సమంత అంధురాలు కాదు..! | Samantha not playing visually impaired character | Sakshi
Sakshi News home page

సమంత అంధురాలు కాదు..!

Published Wed, Apr 12 2017 12:56 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

సమంత అంధురాలు కాదు..!

సమంత అంధురాలు కాదు..!

ధృవ సినిమా సక్సెస్ తరువాత రామ్ చరణ్, మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తొలిసారిగా సమంత రామ్ చరణ్ తో జోడి కడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత అంధురాలి పాత్రలో కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన యూనిట్ సభ్యులు అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement