NATA Convention
-
NATA Convention: సాక్షి ప్రతినిధి సింహాకు శంకర నేత్రాలయ అవార్డు
సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకు ప్రతిష్టాత్మక శంకర నేత్రాలయ అవార్డు దక్కింది. ఎంతో మంది అభాగ్యులకు కంటి వైద్యం అందించడంతో పాటు.. భారత్ తో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది శంకర నేత్రాలయ. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా 2023 తెలుగు మహాసభల సందర్భంగా తమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించినందుకు గాను సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతును సత్కరించింది శంకర నేత్రాలయ. నాటా కన్వెన్షన్ వేదికగా శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డులను అందించారు. డల్లాస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి చేతుల మీదుగా పలువురిని గుర్తించి అభినందించారు. శంకర నేత్రాలయ కార్యక్రమాలు ప్రేక్షకులకు చేరువ అవడానికి సహాకరించిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకి అవార్డు ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. శంకర నేత్రాలయ యూఏఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శంకర నేత్రాలయ ద్వారా ప్రెసిడెంట్ బాల రెడ్డి ఇందుర్తి మరియు టీమ్ కంటి వైద్య సేవాలను అందిస్తున్న విషయం విదితమే. తన సహాకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డితో పాటు సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సారీ... మీ పేరు మరచిపోయాను!) -
డాలస్ : అమెరికాలో అంగరంగ వైభవంగా నాటా వేడుకలు (ఫొటోలు)
-
అశేష జన సందోహం నడుమ..ముగిసిన 'నాటా' మహాసభలు
(డాలస్, అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అంగరంగ వైభవంగా నాటా వేడుకలు నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా మహాసభలు ఘనంగా ముగిసాయి. డల్లాస్ కన్వెన్షన్ సెంటరులో అశేష జనసందోహం నడుమ కోలాహలంగా విజయవంతంగా ముగిశాయి. ఒక్క ముగింపు రోజైన జూలై2 ఆదివారం నాడే 15వేల పైచిలుకు అతిథులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మూడురోజులకు కలిపి 25వేలకు పైగా అతిథులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటా నాయకుల ఏర్పాట్లకు తగ్గట్టుగానే మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్, రెండవరోజు తమన్ షో ఆహతులను ఆకట్టుకున్నాయి. అలాగే చివరి రోజైన జూలై2 ఆదివారం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ తో నాటా కన్వెన్షన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. వీటికి ధీటుగా వివిధ ఎక్సిబిట్ రూమ్ ల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. అధ్యాత్మికం.. భక్తి పారవశ్యం జులై 2న ఉదయాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస కల్యాణంతో ఆహ్వానితులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. తిరుపతి నుంచి వచ్చిన పండితులు శాస్త్రోక్తంగా శ్రీనివాస కల్యాణం పూర్తి చేశారు. అలాగే 108 మందితో అష్టోత్తరనామార్చన గావించారు. ప్రవాస భక్తులు, నాటా కార్యవర్గ సభ్యులు, పలువురు ప్రముఖులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు, APNRTS ఛైర్మన్ వెంకట్, టీటీడీ ఆగమ పండితులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. నేటి రాజకీయం.. నాటా తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రపై సదస్సు వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ చిరకాలం అందరి గుండెల్లో నిలిచిపోయారని మహానేతకు ఘన నివాళులర్పించారు. ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ కు ఘన నివాళులు కాలేజీ రోజుల్లో తాను చూసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, పాదయాత్ర అనంతరం చూసిన వై.ఎస్‌కు మధ్య చాలా మార్పు వచ్చినట్లు తాను గమనించానని నాటా వ్యవస్థాపకులు డా.ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు. పాదయాత్ర తర్వాత వై.ఎస్‌కు ప్రజల పట్ల, వారి కష్టాల పట్ల పెరిగిన అవగాహన కారణంగా మనిషిలో ఆశావాహ దృక్పథం, పేదలకు సాయం చేయాలనే సంకల్పం బలపడిందని అన్నారు. టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, డా.వై.ఎస్.ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు రాఘవరెడ్డి గోశాల, ఆళ్ల రామిరెడ్డి, వెంకట్, రత్నాకర్, లకిరెడ్డి హనిమిరెడ్డి తదితరులు వై.ఎస్ చిత్రపటానికి నివాళి అర్పించారు. నాటా సర్వీస్ అవార్డ్ ని నాటా మాజీ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసాల కి నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి చేతులమీదుగా అందించారు. అనంతరం వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్ ని వేదిక పైకి ఆహ్వానించారు. ప్రవాసాంధ్రులకు సీఎం జగన్ సందేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డెడ్ మెసేజ్ ని స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. నాటా కార్యవర్గానికి ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తో పాటు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ళ కిందట తాను డాల్లస్ వచ్చిన సందర్భం ఇప్పటికీ గుర్తుందన్నారు. మీరంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాటా మహా సభల్లో ప్రదర్శించిన ముఖ్యమంత్రి సందేశం నాటా కన్వెన్షన్‌కి హైలెట్‌గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల ఆలంనై మీట్స్ వివిధ రూమ్స్ లో నిర్వహించారు. ఎస్టేట్ ప్లానింగ్, టాక్స్ ప్లానింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, DRDO ఛైర్మన్ సతీష్ రెడ్డి తో ముఖాముఖీ, స్టార్ట్అప్స్, పొలిటికల్ డిబేట్స్, సదస్సులు సమాంతరంగా సాగాయి. నవరస భరితం.. సాంస్కృతిక సమ్మేళనం అలాగే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో రాముఇజం, తెలుగువారి సొంతమైన అవధానం కూడగలిపిన సాహితీ ప్రక్రియలు, షార్ట్ ఫిలిమ్స్, వివిధ నగరాలలో గెలిచిన నాటా బ్యూటీ పాజెంట్ విజేతలకు ఫైనల్స్ పోటీలు కొనసాగాయి. విజేతలకు మెయిన్ స్టేజ్ పై క్రౌన్ అందించారు. ఆర్ట్స్ ప్రదర్శన, సొగసు చూడతరమా అంటూ మహిళా సదస్సులు జరిగాయి. సాయంత్రం మెయిన్ స్టేజ్ పై సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం 50కే, 100కే మరియు ఆపైన సమర్పించిన స్పాన్సర్స్ ని, నాటా కార్యనిర్వాహక సభ్యులను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను, కన్వెన్షన్ వివిధ కమిటీల ఛైర్స్, కో-ఛైర్స్ లను వేదికమీదకు పిలిచి అభినందించారు. పలు కార్యక్రమాలు వైవిధ్యంగా సందడిగా సాగాయి. పేరడీ, శాస్త్రీయ, సినిమా నృత్య ప్రదర్శనలు, గాన ప్రదర్శనలు, పూర్వ విద్యార్థుల సంఘాల సమావేశాలతో అతిథులు బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్న కార్యక్రమాలకు ప్రధాన వేదికపై స్వర్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆకట్టుకున్న అందం నాటా బ్యూటీ పాజెంట్ ఫైనల్స్ విజేతలను ప్రకటించగా టీన్, మిస్, మిసెస్ కేటగిరీస్ లో విజేతలకు తెలుగు సినీ నటి తమన్నా క్రౌన్ అందించారు. సుమారు 30 మంది కలిసి చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇక సినీ నిర్మాత దిల్ రాజు, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఇండియా నుంచి విచ్చేసిన ఎంపీలు, మంత్రులకు సన్మానం గావించారు. నాటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి కి ప్రజంట్ చేయడం విశేషం. అలాగే నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కొర్సపాటిని సతీసమేతంగా సన్మానించారు. (చూడండి: నాటా మహాసభల చిత్రాలు ) అధ్యక్షుడి సందేశం తనకు, తన బృందానికి నాటా ద్వారా సేవ చేసే అవకాశాన్ని కల్పించి ఈ వేడుకలను విజయవంతం చేసిన వారికి డా.కొర్సపాటి శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాటా కన్వెన్షన్ ని విజయవంతం చేసినందుకు ఆహూతులకు, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు. 2025లో జరగనున్న నాటా మహాసభల గురించి ప్రెసిడెంట్ ఎలక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు తెలిపారు. నాటా తెలుగు మహాసభలు 2025లో జూన్ 27,28,29 తేదిలో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో నిర్వహించనున్నట్లు వివరించారు. చివరిగా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్ ప్రారంభించారు.దేవి శ్రీ ప్రసాద్ ట్రూప్ క్లాసికల్ పాటతో మొదలుపెట్టి మంచి బీట్ ఉన్న పాటలతో, అలాగే తన డాన్సులతో వేదిక ప్రాంగణాన్ని అదరగొట్టారు. దీంతో నాటా 3 రోజుల కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు పలికినట్టైంది. (చదవండి: నాటా మహాసభల్లో ప్రసంగించిన శ్రీ రవిశంకర్ గురూజీ) -
నాటా మహాసభల్లో ప్రసంగించిన శ్రీ రవిశంకర్ గురూజీ
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్‌లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. ఈ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ హాజరయ్యారు. మహాసభల్లో ఆయన మెడిటేషన్‌పై ప్రసంగించనున్నట్లు నాటా మహాసభల ఆధ్యాత్మిక కమిటీ చైర్ సుధాకర్ పెన్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు. వాషింగ్టన్ డీసీలో జరగుతున్న నాటా తెలుగు మహాసభలకు రావడం మొదటిసారిగా వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు అని ప్రశ్నించగా..ఇది మొదటిసారి కాదని, న్యూఢిల్లీ, జర్మనీలో బెర్లిన్ తదితర కార్యక్రమాల్లో హాజయరయ్యానని చెప్పారు. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి రీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిన వాళ్లందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చింది 'నాటా' అన్నారు. ఇది ఒకరకంగా మనమంతా ఒకే కుటుంబం అనే ఒక గొప్ప సందేశం ఇచ్చిందన్నారు. మన నేపథ్య ఏదైనా.. మనమంతా ఎప్పటికీ ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని ఎలుగెత్తి చాటారు. మొన్నటివరకు కోవిడ్ భయంతో డిప్రెషన్‌గా బిక్కుబిక్కుమంటూ నాలుగోడలకే పరిమితమైన అనంతరం ఆనందంగా నూతనోత్సహంతో జరుపుకుంటున్న ఒక వేడుక ఇది అని అన్నారు. అలాగే ప్రస్తుత టెక్నాలజీ ఆధ్యాత్మిక జీవనానికి ఉపకరించేదా భంగం కలిగించేదా అని ప్రశ్నించగా..మానవుని కంఫర్ట్ కోసమే కదా టెక్నాలజీ. దాన్ని మన జీవితాన్ని సుఖమయం చేసుకునేలా వాడుకోవడమనేది మన చేతుల్లోనే ఉంది. టెక్నాలజీ మనిషికి మంచే చేస్తుంది. ఉపయోగించే విధానంలోను ఉంది అంతా అని చమత్కారంగా చెప్పారు. మనం కాన్ఫిడెంట్‌గా ఎప్పుడూ ఉండగలం అని ప్రశ్నించగా.. మన మైండ్ క్లియర్‌గా ఉంటేనే అది సాధ్యం అని బదులిచ్చారు. మెడిటేషన్ అని సులభంగా చెప్పినంతా ఈజీ కాదు కదా చేయడం అని అడగగా..అదే కదా నా జాబ్ అని నవ్వుతూ జవాబిచ్చారు గురూజీ రవి శంకర్. మంచి గైడెన్స్‌లో చేయడం నేర్చుకుంటే అది ఈజీగానే చేయొచ్చు అని అన్నారు. మానవత్వానికి అతిపెద ఛాలెంజ్ వివక్ష, స్టీరియో టైప్ థింకింగ్ , ఫాల్స్ మైండ్ తదితరాలని అన్నారు. ఆ దుర్గుణాలని దూరం చేసిమంచి వైపు తీసుకువెళ్లగలిగేది మెడిటేషన్ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాను నక్స్‌లైట్లను కలుసుకున్న సందర్భం గుర్తు చేసుకుంటూ..ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ బోర్డర్ల మధ్య ఉన్న నక్సల్స్ ప్రాంతానికి వెళ్లానని, అక్కడ వారు తమ గురువు కారల్ మార్క్స్ అని చెప్పారన్నారు. అది వారి ఓపెనియన్. అక్కడ వారు తాము ఎంత వివక్షతకు గురయ్యమో వివరించారు. ఆ తర్వాత వారి చెప్పిందంతా ఓపికగా విన్నా. ఆ తర్వాత వారు నా ప్రసంగం విని నచ్చాక ..కాసేపు తనాతో కలిసి మెడిటేషన్ కూడా చేశారన్నారు. ఆ తర్వాత క్రమేణా వారి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. కొందరూ పూర్తి స్థాయిలో మారారు కూడా. మెడిటేషన్‌కి చాలా పవర్ ఉందని, కుల, మత భేదాలతో సంబంధం ఉండదని ఎవ్వరైన చేయొచ్చు. చివరిగా నువ్వేంటీ? అనేది నీ అంతరంగమే నీకు బోధించేలా చేస్తుందని రవిశంకర్ అన్నారు. ఇలా డల్లాస్‌లో జరిగిన నాటా మహాసభలో మెడిటేషన్ , ప్రాణాయామాకి సంబంధించిన విషయాలను గురించి చెప్పారు. (చదవండి: నాటా మహాసభలో..అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్) -
నాటా మహాసభలో..అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్‌లో ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా, టెక్సాస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 30 నుంచి జులై 2 వరకు జరుగుతున్న తెలుగు మహాసభల్లో భాగంగా అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది. నాటా మహాసభల్లో రెండోరోజు వేడుకల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఏపీలో వైకాపా ప్రభుత్వ ఏర్పాటుకు, పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో వైకాపా అభ్యర్థులు గెలుపొందటానికి ప్రవాసులు కృషి చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బయ్యపు మధుసుదనరెడ్డి తదితరులు కోరారు. గత ఎన్నికల సమయంలో ప్రతి ప్రవాస కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేశారని, మరలా ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైకాపా సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్రీయ కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా శ్రేణులతో కలిసి పనిచేయడం, సోషల్ మీడియా ఛానళ్లను ప్రభావవంతంగా వినియోగించుకోవడం, వైకాపాను ఆయా వేదికల ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, ఓటర్లకు చేరువ చేసే విధివిధానాలు, ప్రణాళికలను ఆయన సభికులతో పంచుకున్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ మహాసభల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. (చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాటా మహాసభలు..జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు) -
NATA Convention : అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
డల్లాస్, అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి జూన్ 30 నుంచి జులై 2 వరకు డల్లాస్‌లో జరిగిన నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన రాజన్న అభిమానులు, నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. (నాటా పూర్వ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి) ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ & ట్రైనింగ్ చల్లా మధుసూధన్ రెడ్డి, నాటా పాస్ట్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, నాటా సభ్యులు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల, ఏపీ ఎన్ఆర్టీ మేడపాటి వెంకట్, అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి, వైస్సార్సీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ చేసిన సేవల్ని, ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవ వైపు అడుగులు వైఎస్సార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎం.ఆర్.మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (నాటా వేదికగా జరిగిన వైఎస్సార్ జయంతికి హాజరైన ప్రముఖులు) ఓటమి ఎరుగని నేత 1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. ఉత్తాన పతనాలు వైఎస్సార్ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లోనూ వైఎస్సార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. వైఎస్సార్ సిపి @ నాటా వేడుకల కన్వెన్షన్ నాటా వేడుకల సందర్భంగా విచ్చేసిన అతిథులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేకంగా స్వాగతం పలికింది. డాలస్ లోని కన్వెన్షన్ సెంటర్ వద్ద తోరణాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ పరిపాలన ముఖ్యాంశాలను ప్రదర్శించింది. (అమెరికా డాలస్ లోని నాటా వేదిక) అమెరికాతో డా.YSRకు అనుబంధం మే 6, 2007న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారిక కార్యక్రమం కోసం అమెరికాలో అడుగుపెట్టారు. ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్య అతిథిగా డా.వైఎస్సార్‌ను ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. మే 8న మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం ఎలా వెన్నెముకగా నిలవాలన్న విషయాన్ని చర్చించారు. షికాగో వేదికగా ఎన్నారైలను ఉద్దేశించి వైఎస్సార్ చేసిన ప్రసంగం.. ఇప్పటికీ చాలామంది ఎన్నారైల మదిలోనే ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా రాజసమైన పంచెకట్టులో ఎన్నారైలపై చెరగని ముద్ర వేశారు రాజశేఖరరెడ్డి. తన చిరకాల మిత్రుడు ప్రైమ్ హాస్పిటల్స్ అధినేత ప్రేమ్‌సాగర్ రెడ్డితో కలిసి వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. (చదవండి: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం: నాటా తెలుగు మహా సభలనుద్దేశించి సీఎం జగన్) -
అమెరికాలో తెలుగు సంబరం
ఫిలడెల్ఫియా (అమెరికా) : సప్త సముద్రాల ఆవల తెలుగు మహా సంబరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నార్త్ అమెరికా తెలుగు అసొషియేషన్ (నాటా) ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సిద్ధమవుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరం వేదికగా జులై 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న నాటా మహా సభలకు ఏకంగా 13 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు నాటా సభలకు అతిథులుగా హాజరు కానున్నారు. సామాజిక సేవ, తెలుగు సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంగా ఏర్పడిన నాటా.. అనతి కాలంలో మహా వృక్షంగా మారింది. విద్యా, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వచ్చే వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చిన నాటా.. తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సేవలందించడం ప్రారంభించింది. నాటా ప్రతి రెండేళ్లకి ఒకసారి కన్వెన్షన్ నిర్వహిస్తుంది. 2016లో డల్లాస్‌లో, ఈ సారి ఫిలడెల్ఫియోలో వేడుకలు నిర్వహిస్తోంది. నాటా సమాజ సేవలో ముందుండడం, పూర్తి పారదర్శకంగా వ్యవహరించడం, తెలుగు వారి అవసరాలు తీర్చేలా ముందుకెళ్తోంది. గత రెండేళ్లలో అమెరికాలో తలెత్తిన ప్రకృతి విపత్తుల సమయంలోనూ తనవంతు సహాయ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సారి మహాసభలకు వివిధ రంగాల్లో ప్రముఖులు, వేర్వేరు పార్టీల రాజకీయ నాయకులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఇక మహాసభల్లో సాంస్కృతిక వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పలువురు సినీ నటులు, దర్శకులు, గాయినీ గాయకులు, రచయితలు, టీవీ ఆర్టిస్టులు నాటా వేడుకల కోసం అమెరికా వస్తున్నారు. మహాసభలకు ముందస్తుగా పలు కార్యక్రమాలు చేపట్టింది. నాటా నారి పేరుతో మహిళా సదస్సులు, యువత కోసం యూత్ వెల్నెస్ కార్యక్రమాలు, అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు, యూఎస్‌లోని వేర్వేరు నగరాల్లో ఆర్ట్ కాంపిటీషన్స్ , మ్యాట్రిమోనీ కార్యక్రమాలు నిర్వహించింది. నాటా మాట పేరుతో ఓ పత్రిక కూడా విడుదల చేసింది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి నాటాకు ప్రాతినిధ్యం ఉంది. నిజాయతీ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక సేవ అనే పునాదులపై నాటాను ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగు సంసృతి, వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాం. ఈ సారి ఫిలడెల్ఫియాలో జరగనున్న మహాసభలకు 13వేల మంది రానున్నారని సగర్వంగా చెబుతున్నాను. గత ఆరు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవాదళం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణలోని ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాం. బాలిక సంరక్షణ కోసం వరంగల్‌లో నిర్వహించిన జానపద నృత్య రీతులు నాటా చరిత్రలో సరికొత్త మైలురాయి. ‘సమాజ సేవే నాటా మాట - సంసృతి వికాసమే నాటా బాట’ అన్న మా నినాదాన్ని నిజం చేసే దిశగా ప్రయాణిస్తున్నాం. డాక్టర్ ప్రేం సాగర్ రెడ్డి, నాటా అడ్వైజరీ కౌన్సిల్ నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ (నాటా)తో ఎన్నారైలకు వీడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి మహాసభలకు తెలుగు ప్రజలు వేలాదిగా తరలివచ్చి దీవిస్తున్నారు. తెలుగు అనే భాష కింద అంతరాల్లేవు. ప్రాంతీయ బేధాలు లేవు. అందరం ఒకే గొడుగు కిందికి వస్తున్నాం. ఎక్కడో నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. నాకు 17 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మా ఊళ్లో కరెంటు గానీ, తాగు నీరు గానీ లేవు. అలాంటి పరిస్థితి నుంచి అమెరికాకు వచ్చి అతి పెద్ద ఆస్పత్రుల నెట్ వర్క్ ప్రైమ్ ఏర్పాటు చేసి 45వేల అమెరికన్లకు ఉద్యోగలిచ్చా. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు. నేను సంపాదించిన దాన్ని సమాజానికి పంచేందుకు దాత్రుత్వాన్ని ఎంచుకున్నా. సమాజానికి వీలైనంత అందిస్తున్నా. అదే స్పూర్తితో నాటాను ఏర్పాటు చేశాం. నడిపిస్తున్నాం. నాటా వేదికగా వైఎస్సార్ జయంతి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ వేదికగా నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ తెలిపింది. నాటా నిర్వహించనున్న పొలిటికల్ ఫోరంలో భాగంగా డా.వైఎస్సార్ ను స్మరించుకుంటామని ప్రకటించింది. మహా సభలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ను ఆహ్వానించారని, అయితే పాదయాత్ర కారణంగా ఆయన రాలేకపోతున్నారని పార్టీ తెలిపింది. నాటా ప్రతినిధులు, అతిథులను ఉద్దేశించి తన సందేశాన్ని వైఎస్ జగన్ పంపనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారని చెప్పారు. -
డల్లాస్‌లో ప్రారంభమైన నాటా వేడుకలు
హైదరాబాద్: అమెరికాలోని డల్లాస్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) కన్వెన్షన్ వేడుకలు భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో నటి హంసానందిని సందడి చేసింది. మరో నటి ప్రణీత ఈ వేడుకల కోసం అక్కడకు చేరుకుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాజకీయ, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. -
వేడుకలకు రెడీ అవుతున్న NATA