హైదరాబాద్: అమెరికాలోని డల్లాస్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) కన్వెన్షన్ వేడుకలు భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో నటి హంసానందిని సందడి చేసింది. మరో నటి ప్రణీత ఈ వేడుకల కోసం అక్కడకు చేరుకుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాజకీయ, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు.