అందుకే విశ్వాస జీవి అంటారు | Guide Dog Jumps in Front of Speeding Bus to Save Visually Impaired Woman in New York | Sakshi
Sakshi News home page

అందుకే విశ్వాస జీవి అంటారు

Published Wed, Jun 10 2015 7:39 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

అందుకే విశ్వాస జీవి అంటారు - Sakshi

అందుకే విశ్వాస జీవి అంటారు

న్యూయార్క్: విశ్వాసం అనగానే మనుషులకంటే ముందు కుక్కలే గుర్తుకొస్తాయి. అలా గుర్తుకు రావడం తప్పుకాదని,  అదే నిజమనే విషయాన్ని మరోసారి రుజువు చేసిందో శునకం. వాయు వేగంతో వస్తున్న బస్సు ఢీకొనే ప్రమాదం నుంచి కళ్లు కనిపించని తన యజమానురాలిని ప్రాణం తెగించి మరి కాపాడింది. చిన్న కాలిగాయంతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అది చేసిన సాహసపనికి అక్కడి వారంతా శబాష్ అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ లోని పుత్నాం రాష్ట్రంలో ఆండ్రీ స్టోన్ అనే మహిళ తాను ముద్దుగా పెంచుకుంటున్న ఫిగో అనే కుక్కను పెంచుకుంటుంది. వాకింగ్ కోసం దానితో కలిసి బయటకు వెళ్లగా ఓ స్కూల్ బస్సు వారివైపు వేగంగా దూసుకొచ్చింది. అది గమనించిన ఫిగో తన యజమానురాలిని పక్కకు బలంగా నెట్టేసి బస్సు డ్రైవర్ దృష్టి పడేలా ఎదురుగా ఆ క్రమంలో దాని ఓకాలి ఎముక విరగగా.. కాలి చీలమండలం, మోచేయికి స్పల్ప గాయాలతో ఆండ్రీ ప్రాణాలతో బయటపడింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దానిని ఎంతో ప్రేమగా చేరదీసి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement