బ్యాంకు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ దారుణ హత్య
బ్యాంకు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ దారుణ హత్య
Published Wed, Apr 26 2017 12:24 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
ఇల్లు అద్దె కోసం వచ్చి హత్యకు పాల్పడిన యువకులు ∙
కాకినాడలో కలకలం రేపిన ఘటన
కాకినాడ క్రైం : విశ్రాంత ఉద్యోగుల స్వర్గధామంగా పిలుచుకునే అశోక్‌నగర్–ఎస్‌బీఐ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని హాయిగా భార్యతో జీవిస్తూ.. తన ఇద్దరు కుమారులు అమెరికాలో స్థిరపడటంతో.. ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకిచ్చేందుకు ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డు కారణంగా తన ప్రాణం పోతుందని ఊహించలేక పోయాడా పెద్దాయన. అద్దె ఇల్లు కోసమంటూ వచ్చిన యువకులు బ్లేడ్ కట్టర్‌తో రిటైర్డు ఉద్యోగి గొంతు కోసి హతమార్చిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులో కొచి్చంది.
టూలెట్ బోర్డు చూసి..
కాకినాడ అశోక్‌నగర్ ఎస్‌బీఐ కాలనీకి చెందిన రిటైర్డ్ స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ బులుసు సూరయ్య (72) తన భార్య విజయలక్షి్మతో కలసి జీప్లస్ వ¯ŒS ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులిద్దరూ ఆదిత్యదత్, సత్యవెంకట చంద్రమౌళిదత్‌లు అమెరికాలో స్థిరపడ్డారు. కనకవల్లి రాధిక, శ్రీపద్మలకు వివా హం కావడంతో పెద్ద కుమార్తె బెంగళూరు, చిన్నకుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. జీప్లస్ వ¯ŒS గృహం పై అంతస్తులో భార్యా భర్తలిద్దరూ నివసిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్ గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండటంతో అద్దెకిచ్చేందుకు టూలెట్ బోర్డు పెట్టారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గేటు దూకి ముగ్గురు యువకులుపై అంతస్తులోకి వచ్చి కాలింగ్ బెల్లు కొట్టి ఇల్లు అద్దెకు కావాలని కోరారు. విజయలక్ష్మి భర్త సూరయ్యకు కింద పోర్ష¯ŒS తాళాలిచ్చి పంపించింది. కిందక వెళ్లిన భర్త పైకిరాకపోవడంతో ఆమె కిందకు వచ్చింది. అప్పటికే సూరయ్యను గొంతు కోసేసి హత్యకు పాల్పడి, గదిలో పడేసి తాళాలు వేసేసి బయట నిలుచున్నారు. మా ఆయన ఎక్కడకు వెళ్లారని ఆమె ప్రశ్నించగా బయటకెళ్లారని సమాధానమిచ్చారు. కంగారుగా బయటకు వచ్చిన ఆమె ఆటో ఎక్కి పరిసరాలు గాలించింది. ఆ ముగ్గరు యువకులు ఆటో వెనుకే బైక్‌లపై వెళ్లి, తిరిగి ఆటోతో పాటు ఇంటికి వచ్చేశారు. దాహం వేస్తోంది. మంచినీళ్లు కావాలంటూ కోరడంతో ఆమె మేడపైకి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అనంతరం ఆ యువకులు టీపాయ్‌పై ఉన్న సెల్‌ఫోన్, పక్కనే ఉన్న ల్యాప్‌టాప్‌ను దొంగిలించారు. భర్త ఆచూకీ కోసం కాకినాడ శ్రీనగర్‌లో ఉంటున్న సోదరుడు వారణాసి హనుమంతుకి సమాచారం ఇచ్చేందుకు సెల్‌ఫో¯ŒS వెతకగా కనిపించలేదు. ల్యాప్ టాప్ కూడా కనిపించకపోయేసరికి ఆగంతకులపై అనుమా నం వచ్చింది. వెంటనే ఆమె దొంగ..దొంగా అంటూ బిగ్గరగా అరవడంతో వారు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. షాక్‌కు గురైన విజయలక్షి్మని చూసేందుకు స్థానికులు వచ్చి పరా మర్శించారు. సెల్‌ఫో¯ŒS సమాచారంతో సోదరి ఇంటికి చేరుకున్న హనుమంతు బావ కోసం చుట్టుపక్కల పరిసరాలను గాలించాడు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సోమవారం అర్ధరాత్రి పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న టూటౌ¯ŒS సీఐ ఉమర్ వచ్చి తాళం తీసి పరిశీలించారు. పోర్ష¯ŒS ముందు గదిలో రక్తం మరకలు ఉండటం, రక్తం మరకల్లో పాదం గుర్తులు, అవి వంట గది వరకు ఉండడం గమనించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సూరయ్యను గమనించారు. సీఐ మహ్మద్ ఉమర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ ఏఆర్ దామోదర్, కాకినాడ క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావులు మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం బృందం, డాగ్‌స్కా్వడ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, క్రైం డీఎస్పీ పల్లపురాజుల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోస్ట్‌మార్టం కోసం సూరయ్య మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించినట్టు తెలిపారు.
హత్యపై పలు అనుమానాలు
డబ్బు, బంగారం కోసం ఆశపడి వచ్చిన దొంగలు అవేమి పట్టు కెళ్లకుండా కేవలం సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ తీసుకెళ్లడం, అకారణంగా ఇంటి యాజమానిని గొంతు కోసి హత్యకు పాల్పడటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లిన నిందితులు దానిని డ్రైనేజీ వద్ద పారేసి వెళ్లిపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు నిందితుల్లో ఒకరిని విజయలక్ష్మి గుర్తించింది. ఇతను కరణంగారి సెంటర్లోని ఒక మెడికల్ షాపులో పనిచేసేవాడని, రెండు నెలల క్రితం మందులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినట్టు తెలిపింది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నా భర్తను చంపేసి మంచినీళ్లు అడిగారు
నాభర్తను హత్య చేసి ఏమీ తెలియనట్టు నిందితులు పైకి వచ్చి మంచినీళ్లు కావాలని కోరారు. రెండు గ్లాసుల్లో మంచినీరు తీసుకొచ్చి ఇచ్చాను. మంచినీరు తాగేసి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను దొంగిలించారు. బంగారం, నగదు అడిగితే వెంటనే తీసి ఇచ్చేదాన్ని. నా భర్తను పొట్టన పెట్టుకున్నారంటూ విజయలక్ష్మి కన్నీటిపర్యంతమైంది.
Advertisement