సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీడ్ పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జూపల్లి కృష్షారావు కలిశారు.
కాగా, వీరి భేటీ అనంతరం మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే చర్చలు జరిగాయి. నాగర్ కర్నూల్‌లో నాగం జనార్ధన్ రెడ్డితో చర్చిస్తాం. నాగంతో ఇప్పటికే జనారెడ్డి చర్చించారు. జూపల్లి కృష్ణారావుతో చర్చించాం. ఈనెల 12న పొంగులేటి శ్రీనివాస్ నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత లేదు అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. మల్లు రవి నివాసానికి వనపర్తి నియోజకవర్గానికి చెందిన పెద్ద మందాడి బీఆర్‌ఎస్ ఎంపీపీ మేఘా రెడ్డి చేరుకున్నారు. మల్లు రవితో మేఘారెడ్డి భేటీ అయ్యారు. కాగా, కొన్ని రోజుల క్రితమే మేఘారెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతలపై థాక్రే సీరియస్
Comments
Please login to add a commentAdd a comment