బీదర్: లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటకలో నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శక్తివంతమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక భావోద్వేగ ఉదాహరణ బీదర్‌లో ఆవిష్కృతమైంది. బీదర్ లోక్‌సభ స్థానానికి ఒక అంధుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీదర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయంతో అసమానతలు, అడ్డంకులను ధిక్కరిస్తూ ముందుకు వచ్చారు.
బీదర్ తాలూకాలోని కడ్వాడ్ గ్రామానికి చెందిన దిలీప్ నాగప్ప భూసా తన మద్దతుదారులతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ప్రమాణాన్ని దిలీప్ చదివి వినిపించి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు.
మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment