సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే అంశం మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో పొంగులేటి రేపు(శుక్రవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. దీంతో, ఆయన నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
అయితే, పొంగులేటి రేపు ఖమ్మంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉభయ జిలాల్లోని మండలానికి ఐదుగురు చొప్పున ముఖ్య నాయకులకు పొంగులేటి నుంచి పిలుపు అందినట్టు సమాచారం. నియోజక వర్గానికి 30 నుంచి 50 మంది చొప్పున నాయకులకు సమావేశానికి రావాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మార్పుపై ముఖ్య నాయకులకు తెలుపనున్నట్టు సమాచారం. కాగా, రేపటి సమావేశంలో పార్టీ మార్పుపై పొంగులేటి కీలక నిర్ణయం ప్రకటించనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉండగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీ మార్పుపై రోజుకో ప్రచారం జరుగుతున్నది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం తథ్యమని విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. పొంగులేటితో భేటీ అయ్యారనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో, బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జోరందుకుంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఎమోషనల్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment