండ్ మీద ఆమె తయారు చేస్తున్న నెయ్యి, పచ్చళ్లు, బాలింతలు తినాల్సిన ఔషధ ఆహారానికి మార్కెట్ కేరళ నుంచి కశ్మీర్ వరకు విస్తరించింది. గీత ప్రపంచాన్ని చూడలేదు. కానీ ప్రపంచం ఆమెను చూసేలా చేసుకోగలిగింది. ఇది గీత గ్రహించిన జీవితసారం. తన కంటిచూపును హరించిన విధిని సవాల్ చేస్తోంది. చదవండి: లోన్ కావాలంటే 2 నిమిషాలే.. క్లిక్ చేశారో ఇక అంతే?! -
కొత్త నాణేలు వచ్చేసాయ్...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం కొత్త సిరీస్ నాణేలను విడుదల చేసింది. రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రిలీజ్ చేశారు. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారికి సహాయపడేలా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశామని ప్రధాని తెలిపారు. న్యూఢిల్లీలో ప్రధాని ఇంటి వద్ద నిర్వహించిన నాణేల విడుదల కార్యక్రమానికి అంధవిద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొత్తగా చలామణిలోకి వచ్చిన నాణేలలోని వైవిధ్యపూరితమైన ఫీచర్లు దివ్యాంగులకు బాగా సహాయపడతాయన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 27 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన ఈ 20 రూపాయల కాయిన్.. డోడెకాగన్ రూపంలో ఉంటుంది. 10 రూపాయిల కాయిన్ లాగానే 20 రూపాయిల కాయిన్ కూడా రెండు రకాల రంగుతో ఉంటుంది. దీనికి 12 అంచులు ఉంటాయి. మిగతా నాణేలు రౌండ్ షేప్లోనే ఉండనున్నాయి. విలువ ఆధారంగా నాణేల పరిమాణం , బరువును డిజైన్ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం రూ.20 నాణేన్ని తీసుకురావడం ఇదే తొలిసారి. కాయిన్ ఔటర్ రింగ్ లో 65 శాతం కాపర్, 15 శాతం జింక్, 20 శాతం నికెల్ ఉంటాయి. ఇన్నర్ డిస్క్ లో 75 శాతం కాపర్, 20 శాతం జింక్, 5 శాతం నికెల్ ఉంటాయి. The Prime Minister, Shri Narendra Modi, today, released the new series Rs.1, Rs.2, Rs.5, Rs.10 and Rs.20 coins. These coins contain design features which will be of great assistance to visually impaired persons. — Arun Jaitley (@arunjaitley) March 7, 2019 -
అంధుడికి ఆసరాగా తొలిసారి ఓ గుర్రం!
లండన్: సాధారణంగా పశ్చిమ దేశాల్లోని అంధులు తమ రోజువారీ కార్యక్రమాల్లో సహాయానికి శిక్షణ పొందిన శునకాలను వినియోగిస్తారు. కానీ, బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఓ అంధుడు తొలిసారి తన సహాయకారిగా శునకానికి బదులు ఓ గుర్రాన్ని వినియోగించనున్నాడు. మహమ్మద్ సలీమ్ పటేల్(24) బ్లాక్బర్న్ పట్టణంలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. రెటీనాస్ పిగ్మెంటొసా అనే కంటి సమస్య కారణంగా ఆయన చూపు కోల్పోయాడు. అతడికి చిన్నప్పటి నుంచి కుక్కలంటే మహా భయం. దీంతో ఆయన కుక్కలను సహాయకారిగా ఎంచుకునేందుకు సంకోచిస్తున్న సమయంలో పొట్టిరకం గుర్రం అతడి మదిలో మెదిలింది. ఆ గుర్రానికి (డిగ్బీ) వచ్చే ఏడాది మే నెలలో రెండేళ్లు నిండుతాయని, అనంతరం అది రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకుని తన దగ్గరికి వస్తుందని పటేల్ పేర్కొన్నారు. కుక్కలతో పోలిస్తే డిగ్బీతో ఎన్నో లాభాలున్నాయంటున్నాడు పటేల్. డిగ్బీ జీవిత కాలం ఎక్కువని, తనకు నలభై దాటాక కూడా అది సాయం చేస్తుందన్నాడు. శునకాలు కేవలం 8 ఏళ్లు పనిచేసి రిటైర్ అవుతాయని, అవి చీకటిలో చూడలేవని పేర్కొన్నాడు. -
మోదీ పాట.. గార్భా స్టెప్పులతో అదరగొట్టిన యువతులు
ప్రస్తుతం దేశమంతా దేవీ నవరాత్రోత్సవాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా ఉత్తరభారత దేశంలో ఈ ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో తెలిసిన విషయమే. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ, భజనలతో అర్చించడం, సంప్రదాయ నృత్యాలతో అలరించడం పరిపాటి. కాగా దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన మాతృభాష గుజరాతీలో ఓ పాటను రాశారు. ‘గాయితోనో గర్బో.. నే జీలే తెనో గర్బో’ అనే పల్లవితో సాగే ఈ పాటకు సుమారు 200 మంది అంధ(పాక్షికం) విద్యార్థినులు అదిరిపోయే స్టెప్పులేసి శోభ తీసుకువచ్చారు. మ్యూజిక్కు అనుగుణంగా గుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్భా’ను ప్రదర్శించి తమలో దాగున్న కళను పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
గొంతువిని రేప్ నిందితుడ్ని గుర్తించిన అంధురాలు
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ ఢిల్లీలోని దేశ్‌బంధు గుప్తా రోడ్లో లైంగిక దాడికి గురైన 20 సంవత్సరాల అంధ యువతి గొంతును బట్టి నిందితుడిని గుర్తించారని పోలీసులు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4న యువతి తల్లి నీళ్లు పట్టేందుకు వెళ్లగా, ఇద్దరు వ్యక్తులు తల్లితో కలిసి తాను ఉంటున్న ఇంటి నుంచి ఆమెను బలవంతంగా పొరుగునే ఉన్న మరో ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులతో ఆ తర్వాత మరొకరు కలిశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత యువతి పేర్కొన్నారు. మూడో వ్యక్తి సైతం ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కౌన్సెలింగ్ కోసం స్వచ్ఛంద సంస్థకు తరలించారు. పదేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో ఆమె కన్ను దెబ్బతిన్నదని పోలీసులు తెలిపారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో రోజుకు ఐదుగురికి పైగా లైంగిక దాడికి గురవుతున్నారన్న గణాంకాలు వెల్లడైన నేపథ్యంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. -
కొత్త నోట్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కొత్తగా ప్రవేశపెట్టిన రూ 50, రూ 200 నోట్లు, కాయిన్స్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కంటిచూపు సరిగాలేని వారు ఈ నోట్లు, కాయిన్స్‌ను గుర్తించి వాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..వీటిని పరిశీలించాలని ఆర్బీఐని హైకోర్టు కోరింది. నోట్ల సైజు, వాటిపై ఉన్న చిహ్నాలు, ప్రమాణాలను గుర్తించడంలో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రభుత్వం, ఆర్బీఐ ఈ అంశాలపై కూలంకషంగా చర్చించి పరిష్కరించాలని సూచించింది. కంటిచూపు సమస్యలున్న నిపుణులు, ఈ రంగంలో అనుభవం ఉన్న ఇతరులతో అధికారులు సంప్రదింపులు జరపాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సీ హరిశంకర్‌తో కూడిన బెంచ్ కోరింది. గతంలో ఆయా నోట్ల కరెన్సీ సైజ్‌లోనే ఎందుకు తయారుచేయడం లేదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్‌ను హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. అన్ని కోణాల్లో పరిశీలించిన మీదటే కరెన్సీ డిజైన్‌ను ఖరారు చేశామని ఆయన కోర్టుకు నివేదించారు. దీంతో ఫిబ్రవరి 16కు తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సమంత అంధురాలు కాదు..!
ధృవ సినిమా సక్సెస్ తరువాత రామ్ చరణ్, మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తొలిసారిగా సమంత రామ్ చరణ్ తో జోడి కడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత అంధురాలి పాత్రలో కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన యూనిట్ సభ్యులు అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. -
కొత్త నోట్లను ఎలా గుర్తించేది?
న్యూఢిల్లీ: నోట్ల రద్దు చర్యతో దేశ వ్యాప్తంగా సామాన్యుల కష్టాలు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద కనిపిస్తున్నాయి. అయితే.. కనిపించని మరో కష్టం నోట్ల రద్దుతో ఏర్పడింది. అదే చూపులేని వారు నోట్లను గుర్తించడంలో పడుతున్న కష్టం. ఇంతకు ముందున్న నోట్లను చాలా కాలంగా తమ చేతులతో తడుముతూ గుర్తించడం నేర్చుకున్న చూపులేని వారు ఇప్పుడు కొత్త నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి అవసరాల్లో భాగంగా నోట్లను ఇచ్చి పుచ్చుకునే సందర్భంగా ఏది ఏ నోటో గుర్తించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. కొత్త రూ. 2వేల నోటు 20 రూపాయల నోటుకు, 500 నోటు 10 రూపాయల నోటుకు దగ్గరి పరిమాణంలో ఉన్నాయని అందువల్ల లావాదేవీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. గతంలో నోట్లను తడిమినప్పుడు వాటి చివర్లలోని టాక్టైల్ మార్కింగ్స్ ద్వారా గుర్తించేవాళ్లం అని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన నోట్లను గుర్తించడం వీలు కావట్లేదని వారు చెబుతున్నారు. నోట్లను గుర్తించేలా కేఎన్ఎఫ్బీ రీడర్, బ్లైండ్-డ్రయిడ్ లాంటి కొన్ని యాప్‌లు ఉన్నప్పటికీ.. చూపులేనివారిలో చాలా మందికి ఆ యాప్‌ల గురించే తెలియదని బెంగళూరుకు చెందిన జానకి అనే మహిళ వెల్లడించింది. -
అందుకే విశ్వాస జీవి అంటారు
న్యూయార్క్: విశ్వాసం అనగానే మనుషులకంటే ముందు కుక్కలే గుర్తుకొస్తాయి. అలా గుర్తుకు రావడం తప్పుకాదని, అదే నిజమనే విషయాన్ని మరోసారి రుజువు చేసిందో శునకం. వాయు వేగంతో వస్తున్న బస్సు ఢీకొనే ప్రమాదం నుంచి కళ్లు కనిపించని తన యజమానురాలిని ప్రాణం తెగించి మరి కాపాడింది. చిన్న కాలిగాయంతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అది చేసిన సాహసపనికి అక్కడి వారంతా శబాష్ అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ లోని పుత్నాం రాష్ట్రంలో ఆండ్రీ స్టోన్ అనే మహిళ తాను ముద్దుగా పెంచుకుంటున్న ఫిగో అనే కుక్కను పెంచుకుంటుంది. వాకింగ్ కోసం దానితో కలిసి బయటకు వెళ్లగా ఓ స్కూల్ బస్సు వారివైపు వేగంగా దూసుకొచ్చింది. అది గమనించిన ఫిగో తన యజమానురాలిని పక్కకు బలంగా నెట్టేసి బస్సు డ్రైవర్ దృష్టి పడేలా ఎదురుగా ఆ క్రమంలో దాని ఓకాలి ఎముక విరగగా.. కాలి చీలమండలం, మోచేయికి స్పల్ప గాయాలతో ఆండ్రీ ప్రాణాలతో బయటపడింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దానిని ఎంతో ప్రేమగా చేరదీసి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదు
హైదరాబాద్ : మంత్రి పీతల సుజాత గ్రీన్‌ఫీల్డ్ ఉదంతంపై స్పందించారు. గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదని ఆమె తెలిపారు. విద్యార్థులను చితకబాదిన కరస్పాండెంట్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు పీతల సుజాత తెలిపారు. ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాల నడపటం చట్టవిరుద్దమన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలోతో సమగ్ర విచారణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్వచ్ఛంద సంస్థలపై విచారణ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాల కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పీతల సుజాత తెలిపారు.