ఖమ్మంలో కాంగ్రెస్‌ సభ.. అదే రోజు భట్టికి రాహుల్‌తో సత్కారం | Manik Rao Thakre On Khammam Meeting Bhatti Peoples March | Sakshi
Sakshi News home page

జూలై 2న కాంగ్రెస్‌ ‘జనగర్జన సభ’.. అదే రోజు భట్టికి రాహుల్‌తో సత్కారం

Published Wed, Jun 28 2023 5:54 PM | Last Updated on Wed, Jun 28 2023 6:25 PM

Manik Rao Thakre On Khammam Meeting Bhatti Peoples March - Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు బుధవారం ఖమ్మంలో  పర్యటించారు. జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ గురించి ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా ఆసక్తికరంగా చర్చలు జరిపారు. అనంతరం రాహుల్‌గాంధీ  విచ్చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని మాణిక్‌రావు ఠాక్రే పరిశీలించారు.

ఈ సందర్భంగా మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. జూలై 2న లక్ష మందితో ఖమ్మంలో కాంగ్రెస్‌ జన గర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ ముగింపు కూడా అదే రోజు ఉంటుందని పేర్కొన్నారు. పీపుల్స్‌ మార్చ్‌ను దిగ్విజయంగా పూర్తి చేసిన భట్టిని ఆ సభలో రాహుల్‌ గాంధీ ఘనంగా సత్కరిస్తారని చెప్పారు. అదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. 

భట్టి పాదయాత్ర సక్సెస్‌ అయ్యిందని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. పీపుల్స్‌ మార్చ్‌ ‌ముగించుకొచ్చే ముగించుకొచ్చే భట్టి విక్రమార్కకు స్వాగతం పలికే వారిలో పొంగులేటి కూడా ఉంటారన్నారు.

చదవండి: కాంగ్రెస్‌ VS బీజేపీ: పీవీ జయంతి చుట్టూ రాజకీయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement