సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం కొత్త సిరీస్ నాణేలను విడుదల చేసింది. రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రిలీజ్ చేశారు. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారికి సహాయపడేలా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశామని ప్రధాని తెలిపారు. న్యూఢిల్లీలో ప్రధాని ఇంటి వద్ద నిర్వహించిన నాణేల విడుదల కార్యక్రమానికి అంధవిద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొత్తగా చలామణిలోకి వచ్చిన నాణేలలోని వైవిధ్యపూరితమైన ఫీచర్లు దివ్యాంగులకు బాగా సహాయపడతాయన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
27 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన ఈ 20 రూపాయల కాయిన్.. డోడెకాగన్ రూపంలో ఉంటుంది. 10 రూపాయిల కాయిన్ లాగానే 20 రూపాయిల కాయిన్ కూడా రెండు రకాల రంగుతో ఉంటుంది. దీనికి 12 అంచులు ఉంటాయి. మిగతా నాణేలు రౌండ్ షేప్‌లోనే ఉండనున్నాయి. విలువ ఆధారంగా నాణేల పరిమాణం , బరువును డిజైన్ చేశారు.
కాగా కేంద్ర ప్రభుత్వం రూ.20 నాణేన్ని తీసుకురావడం ఇదే తొలిసారి. కాయిన్ ఔటర్ రింగ్ లో 65 శాతం కాపర్, 15 శాతం జింక్, 20 శాతం నికెల్ ఉంటాయి. ఇన్నర్ డిస్క్ లో 75 శాతం కాపర్, 20 శాతం జింక్, 5 శాతం నికెల్ ఉంటాయి.
The Prime Minister, Shri Narendra Modi, today, released the new series Rs.1, Rs.2, Rs.5, Rs.10 and Rs.20 coins. These coins contain design features which will be of great assistance to visually impaired persons.
— Arun Jaitley (@arunjaitley) March 7, 2019
Comments
Please login to add a commentAdd a comment