jupalli krishnarao
-
నెక్లెస్‌రోడ్డులో లైట్ అండ్ సౌండ్ లేజర్‌షో ప్రారంభం (ఫొటోలు)
-
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ లో చేరనున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
-
కోమటిరెడ్డితో జూపల్లి భేటీ.. కాంగ్రెస్‌లోకి లైన్‌క్లియర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ముందే పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో తెలంగాణలో కీలక నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే పక్రియను వేగవంతం చేసింది. కాగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. ఇక, వీరి భేటీ అనంతరం కోమటిరెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పాను. నల్లగొండలో 18 లేదా 19 తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుంది. ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్ అంటే ఏంటో చూడండి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరతానో ఇంకా డిసైడ్ అవ్వలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. పార్టీలో చేరే ముందు జూపల్లి ముఖ్య నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, నేడు కోమటిరెడ్డితో భేటీ అయ్యారు జూపల్లి. ఇది కూడా చదవండి: ఖమ్మంలో అమిత్‌షా సభ అదిరిపోవాలి.. -
ఈనెల 12న పొంగులేటి ప్రకటన ఉండొచ్చు!: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీడ్ పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జూపల్లి కృష్షారావు కలిశారు. కాగా, వీరి భేటీ అనంతరం మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే చర్చలు జరిగాయి. నాగర్ కర్నూల్లో నాగం జనార్ధన్ రెడ్డితో చర్చిస్తాం. నాగంతో ఇప్పటికే జనారెడ్డి చర్చించారు. జూపల్లి కృష్ణారావుతో చర్చించాం. ఈనెల 12న పొంగులేటి శ్రీనివాస్ నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత లేదు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మల్లు రవి నివాసానికి వనపర్తి నియోజకవర్గానికి చెందిన పెద్ద మందాడి బీఆర్ఎస్ ఎంపీపీ మేఘా రెడ్డి చేరుకున్నారు. మల్లు రవితో మేఘారెడ్డి భేటీ అయ్యారు. కాగా, కొన్ని రోజుల క్రితమే మేఘారెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతలపై థాక్రే సీరియస్ -
పొంగులేటి,జూపల్లి వర్సెస్ బీఆర్ఎప్
-
మహాకూటమి అడ్రస్ గల్లంతే
ఆమనగల్లు(రంగారెడ్డి): అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలో మహాకూటమి అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కడ్తాల్ మండలం చరికొండ, ముద్విన్ గ్రామాల్లో బుధవారం టీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల శంఖారావంలో మంత్రి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతుండడంతో రాష్ట్రం అగ్రగామిగా తయారైందని చెప్పారు. రాష్ట్రంలోని 23 వేల గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఇచ్చిన హామీ మేరకు కల్వకుర్తికి సాగునీరు అందించాం.. మరో రెండునెలల్లో ఆమనగల్లు, వెల్దండ, మాడ్గుల మండలాలకు సైతం అందజేస్తామని వివరించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు రెండేళ్లలో సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టు కేసులకు వెళ్లకపోతే ఈ పాటికి సాగునీరు అందేదని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ నాయకులు.. ఆమె ఎందుకు ఇచ్చింది.. ఎవరి ఉద్యమంతో దిగివచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ వందకు పైగా స్థానాలు సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ నేడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహాకూటమి గల్లంతవడం ఖాయమని చెప్పారు. మహాకూటమి, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవన్నారు. గతంలో చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా గెలిచిన వంశీచంద్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుం డా చేయాలని ఆయన ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, ఆమనగల్లు సిం గిల్‌విండో చైర్మన్ దశరథ్‌నాయక్, కల్వకుర్తి టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి బాలాజీసింగ్, కడ్తాల రైతు సమన్వయ సమిటీ కన్వీనర్ జోగు వీరయ్య, మం డల టీఆర్ఎస్ అధ్యక్షుడు తులసీరాంనాయ క్, చరికొండ సర్పంచ్ లాల్కోట నర్సింహాగౌడ్, ఎం పీటీసీ సభ్యురాలు యాదమ్మ, టీఆర్ఎస్ నాయ కులు పర్వతాలు, మాధవయ్య, చల్లా రాం రెడ్డి, భీష్మాచారి, లక్ష్మయ్య, జంగయ్య, గోపాల్, సాబేర్ అలీ, నవీన్, దీప్లా తదితరులు పాల్గొన్నారు. మంత్రి ప్రచారానికి ఎమ్మెల్సీ దూరం కల్వకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా కడ్తాల మండలం చరికొండలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన ప్రచారానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. కల్వకుర్తి నుంచి పోటీకి ఆయన ఆసక్తి చూపినప్పటికీ అధిష్టానం జైపాల్‌యాదవ్‌కు ఖరారు చేయడంతో ఎమ్మెల్సీ అసంతప్తితో ఉన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జైపాల్యాదవ్తోపాటు ఇతర నాయకులను బుజ్జగించారు. అయినా, ఎమ్మెల్సీ ప్రచారానికి రాకపోవడంతో చర్చకు దారితీసింది. ఇదే సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో త్వరలో అందరు నాయకులు పాల్గొంటారని చెప్పడం విశేషం. ప్రచారానికి గోలి శ్రీనివాస్‌రెడ్డి, విజితారెడ్డి కూడా డుమ్మాకొటారు. -
రైతుబంధు దేశానికే ఆదర్శం
పాన్‌గల్ : వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గురువారం ఆయన అన్నారం, చిక్కేపల్లి గ్రామాల్లో రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు, నూతన పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్ల మాట్లాడుతూ.. సీఎం దేశానికి వెన్నెముక లాంటి రైతుల ఆత్మగౌరవం పెంచారని కొనియాడారు. రబీ, ఖరీఫ్‌లో రూ.8వేలు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నారని చెప్పారు. పాసు పుస్తకాలను కుదువ పెట్టుకోకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పెట్టుబడి సాయం, కొత్త పాసుపుస్తకాలు తెలంగాణ దేశానికి దిక్సూచి లాంటివన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 58లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చుచేస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు జూన్ 2వ తేదీ నుంచి రైతుకు ప్రమాద బీమా కింద రూ.ఐదులక్షలు చెల్లించనున్నట్లు ఆయన వెల్లడించారు. 70ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తుందని కొనియాడారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం రైతుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ ఆయన చిత్రపటానికి పాలా భిషేకం చేశారు. బంగారు తెలంగాణ అభివృద్ధిలో పార్టీలకతీతంగా అందరు సహకరించాలని మంత్రి జూపల్లి కోరారు. కార్యక్రమంలో జేసీ చంద్రయ్య, ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, వైస్ ఎంపీపీ లక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మహేష్‌నాయుడు, నర్సింహ పాల్గొన్నారు. -
ఆగస్టు 15 కల్లా ‘ఈ–పంచాయతీ’: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో ఈ– పంచాయతీ వ్యవ స్థను అమలు చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఆన్లైన్లో పౌర సేవలను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. ఆగస్టు 15వ తేదీకల్లా ఈ–పంచాయతీని ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సోమవారం ఇక్కడ మంత్రి సమీక్షించారు. గ్రామాల్లో ఆగస్టు 15 నాటికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపు లాంటి అన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
అడిగినంత ‘ఉపాధి’!
ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో పని కావాలని కోరిన అన్ని కుటుంబాలకు పరిమితి లేని విధంగా పనులను కల్పించవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జూపల్లి అధ్యక్షతన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయంలో ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కౌన్సిల్లో చర్చించిన పలు అంశాలను జూపల్లి విలేకరులకు వివరించారు. ఉపాధిహామీ పనుల్లో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలి పేలా అందరి భాగస్వామ్యంతో ముందుకు పోవాలని కౌన్సిల్ తొలి సమావేశం నిర్ణయించిందని తెలిపారు. జాబ్‌కార్డు కలిగిన 54 లక్షల కుటుంబాల్లో కనీసం 60 శాతం మందికి ఈ ఏడాది మార్చి 31లోగా 100 రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. జిల్లా స్థాయిలోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉపాధి పనుల్లో వేగం పెంచాలని, నిధులకు కొరత లేదని పేర్కొన్నారు. నర్సరీల్లో 100 రోజుల నిబంధన సడలింపు ఉపాధి హామీ పథకం కింద నర్సరీల్లో 100 రోజులు మాత్రమే పనిచేసే నిబంధనను సడలిస్తున్నట్లు జూపల్లి పేర్కొన్నారు. దివ్యాంగులైన కూలీలకు 150 రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించామని వెల్లడించారు. 100 రోజుల వేతనానికి అయ్యే సొమ్మును కేంద్రం చెల్లించనుండగా, మిగిలిన 50 రోజుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఈ ఏడాదికి మంజూరైన 10 కోట్ల పనిదినాలకు అదనంగా మరో 6 కోట్ల పని దినాలు కావాలని కోరగా, కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. లక్ష్యానికి మించి పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమం, నీటిపారుదల శాఖల కార్య దర్శులు సోమేశ్ కుమార్, వికాస్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ వరంగల్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్లు పద్మ, తుల ఉమ పాల్గొన్నారు. -
తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో మరోసారి స్వల్ప మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు పరిశ్రమల శాఖ, జూపల్లి కృష్ణారావుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ ఇప్పటికే పంచాయితీరాజ్, ఐటీతో పాటు మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండు, మూడు రోజుల్లో శాఖల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక గతంలోనూ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరికి విద్యా శాఖ కేటాయించి, అప్పటి వరకు విద్యా శాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. -
రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం
హైదరాబాద్: తెలంగాణ నూతన పారిశ్రామిక చట్టం టీఎస్ ఐపాస్ కింద మరో విడత మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా 14 కంపెనీలకు అనుమతి పత్రాలు అందించారు. రూ.1118 కోట్ల పెట్టుబడులకు అనుమతులు పొందిన కంపెనీల అధినేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. -
'ఆయన మృదుస్వభావి కాదు.. ముదురు స్వభావి'
- కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై మంత్రి జూపల్లి విసుర్లు సాక్షి, హైదరాబాద్: తమ పాలనా కాలంలో ప్రజలకు చేసిన అన్యాయాలకు, పాపాలకు కాంగ్రెస్, టీడీపీలు రెండు చెంపలు వేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ రెండు పార్టీలూ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు కడిగేసుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదన్నారు. ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జూపల్లి.. మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలో జరిగిన సంఘటనపై స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంమ్మోహన్‌రెడ్డి పోడియం వద్దకు వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కులం పేరుతో దూషించడం వల్లే గొడవ జరిగిందని, ఈ సంఘటనను అడ్డం పెట్టి కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న తంతు కుళ్లు రాజకీయాలను తలపిస్తోందని విమర్శించారు. వ్యక్తిగత అంశానికి జిల్లా బంద్‌కు పిలుపు ఇస్తారా..? గవర్నర్‌ను కలుస్తారా? అని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మృదు స్వభావి అని సిఎల్పీ నేత జానారెడ్డి కితాబు ఇవ్వడం దారుణమని, రాంమోహన్‌రెడ్డి ముదురు స్వభావి అని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చైనా పర్యటనను టీడీపీ నాయకులు విమర్శించడం విడ్డూరమని, టీడీపీ నేతల మాదిరిగా దోపిడి చేసిన సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు విహార యాత్రలు చేసే సంస్కృతి టీఆర్ఎస్కు లేదన్నారు. కొద్ది నెలల్లోనే ఏపీ సీఎం రూ.22కోట్లు ఖర్చు చేసి విదేశాల్లో పర్యటించిన అంశాన్ని టీడీపీ నేతలు మాట్లాడాలని జూపల్లి డిమాండ్ చేశారు. -
'బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తాం'
హైదరాబాద్ : పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై టీడీపీ నేతలు బహిరంగ చర్చకు వస్తే నిజనిజాలను నిరూపించడానికి తాను సిద్ధమని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చల వివాదం రోజురోజుకు ముదురుతోంది. మంత్రి జూపల్లి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ ల మధ్య వివాదం కొనసాగుతోంది. రావుల కోసం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మంత్రి జూపల్లి రెండు గంటల పాటు ఎదురుచూశారు. బహిరంగ చర్చకు రాలేక టీడీపీ నేతలు తోక ముడిచారంటూ జూపల్లి విమర్శలు గుప్పించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతతల పథకం ఆపాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం వాస్తవమని ఆయన ఆరోపించారు. బాబు హయాంలో పాలమూరులోని 4 ప్రాజెక్టులకు రూ.10 కోట్లకు మించి ఖర్చుపెట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసిరాని ఆ పార్టీ నేతలు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో కూడా అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. బహిరంగ చర్చకు రానిపక్షంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో లేఖ రాయించాలని టీటీడీపీ నేతలను జూపల్లి డిమాండ్ చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు. -
'పెదబాబైనా, చినబాబైనా చర్చకు రెడీ'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. చంద్రబాబు హయంలో నీటిపారుదల రంగం కుంటుపడిందని విమర్శించారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీకి జూపల్లి సవాల్ విసిరారు. శనివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వస్తామని, చంద్రబాబయినా లేక చినబాబుతో అయినా చర్చకు సిద్ధమని ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై టీటీడీపీ నేతల వైఖరి స్పష్టం చేయాలని జూపల్లి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రజల నిరసన తీసుకెళ్లేందుకే పాలమూరు బంద్‌కు పిలుపునిచ్చినట్టు జూపల్లి చెప్పారు. -
'అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన టీఎస్ ఐపాస్ విధానం అమలులోనూ అంతే వేగంతో ముందుకు వెళుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రెండు వారాల్లోపే 17 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పెద్దపెద్ద కంపెనీలన్నీ ఆసక్తి చూపుతున్నాయన్నారు. తన అమెరికా పర్యటనలోనూ పలు కంపెనీలు తెలంగాణ వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. పరిశ్రమల్లో ఉపాధి పొందగోరే యువకుల కోసం పది జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఓటుకు కోట్లు కేసుపై స్పందిస్తూ దొరికిన దొంగ తప్పించుకునే ప్రయత్నాలు.. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధిని ఏ విధంగానూ ప్రభావం చూపవన్నారు. -
చక్కెర కొంటే.. బకాయి తీరుస్తాం
- మంత్రులు ఈటల, జూపల్లితో భేటీలో సిస్మా ప్రతినిధులు హైదరాబాద్: చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు.. చక్కెర కర్మాగారాల యాజ మాన్యాల ఇబ్బందులపై రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు దక్షిణ భారత చక్కెర కర్మాగారాల యాజమాన్యాల అసోసియేషన్(సిస్మా-తెలంగాణ) ప్రతినిధులతో బుధవారం రాష్ట్ర పౌర సరఫరాలు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెరకు రైతుల బకాయిలు తీర్చేందుకు తమ వద్ద ఉన్న చక్కెర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా సిస్మా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 11 చక్కెర కర్మాగారాల పరిధిలో యాజమాన్యాలు రూ.184 కోట్ల మేర రైతులకు బకాయిలు చెల్లించాలి. మూడు సహకార చక్కెర కర్మాగారాల పరిధిలోనే రూ.50 కోట్ల మేర రైతులకు బకాయిలు ఉన్నాయి. చక్కెర దిగుమతులపై పన్ను విధింపు, మొలాసిస్ ఎగుమతులపై పన్ను రద్దు, అమ్మకాలపై వ్యాట్ రద్దు వంటి అంశాలను పరిశీలించాలని సిస్మా ప్రతినిధులు కోరారు. చక్కెర కర్మాగారాల నుంచి బిడ్డింగ్ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు మంత్రులు ఈటెల, జూపల్లి సుముఖత వ్యక్తం చేశారు. చక్కెర పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశం అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చెరకు రైతుల సమస్యలపై సీఎంకు నివేదిక అందిస్తామన్నారు. చక్కెర మార్కెటింగ్‌లో ఇబ్బందుల్ని తొలగించి రైతులకు మేలు కలిగేలా చూస్తామన్నారు. -
నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించాలి: జూపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: నిజాం సహకార చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని కోరినట్టు పరిశ్రమలు, చక్కెర, చేనేత, జౌళి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. చెరకు పరిశ్రమ, రైతుల సమస్యలపై రాష్ట్రాల మంత్రులతో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2008లో మూతపడిన నిజాం షుగర్‌ను పునరుద్ధరించడంతో పాటు క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచాలని కోరినట్టు అనంతరం విలేకరులకు తెలిపారు. దేశంలో సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఒక పథకాన్ని ఏర్పాటు చేయాలని సూచించానన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను చెరకు క్రషింగ్‌కు వాడితే రైతుకు ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేల దాకా లబ్ధి చేకూరుతుందని, పరిశ్రమపైనా భారం పడదని అన్నారు. చక్కెర దిగుమతి సుంకాన్ని పెంచాలని, చెరకు మద్దతు ధరను రూ.2,200 నుంచి 3,200కు పెంచాలని సూచించానని చెప్పారు.