
ఖమ్మంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్‌రావు వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్‌రావు వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
వరద బాధితులను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.. బడ్జెట్‌లో సున్నా, వరద సాయంలోనూ సున్నా’’ అంటూ హరీష్‌రావు మండిపడ్డారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తే, ప్రధానిని నిలదీద్దామని హరీష్‌రావు అన్నారు. రాష్ట్ర, కేంద్ర నిర్లక్ష్యానికి మహబూబాబాద్, ఖమ్మం ప్రజలు బలైపోయారు. సాగర్ కెనాల్ కొట్టుకుపోవడం వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన మండిపడ్డారు.