సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇక, ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే, పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులను అధికార బీఆర్‌ఎస్ పార్టీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
తాజాగా పొంగులేటి అనుచరులపై పాత కేసులు తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబుపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఓ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక, డీసీసీబీ మాజీ ఛైర్మన్ విజయ్ బాబు బ్యాంకు కేసును సీఐడీకి అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటి మద్దతుదారులు స్పందించారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కక్షపూరితంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొంగులేటి నేడు(ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో చేరికపై రాహుల్ గాంధీతో వీరు చర్చించనున్నారు. ఈ క్రమంలో ఖమ్మంపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీంతో, అధికార బీఆర్‌ఎస్ పార్టీ అలర్డ్ అయ్యింది. సీఎం కేసీఆర్ కూడా ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో మాట్లాడుతూ అక్కడి పొలిటికల్ సమీకరణాలను తెలుసుకుంటున్నారు. అటు, బీజేపీ కూడా ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తోంది. దీంతో, ఖమ్మంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి?
Comments
Please login to add a commentAdd a comment