ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం చాలా కష్టం. గతంలో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన బండ్ల గతేడాది అక్టోబర్‌లో పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాడు. కుటుంబ బాధ్యతల వల్ల రాజకీయాలకు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. పలు ఇంటర్వ్యూలలోనూ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని కుండ బద్ధలు కొట్టిన ఆయన తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది.
ఈ మేరకు బండ్ల గణేశ్ వరుస ట్వీట్లు చేశాడు. మొదటగా 'రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం..' అంటూ అభిమానుల్లో ఆసక్తిని రేపాడు. తర్వాత కాసేపటికే 'నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా' అంటూ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు. మరో ట్వీట్‌లో 'బానిసత్వానికి బైబై, నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై.. రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం..
నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం 🔥🔥🔥🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా 🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి, రావాలి. అందుకే వస్తా!' అని రాసుకొచ్చాడు. దీంతో బుర్ర గోక్కుంటున్న నెటిజన్లు 'ఇలా యూటర్న్ తీసుకున్నావేంటన్నా?', 'ఇంతకీ ఏ పార్టీలో చేరాలనుకుంటున్నావో.. ముందు అది చెప్పు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేశ్ ట్వీట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా🔥🔥🔥🔥🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్‌సింగ్, టెంపర్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో హిట్ చిత్రాల నిర్మాతగా పేరు సంపాదించాడు బండ్ల గణేశ్. నటుడిగానూ పలు సినిమాలతో సత్తా చాటిన ఆయన చివరగా డేగల బాబ్జీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.
Comments
Please login to add a commentAdd a comment